Begin typing your search above and press return to search.

భారత స్టార్ రెజ్లర్ వినేశ్ రెండు సంచలన నిర్ణయాలు!

పారిస్ ఒలింపిక్స్ లో మంగళవారం అత్యుత్తమ పెర్ఫార్మెన్స్ తో రెజ్లింగ్ లో ఫైనల్ కు దుకెళ్లింది వినేశ్ ఫోగాట్.

By:  Tupaki Desk   |   8 Aug 2024 10:55 AM IST
భారత స్టార్  రెజ్లర్  వినేశ్  రెండు సంచలన నిర్ణయాలు!
X

పారిస్ ఒలింపిక్స్ లో మంగళవారం అత్యుత్తమ పెర్ఫార్మెన్స్ తో రెజ్లింగ్ లో ఫైనల్ కు దుకెళ్లింది వినేశ్ ఫోగాట్. దీంతో... ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్ గా ఆమె చరిత్ర సృష్టించింది. ఇక బుధవారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో గెలిస్తే స్వర్ణం, కాదంటే రజతం.. పతకం మాత్రం ఫిక్స్ అని భారతావని మొత్తం ఎదురుచూసింది. 100 గ్రాములు ఎక్కువ బరువు ఉన్నదనే కారణంతో ఆమెను అనర్హురాలిగా తేల్చారు.

ఈ వార్త సగటు భారతీయుడికి బిగ్ షాకిచ్చింది. ఈ వార్త విని జీర్ణించుకోవడం కష్టమైంది. స్వర్ణమో, రజతమో.. ఏదో ఒక పతకం కన్ఫాం అనుకున్న సమయంలో.. నర మానవుడు ఎవరూ ఊహించని విధంగా అన్నట్లుగా ఆమెపై అనర్హత వేటు పడింది. ఈ సమయంలో కొంతమంది దీన్ని కుట్రగా కూడా అభివర్ణించారు. మరోపక్క దేశం మొత్తం ఆమెకు మద్దతుగా నిలిచింది. ఈ సమయంలో... వినేశ్ రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

అవును... పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్ లో అనర్హతకు గురైన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా... రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేసిన వినేశ్... "కుస్తీ నాపై గెలిచింది.. నేను ఓడిపోయాను.. నన్ను క్షమించండి.. మీ కల, నా ధైర్యం విచ్ఛిన్నమైపోయాయి.. ఇక నాకు పోరాడే బలం లేదు.. మీ అందరికీ రుణపడి ఉంటా" అని ఆమె వెల్లడించింది.

మరోపక్క తనను అనర్హురాలిగా ప్రకటించడాన్ని వినేశ్ సీరియస్ గా తీసుకున్నారు. పైగా పోరాడే విషయంలో ఆమె పట్టుదల కూడా భారత్ మొత్తం చూసింది. ఈ సమయంలో ఆమె కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తన అనర్హతను సవాల్ చేస్తూ, తను సిల్వర్ మెడల్ కు అర్హురాలినని అని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెబుతున్నారు. దీనిపై ఆర్బిట్రేషన్ తీర్పు వెలువడించాల్సి ఉంది!