Begin typing your search above and press return to search.

సూర్య కుమార్ ఫస్ట్ ప్రెస్ మీట్... ఇద్దరే జర్నలిస్టులు హాజరు

అవును... ఆస్ట్రేలియాతో విశాఖపట్నంలో నేటి నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ ల టీ20 సిరీస్‌ కు సూర్యకుమార్ యాదవ్ భారత కెప్టెన్‌ గా ఎంపికైన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   23 Nov 2023 6:08 AM GMT
సూర్య కుమార్  ఫస్ట్  ప్రెస్  మీట్... ఇద్దరే జర్నలిస్టులు హాజరు
X

క్రికెట్ అంటే ఇండియాలో ఒక క్రీడ మాత్రమే కాదు.. అదొక రిలీజియన్ అని చెబుతుంటారు. అలాంటి టీం ఇండియాకు సంబంధించిన ఒక కెప్టెన్ ప్రెస్ మీట్ పెడితే సాధారణంగా ఎంతమంది హాజరవుతారు. వరల్డ్ కప్ సమయంలో అయితే సుమారు 200 మంది హాజరయ్యేవారు. ఇది టీ-20 మ్యాచ్ కాబట్టి, కొంతమంది స్టార్స్ లేరు కాబట్టి, సంఖ్య కాస్త తగ్గొచ్చు అని అనుకోవచ్చు. కానీ... కేవలం ఇద్దరే జర్నలిస్టులు హాజరైతే? తాజాగా అదే జరిగింది.

అవును... ఆస్ట్రేలియాతో విశాఖపట్నంలో నేటి నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ ల టీ20 సిరీస్‌ కు సూర్యకుమార్ యాదవ్ భారత కెప్టెన్‌ గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌ కు ముందురోజు నగరంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియంలో భారత కెప్టెన్‌ గా యాదవ్ తన మొదటి విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ విలేకరుల సమావేశంలో కేవలం ఇద్దరు జర్నలిస్టులు మాత్రమే ఉన్నారని తెలుస్తుంది.

సూర్యకుమార్ ఫస్ట్ ప్రెస్ మీట్ లో కేవలం ఇద్దరంటే ఇద్దరే జర్నలిస్టులు ఉన్నారని ఒక సీనియర్ జర్నలిస్టు చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. దీంతో ఈ వ్యవహారంపై విభిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. వరల్డ్ కప్ ముగిసిన 4 రోజులకే ఇలాంటి సిరీస్ పెట్టడం ఏమిటని బీసీసీఐ పై పలువురు ఫైరవుతున్నారు.

"200 మంది మీడియా వ్యక్తుల నుండి (ప్రపంచ కప్ సమయంలో) భారతదేశంలో విలేకరుల సమావేశంలో కేవలం ఇద్దరు మాత్రమే పాల్గొని ఆశ్చర్యపరిచారు! కెప్టెన్‌ గా తన మొదటి ప్రెస్ మీట్ లో సూర్యకుమార్ యాదవ్ దీనిని ఊహించి ఉండడు. భారతదేశంలో ప్రెస్ కాన్ఫరెన్స్‌ లో అతి తక్కువ మంది హాజరైన రికార్డు ఇదేనా? నేను అలా ఊహించుకుంటాను" అని స్పోర్ట్స్ జర్నలిస్ట్ విమల్ కుమార్ ఎక్స్ లో రాశారు.

వరల్డ్ కప్ ఫైనల్ లో జరిగిన చేదు నిజం సంగతి కాసేపు పక్కనపెడితే... వచ్చే ఏడాది జూన్‌ లో జరిగే టీ20 ప్రపంచకప్‌ , సెంబర్‌ 19న ఐపీఎల్‌ మినీ వేలం నేపథ్యంలో యువ క్రికెటర్లకు ఈ సిరీస్ అద్భుతమైన అవకాశం అని అంటున్నారు పరిశీలకులు. ఈ సిరీస్ లో సూర్యకుమార్‌ యాదవ్ ఒక్కరే వరల్డ్ కప్ లో 7 ఇన్నింగ్స్ లు ఆడిన ప్లేయర్ కావడం గమనార్హం!