Begin typing your search above and press return to search.

పంజాబ్ వర్సెస్ హైదరాబాద్... ఛేజింగ్ అడ్డాలో మహారాజా ఎవరు?

ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా 23 మ్యాచ్ పంజాబ్ కింగ్స్ – సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరగనుంది

By:  Tupaki Desk   |   9 April 2024 4:09 AM GMT
పంజాబ్ వర్సెస్ హైదరాబాద్... ఛేజింగ్ అడ్డాలో మహారాజా ఎవరు?
X

ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా 23 మ్యాచ్ పంజాబ్ కింగ్స్ – సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం మొహాలీలోని మహారాజా యదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియం సిద్ధమైంది. ఆడన చెరో నాలుగు మ్యాచ్ లలోనూ రెండేసి మ్యాచ్ లు గెలిచిన ఈ రెండు జట్లూ నాలుగేసి పాయిట్లంతో ఉన్నాయి.

అవును... పంజాబ్ ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌ లు ఆడగా రెండింటిలో గెలిచింది. శిఖర్ ధావన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ తమ మొదటి మ్యాచ్‌ లో ఢిల్లీపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి.. తర్వాతి బెంగళూరు చేతిలో 4 వికెట్ల తేడాతోనూ, లక్నోపై 21 పరుగుల తేడాతోనూ ఓడిపోయి.., గుజరాత్ టైటాన్స్ తో జరిగిన నాలుగో మ్యాచ్‌ లో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

పంజాబ్ బ్యాటర్స్ లో కెప్టెన్ శిఖర్ ధావన్ 4 మ్యాచ్ లు ఆడి 138 పరుగులు చేయగా.. ప్రభ్ సిమ్రాన్ సింగ్ 105 పరుగులు, శశాంక్ సింగ్ 91 పరుగులు సాధించారు. ఇక బౌలర్ల విషయానికొస్తే.. రబాడా 4 మ్యాచ్ లు ఆడి 6 వికెట్లు తీసుకోగా, హర్ప్రీత్ బ్రార్ 4 వికెట్లు పడగొట్టాడు.

మరోవైపు హైదరాబాద్ తొలి మ్యాచ్‌ లో కోల్ కతా చేతిలో 4 పరుగుల తేడాతో ఓడి.. తర్వాతి మ్యాచ్‌ లో ముంబై ఇండియన్స్ పై 31 పరుగుల తేడాతో గెలిచింది. ఇక మూడో మ్యాచ్‌ లో గుజరాత్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిపోగా.. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన నాలుగో మ్యాచ్‌ లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ లో క్లాసెన్ 4 మ్యాచ్ లలో 177 పరుగులు చేయగా.. అభిషేక్ శర్మ 161, మార్క్రం 127 పరుగులు చేశారు. బౌలర్ల విషయానికొస్తే... పాట్ కమిన్స్ 4 మ్యాచ్ లో 5 వికెట్లు తీయగా.. నటరాజన్ 2 మ్యాచ్ లలో 4 వికెట్లు పడగొట్టాడు.

హెడ్-టు-హెడ్ గణాంకాలు!:

హైదరాబాద్ - పంజాబ్ జట్లు ఇప్పటి వరకు 21 ఐపీఎల్ మ్యాచ్‌ లు ఆడాయి. వీటిలో పంజాబ్ కింగ్స్ 7 మ్యాచ్ లలో గెలవగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 14 మ్యాచ్ లలో విజయం సాధించింది. ఇక హైదరాబాద్ పై ఇప్పటివరకు పంజాబ్ అత్యధిక స్కోరు 211 కాగా... పంజాబ్ పై హైదరాబాద్ అత్యధిక స్కోరు 212.

పిచ్ రిపోర్ట్!:

మొహాలీ పిచ్ భారతదేశంలోనే అత్యంత వేగవంతమైనదిగా చెబుతారు. ఇది చక్కటి బౌన్స్‌ తో ఫాస్ట్ బౌలర్‌ లకు సహాయపడుతుంది. అందుకే... టాస్ గెలిచిన జట్లు తరచుగా మొదట బౌలింగ్ చేస్తాయి. సుమారు 2018 నుండి ఇక్కడ రెండోసారి బ్యాటింగ్ చేసే జట్టు గెలుస్తుంది.