Begin typing your search above and press return to search.

అతడు ‘ప్రత్యర్థికి విజయ’ శంకర్.. అందుకే ఎల్బీ, క్యాచ్ లు మిస్

2019 వన్డే ప్రపంచ కప్.. మంచి ఫామ్ లో ఉన్న తెలుగు బ్యాట్స్ మన్ అంబటి రాయుడును కాదని 3 డి ప్లేయర్ అంటూ ఆ ఆల్ రౌండర్ ను ఎంపిక చేశారు.

By:  Tupaki Desk   |   6 April 2025 4:32 PM IST
Vijay Shankar Latest CSK Match Sparks Trolls
X

అతడు జట్టులో ఉంటే ప్రత్యర్థికి విజయమే.. అందుకే ఔట్ చేయడం లేదు. 2018 నిదహస్ ట్రోఫీ.. శ్రీలంకలో జరిగిన ఈ టోర్నీలో టీమ్ ఇండియా ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో దాదాపు ఓటమికి చేరువైంది. చివర్లో ఆల్ రౌండర్ బంతులను వేస్ట్ చేయడంతో కొంప మునుగుతుందేమో అనిపించింది.. అయితే.. దినేశ్ కార్తీక్ మెరుపు ఇన్నింగ్స్ తో అంతా తారుమారు చేశాడు.

2019 వన్డే ప్రపంచ కప్.. మంచి ఫామ్ లో ఉన్న తెలుగు బ్యాట్స్ మన్ అంబటి రాయుడును కాదని 3 డి ప్లేయర్ అంటూ ఆ ఆల్ రౌండర్ ను ఎంపిక చేశారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో అదరగొడతాడంటూ ప్రపంచ కప్ నకు తీసుకెళ్లారు. కానీ, అంత సీన్ లేదని తర్వాత తేలింది.

మళ్లీ ఇప్పుడు ఆ ఆల్ రౌండర్ ట్రోలింగ్ అవుతున్నాడు. శనివారం చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ లో చెన్నై ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ఆడిన తీరుతో అభిమానులు ఆడుకుంటున్నారు.

ఢిల్లీ విధించిన 184 పరుగుల టార్గెట్ ను అందుకునే క్రమంలో చెన్నై నాలుగో నంబరులో విజయ్ శంకర్ ను బరిలో దింపింది. 54 బంతుల్లో 69 పరుగులు చేసినప్పటికీ అతడు ఇప్పుడు నెటిజన్లకు దొరికిపోయాడు.

కీలకమైన నాలుగో నంబరులో దిగిన విజయ్ శంకర్ వాస్తవానికి సింగిల్ డిజిట్ వద్ద ఉండగానే మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో క్లియర్ గా వికెట్ల ముందు దొరికిపోయాడు. కానీ, ఢిల్లీ రివ్యూ అడగలేదు. ఆ తర్వాత అతడు ఇచ్చిన రెండు క్యాచ్ లు మిస్ చేశారు.

విజయ్ శంకర్ ను త్వరగా పెవిలియన్ కు పంపిస్తే తర్వాత వచ్చే బ్యాటర్ (శివమ్ దూబె, రవీంద్ర జడేజా) చెలరేగి ఆడితే మ్యాచ్ ను లాగేసే ప్రమాదం ఉందని అందుకే విజయ్ ను ఢిల్లీ ఔట్ చేయలేదని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

వాస్తవానికి పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ అనే పేరున్నప్పటికీ విజయ్ శంకర్ బ్యాటర్ గానే ఎక్కువగా కనిపిస్తాడు. అయితే, అదీ వైఫల్యాలతోనే. మంచి ఎత్తుతో ఉండే విజయ్ శంకర్ కు బంతిని టి20 తరహాలో వేగంగా కనెక్ట్ చేసుకునే షార్ప్ నెస్ లేదు. దీంతోనే బంతిని బౌండరీలు, సిక్స్ లకు తరలించలేడు. అప్పుడప్పుడు కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడినా అవి మరుగునపడిపోయాయి. గత సీజన్ లో గుజరాత్ టైటాన్స్ కు ఆడిన విజయ్ శంకర్ ను ఈ సారి సొంత రాష్ట్రం తమిళనాడుకు చెందిన చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంది. మరి ముందుముందు అయినా అతడు రాణిస్తాడేమో చూడాలి.