Begin typing your search above and press return to search.

589 టెస్టులు.. 36 కెప్టెన్లు.. భారత టెస్ట్ కెప్టెన్స్ పూర్తి జాబితా ఇదిగో!

టీమిండియా తన తొలి టెస్ట్ మ్యాచ్ ను 1932 జూన్ 25 - 28 మధ్య లండన్ లోని ప్రసిద్ధ లార్డ్స్ మైదానంలో ఆడింది

By:  Tupaki Desk   |   25 May 2025 3:00 AM IST
589 టెస్టులు.. 36 కెప్టెన్లు..  భారత టెస్ట్  కెప్టెన్స్  పూర్తి జాబితా ఇదిగో!
X

టీమిండియా టెస్ట్ క్రికెట్ లో కొత్త శకం ప్రారంభమైంది. తాజాగా భారత టెస్ట్ క్రికెట్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వారసుడిగా శుభ్ మన్ గిల్ ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ మేరకు వచ్చే నెలలో ఇంగ్లాండ్ పర్యటనకు జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ సమయంలో... టీమిండియా టెస్ట్ క్రికెట్ చరిత్రపై ఒక అవలోకనం.. 'తుపాకీ' పాఠకులకు ప్రత్యేకం!

అవును... భారతదేశంలో క్రికెట్ ను ఒక మతంగా.. స్టార్ ప్లేయర్స్ ని దేవుళ్లుగా చూస్తారు అభిమానులు! ఇదే క్రమంలో.. నేడు ప్రపంచంలో క్రికెట్ కు ఈ స్థాయి ఆధరణ రావడంలో భారత్ పాత్ర అత్యంత కీలకమని క్రీడా పండితులు, విశ్లేషకులు చెబుతుంటారు! ఈ క్రమంలో... టెస్ట్ క్రికెట్ లో టీమిండియా 1932లో తన తొలి మ్యాచ్ ను ఆడింది.

నాడు భారత టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్ గా సీకే నాయుడు ఉన్నారు. నేడు ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ గిల్ వరకూ వచ్చింది టీమిండియా టెస్ట్ క్రికెట్ ప్రస్థానం. ఈ క్రమంలో కొంతమంది కెప్టెన్లు స్ఫూర్తిదాయకంగా, మరికొంతమంది చారిత్రక విజయాలు నమోదు చేస్తూ, ఇంకొంతమంది క్రీడకే కొత్త అందాన్ని అద్దుతూ వారి వారి మార్కును చాటిన వాళ్లే!

టీమిండియా తన తొలి టెస్ట్ మ్యాచ్ ను 1932 జూన్ 25 - 28 మధ్య లండన్ లోని ప్రసిద్ధ లార్డ్స్ మైదానంలో ఆడింది. సీకే నాయుడు సారథ్యంలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ పై ఇంగ్లాండ్ 158 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 259 పరుగులు చేసిన ఇంగ్లాండ్ జట్టు.. రెండో ఇన్నింగ్స్ ను 275/8 వద్ద డిక్లేర్ చేసింది.

మరోపక్క తొలి ఇన్నింగ్స్ లో 189 పరుగులకు ఆలౌట్ అయిన భారత జట్టు.. రెండో ఇన్నింగ్స్ లోనూ దాదాపు అదే స్థాయిలో 187 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో.. 158 పరుగులతో భారత్ పై ఇంగ్లిష్ జట్టు విజయం సాధించింది. అనంతరం కాలంలో లార్డ్స్ లో టీమిండియాకు చారిత్రాత్మక టెస్టు విజయాలు ఎన్నో ఉన్నాయి!

అలా మొదలైన టీమిండియా టెస్ట్ క్రికెట్ ప్రస్థానం.. ఇప్పుడు ఎన్నో చారిత్రక విజయాలతో దూసుకుపోతుంది! ఈ క్రమంలో ఇప్పటివరకూ మొత్తం 589 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన టీమిండియా.. వాటిలో 181 మ్యాచ్ ల్లో విజయం సాధించగా.. 184 మ్యాచుల్లో ఓటమిపాలైంది. 223 మ్యాచ్ లను డ్రాగా ముగించింది. వీటిలో ఒకమ్యాచ్ టై గా ముగిసింది.

ఈ క్రమంలో టీమిండియా టెస్ట్ కెప్టెన్స్ లో విరాట్ కొహ్లీ 68 టెస్టులకు నాయకత్వం వహించి, అందులో 40 మ్యాచ్ లలో విజయం సాధించి, మోస్ట్ సక్సెస్ ఫుల్ టెస్ట్ కెప్టెన్ గా నిలిచాడు! ఇదే సమయంలో మహేంద్ర సింగ్ ధోనీ 60 మ్యాచ్ లకు సారథ్యం వహించి.. 27 మ్యాచ్ లను గెలిపించగా.. గంగూలీ 49 మ్యాచ్ లలో 21 గెలిపించాడు!

ఈ క్రమంలో 1932 నుంచి 2025 వరకూ టీమిండియాకు ఎంపికైన 37 మంది టెస్ట్ కెప్టెన్లు.. వారు సారథ్యం వహించిన మ్యాచ్ ల జాబితాను చూద్దామ్..!

సీకే నాయుడు - 4

వీజయనగరం మహారాజు - 3

ఇఫీకర్ ఆలీఖాన్ పటౌడీ - 3

లాలా అమర్ నాథ్ - 15

విజయ్ హజారే - 14

వినూ మంకడ్ - 6

గులాం అహ్మద్ - 3

పాలీ ఉమ్రిగర్ - 8

హేమూ అధికారి - 1

దత్తా గైక్వాడ్ - 4

పంకజ్ రాయ్ - 1

గులాబ్రాయ్ రాం చంద్ - 5

నారీ కాంట్రాక్టర్ - 12

మన్సూర్ అలీఖాన్ పటౌడీ - 40

చందు బోర్డే - 1

అజిత్ వడేకర్ - 16

ఎస్ వెంకటరాఘవన్ - 5

సునీల్ గవాస్కర్ - 47

బిషన్ సింగ్ బేడీ - 22

గుండప్ప విశ్వనాథ్ - 2

కపిల్ దేవ్ - 34

దిలీప్ వెంగ్ సర్కార్ - 10

రవిశాస్త్రి - 1

కృష్ణమాచారి శ్రీకాంత్ - 4

మొహమ్మద్ అజారుద్దీన్ - 47

సచిన్ టెండుల్కర్ - 25

సౌరబ్ గంగూలీ - 49

రాహుల్ ద్రావిడ్ - 25

వీరేంద్ర సెహ్వాగ్ - 4

అనీల్ కూంబ్లే - 14

మహేంద్ర సింగ్ ధోనీ - 60

విరాట్ కొహ్లీ - 68

అజింక్యా రహానే - 6

కేఎల్ రాహుల్ - 3

రోహిత్ శర్మ - 24

జస్ ప్రీత్ బూమ్రా - 3

శుభ్ మన్ గిల్ -