Begin typing your search above and press return to search.

భారత క్రికెటర్లకు ఏడాదికి వందకోట్లు..ఇంగ్లండ్‌ ఆటగాళ్ల జీవిత సంపాదన

అందుకే రవిశాస్త్రి క్రికెట్‌ గురించి చెప్పేవి అన్నీ కచ్చితంగా నిజాలే అయి ఉంటాయి.

By:  Tupaki Desk   |   26 July 2025 3:00 AM IST
భారత క్రికెటర్లకు ఏడాదికి వందకోట్లు..ఇంగ్లండ్‌ ఆటగాళ్ల జీవిత సంపాదన
X

టీమ్‌ఇండియాలో చోటు దక్కడమే చాలా కష్టం..ఒక్కసారి కుదురుకుని ఆడితే ఇక తిరుగుండదు.. భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) కాంట్రాక్టు దక్కితే మరింత భద్రత.. ఇక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఉండనే ఉంది. ఎటు చూసినా కోట్లకు కోట్లు.. ధన కనకవర్షం.. ఇదంతా సాధారణ క్రికెటర్ల విషయంలో.. మరి స్టార్‌ ఆటగాళ్లు.. అందులోనూ దిగ్గజాలు అయితే..? మ్యాచ్‌ ఫీజులు, ఐపీఎల్‌ వేలం ధర, బీసీసీఐ కాంట్రాక్టు కాకుండా వారి నెల సంపాదన ఎంత ఉంటుంది..? ఏడాదికి ఎంత ఉంటుంది? అనే ప్రశ్నలు సామాన్య అభిమానుల్లో రావడం సహజం. కానీ, దీనికి కచ్చితంగా జవాబు చెప్పగల వారు ఎవరు ఉంటారు..?

టీమ్‌ ఇండియా మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి గురించి అందరికీ తెలిసిందే. క్రికెట్‌తోనే ఆయన జీవితం ముడిపడి ఉంది. ఆటగాడి కంటే కామెంటేటర్‌గా, కోచ్‌గా రవిది అద్భుత ప్రయాణం. ఆయన గొంతులో నుంచి టీమ్‌ ఇండియా ప్రపంచ కప్‌ గెలిచిందనే కామెంట్రీ వినాలని అభిమానులు ఆశిస్తారు. అందుకే రవిశాస్త్రి క్రికెట్‌ గురించి చెప్పేవి అన్నీ కచ్చితంగా నిజాలే అయి ఉంటాయి. తాజాగా టీమ్‌ ఇండియా మాజీ దిగ్గజాలు ముగ్గురి సంపాదన ఎంంతో వివరించాడు ఈ మాజీ హెడ్‌ కోచ్‌. క్రికెట్‌ దేవుడిగా కొలిచే సచిన్‌ టెండూల్కర్‌, మేటి ఆటగాళ్లు మహేంద్ర సింగ్‌ ధోనీ, విరాట్‌ కోహ్లిలు ఏడాదికి రూ.వంద కోట్లు సంపాదిస్తారని తెలిపాడు రవి.

వీరంతా ఒకటికి మూడు యాడ్స్‌ చేస్తుండడంతో ఇబ్బడిముబ్బడిగా సంపాదిస్తున్నారని చెప్పాడు. వాస్తవానికి ఇంకా ఎక్కువే సంపాదిస్తూ ఉండొచ్చని పేర్కొన్నాడు. ధోనీ, సచిన్‌ రిటైరైనా, కోహ్లి వన్డేలకు మాత్రమే అందుబాటులో ఉన్నా.. ఇంకా దండిగా యాడ్స్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ కామెంట్రీ చేస్తున్న రవిశాస్త్రికి.. టీమ్‌ ఇండియా దిగ్గజాల సంపాదనపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ ప్రశ్న వేశాడు. చాలా సంపాదిస్తున్నారని చెప్పిన రవి.. అది పది మిలియన్‌ పౌండ్లు (బ్రిటన్‌ కరెన్సీ)పైనే ఉంటుందని వివరించాడు. అంటే.. రూ.100 కోట్లు అని పేర్కొన్నాడు.

సచిన్‌, ధోనీ, కోహ్లిలు కెరీర్‌ పీక్స్‌లో ఉండగా 15-20 యాడ్స్‌ చేశారు. ఇంకా చేసేందుకు అవకాశం ఉన్నా.. వరుస మ్యాచ్‌ల కారణంగా టైమ్‌ సరిపోలేదని రవి చెప్పడు. లేదంటే ఇంకా ఎక్కువే సంపాదించేవారని వివరించాడు. ఇప్పుడూ సంపాదిస్తున్నారని తెలిపాడు. దీంతో ఇంగ్లండ్‌ మాజీలు నోరెళ్లబెట్టారు. రూ.వంద కోట్లు అంటే ఇంగ్లండ్‌ క్రికెటర్లకు పెద్ద మొత్తమే. వారి జీవిత కాలం సంపాదన కూడా అంతగా ఉందదు మరి...! పైగా అక్కడ ఐపీఎల్‌ వంటివి లేవు. క్రికెట్‌కు పుట్టిల‍్లు అని చెప్పుకొనే ఇంగ్లండ్‌లో ఫుట్‌బాల్‌, టెన్నిస్‌కూ మంచి క్రేజ్‌ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే మన దిగ్గజాల సంపాదన రూ.వంద కోట్లు అనేసరికి వారికి మూర్ఛ వచ్చినంత పనైంది.