Begin typing your search above and press return to search.

ఈ సారి ఐపీఎల్ లో అతడికి ‘‘హెడ్’’ వంచాల్సిందే

ఒక్కమాటలో చెప్పాలంటే ఆ మ్యాచ్ లో గనుక ఆ జట్టు గెలవకుంటే ప్రపంచ కప్ నకు దూరమయ్యేది. ఇందతా ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ గురించి.

By:  Tupaki Desk   |   22 Nov 2023 11:31 AM GMT
ఈ సారి ఐపీఎల్ లో అతడికి ‘‘హెడ్’’ వంచాల్సిందే
X

భారత్ లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో అందరినీ ఆకట్టుకున్న ఆటగాడు ఒకరున్నారు. చేయి విరిగినా.. జట్టులో కొనసాగించడమే అతడి ప్రత్యేకతను చాటుతోంది. ఆరు మ్యాచ్ లు మాత్రమే ఆడగలిగినా.. అందులోనే తన ప్రత్యేకతను చాటాడు. అంతేకాదు.. గాయం నుంచి వస్తూనే సెంచరీ కొట్టి కీలక మ్యాచ్ లో జట్టును గెలిపించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ మ్యాచ్ లో గనుక ఆ జట్టు గెలవకుంటే ప్రపంచ కప్ నకు దూరమయ్యేది. ఇందతా ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ గురించి.

లీగ్ లో అధరగొట్టడం ఖాయం

సెమీఫైనల్లో అర్ధ సెంచరీ, ఫైనల్లో సెంచరీ.. ఎప్పుడో టీమిండియా బ్యాటర్ మదన్ లాల్ ఇలా రాణించినట్లు గుర్తు. దానికి కొనసాగింపా అన్నట్లు హెడ్ ఆడాడు. వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ పై సెంచరీతో అదరగొట్టాడు. అంతకుముందు దక్షిణాఫ్రికాతో సెమీస్ లో అర్ధశతకం చేశాడు. ఈ రెండు ఇన్నింగ్స్ లే ఆ జట్టును కప్ గెలిచేలా చేశాయి. ఇక ఫైనల్లో చెలరేగి ఆడుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్యాచ్ ను అద్వితీయ రీతిలో అందుకున్న వైనం గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకనే ఐపీల్ వేలంలో భారీ ధర దక్కడం ఖాయం అని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఆస్ట్రేలియాకు కప్ అందించిన కమ్మిన్స్, సీనియర్ పేసర్ స్టార్క్ కూడా ఈసారి లీగ్ ఆడనున్నారు. వీరికంటే మించిన ధర హెడ్ కు దక్కుతుందని చెప్పొచ్చు.

మోస్ట్ డేంజరస్..

ప్రస్తుతం బ్యాటర్లలో అత్యంత ప్రమాదకరం ఎవరంటే హెడ్ గురించి చెప్పకతప్పదు. సెమీస్, ఫైనల్స్ లో క్లిష్ట పరిస్థితుల్లో ఆడిన ఇన్నింగ్స్.. బంతితో ఓ చేయివేసిన తీరు.. ఫీల్డింగ్ లో అదరగొట్టిన విధానం దీనికి నిదర్శనం. అందుకే వచ్చే నెలలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో హెడ్ కు భారీ ధర దక్కడం ఖాయం అంటున్నారు. బ్యాటింగ్ లో దూకుడుకు మారు పేరైన హెడ్ కోసం అన్ని ఫారంచైజీలూ పోటీపడడం ఖాయమని అంటున్నారు. కాగా, ప్రపంచ కప్ ముగిశాక ఐసీసీ తన జట్టును ప్రకటించింది. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ కూడా తన ‘‘టీమ్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌’’ను ప్రకటించాడు. ఇందులో ఐదుగురు భారత ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమితో పాటు హెడ్ కూ చోటిచ్చాడు. దీన్నిబట్టే హెడ్ ఏ స్థాయిలో ఆడాడో తెలుస్తోంది.