Begin typing your search above and press return to search.

టికెట్ల కోసం వీఐపీలు కూడా క్యూ.. ఎక్కడో ఏంటో తెలిస్తే షాక్!

ఉప్పల్ స్టేడియంలో ఈరోజు జరగబోయే గ్రాండ్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతలా ఎగబడుతున్నారో, ఇప్పుడు వీఐపీలు కూడా అదే రేంజ్‌లో లైన్లో నిల్చుంటున్నారు

By:  Madhu Reddy   |   22 May 2026 12:32 PM IST
టికెట్ల కోసం వీఐపీలు కూడా క్యూ.. ఎక్కడో ఏంటో తెలిస్తే షాక్!
X

ఐపీఎల్ మేనియా ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉప్పల్ స్టేడియంలో ఈరోజు జరగబోయే గ్రాండ్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతలా ఎగబడుతున్నారో, ఇప్పుడు వీఐపీలు కూడా అదే రేంజ్‌లో లైన్లో నిల్చుంటున్నారు. మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం ఒక్క టికెట్ కోసం పైరవీలు మొదలుపెట్టారు. సాధారణ జనాలకే కాదు, పెద్ద పెద్ద లీడర్లకు కూడా ఇప్పుడు ఐపీఎల్ ఫీవర్ పీక్స్‌కు చేరింది. ఆ ఇంట్రెస్టింగ్ గొడవ ఏంటో ఇప్పుడు చూద్దాం..

క్రీడా మంత్రిపై పెరిగిపోయిన ప్రెజర్:

ఫైనల్ మ్యాచ్ లైవ్‌గా చూడాలని లీడర్లంతా తెగ పోటీ పడుతున్నారు. దీంతో మన క్రీడా శాఖ మంత్రి గారి ఫోన్ రింగుల మీద రింగులు మోగుతోంది. ఇక ఎలాగైనా సరే తమకు ఐపీఎల్ టికెట్లు అరేంజ్ చేయాలంటూ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఆయనపై విపరీతంగా ప్రెజర్ పెంచుతున్నారట.

రెండు టికెట్లు ఇస్తే సరిపోతుందా?:

నిజానికి రూల్స్ ప్రకారం ప్రతి మ్యాచ్‌కు మంత్రులకు రెండేసి టికెట్లు ఇస్తుంటారు. కానీ, ఇది మామూలు మ్యాచ్ కాదు కదా.. ఏకంగా ఐపీఎల్ ఫైనల్! అందుకే "మాకు రెండు టికెట్లు ఇస్తే ఎలా సరిపోతుంది? ఇంకా ఎక్కువ కావాలి" అంటూ మంత్రులంతా క్రీడ శాఖ మంత్రికి ఫోన్లు చేసి ముప్పతిప్పలు పెడుతున్నట్లు సమాచారం.

మేమేం కాంగ్రెస్ లీడర్లం కాదా?:

ఇక టికెట్ల పంపిణీ జరుగుతోందని తెలియగానే ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ లీడర్లు కూడా సీన్ లోకి ఎంటర్ అయ్యారు. మంత్రి గారి ఆఫీస్ స్టాఫ్‌కు ఫోన్లు చేసి.. "టికెట్లు ఓన్లీ మంత్రులకే ఇస్తారా? మేమేం కాంగ్రెస్ పార్టీ లీడర్లం కాదా? మాకెందుకు ఇవ్వరు?" అంటూ క్వశ్చన్లు కురిపిస్తున్నారట. ఇక దాంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక మంత్రి గారు సైలెంట్ అయిపోయారట.

అధికారుల రేంజ్ బెదిరింపులు:

మరోవైపు సీనియర్ బ్యూరోక్రాట్లు, పోలీస్ అధికారులు డైరెక్ట్‌గా హెచ్‌సీఏ ప్రతినిధులకే ఫోన్లు కొడుతున్నారు. "మాకు పనులు ఉన్నప్పుడు పదే పదే ఫోన్లు చేస్తారు.. ఇప్పుడు మేము ఫోన్ చేస్తే ఎత్తరా? రేపు పొద్దున మీ పనుల కోసం మా దగ్గరికే రావాలి కదా!" అంటూ కాస్త గట్టిగానే వార్నింగ్‌లు ఇస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

ఒక పక్క మంత్రులు, మరోపక్క ఎమ్మెల్యేలు, ఇంకోవైపు పోలీస్ అధికారులు.. ఇలా అందరూ టికెట్ల కోసం ఒత్తిడి చేస్తుండటంతో ఎవరికి న్యాయం చేయాలో తెలియక మంత్రి గారు తల పట్టుకున్నారట. మొత్తానికి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ క్రీడాభిమానుల్లోనే కాదు, మన పొలిటికల్, అఫీషియల్ సర్కిల్స్‌లో కూడా మామూలు సెగలు పుట్టించడం లేదు..