Begin typing your search above and press return to search.

అబ్బే.. ఇదేందయ్య ‘దూబే’.. జట్టులో మహా దండగ

టీమిండియా పేసర్ బుమ్రా బౌలింగ్.. పాకిస్థాన్ ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్.. అప్పటికే బుమ్రా బౌలింగ్ కు దిగడం ఆలస్యమైంది.

By:  Tupaki Desk   |   11 Jun 2024 10:40 AM GMT
అబ్బే.. ఇదేందయ్య ‘దూబే’.. జట్టులో మహా దండగ
X

టీమిండియా పేసర్ బుమ్రా బౌలింగ్.. పాకిస్థాన్ ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్.. అప్పటికే బుమ్రా బౌలింగ్ కు దిగడం ఆలస్యమైంది. టార్గెట్ చూస్తే 120 మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో బుమ్రా వేసిన బంతిని రిజ్వాన్ ఫైన్ లైగ్ లోకి ఆడాడు. అక్కడ ఉన్నది ఆల్ రౌండర్ శివమ్ దూబె. కానీ, లడ్డూల చేతుల్లో పడిన బంతిని వదిలేశాడు. రిజ్వాన్ ఎలాంటి ఆటగాడో అందరికీ తెలిసిందే. అతడి క్యాచ్ ను వదిలేయడం అంటే మ్యాచ్ ను వదిలేయడమే.

తుది జట్టులో అర్హుడైనా..?

శివమ్ దూబె.. ఏడేళ్ల కిందట దేశవాళీల్లో ఒకే ఓవర్ లో ఐదు సిక్సులు కొట్టి వెలుగులోకి వచ్చాడు. దీంతో ఐపీఎల్ లోకి అడుగుపెట్టాడు. కొన్ని మంచి ఇన్నింగ్సే ఆడాడు. అయితే, ఐపీఎల్ ప్రదర్శన అంతర్జాతీయ స్థాయిలో రిపీట్ అవుతుందని ఏమీ లేదు. దీనికి తాజా టి20 ప్రపంచ కప్ లో దూబె ప్రదర్శనే నిదర్శనం.

అతడి కోసం కూర్పు మార్పు..

శివమ్ దూబె మీడియం పేస్ ఆల్ రౌండర్. హార్దిక్ పాండ్యా ఫామ్ లో లేకపోవడంతో టి20 ప్రపంచ కప్ నకు దూబెను ఎంపిక చేశారు. ఐపీఎల్ లో రాణించడం కూడా ఇందుకు కారణం. పైగా దూబె కోసం జట్టు కూర్పునే మార్చారు. దూబె ఆల్ రౌండర్ గా పనికొస్తాడని భావిస్తూ.. తుది జట్టులో ఆడిస్తున్నారు. దీంతో స్పెషలిస్ట్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ను పక్కనపెట్టారు. కోహ్లిని ఓపెనింగ్ కు దింపుతున్నారు. అయితే, దూబె ప్రదర్శన మాత్రం దారుణంగా ఉంటోంది. పాకిస్థాన్ తో అత్యంత కీలక మ్యాచ్ లో 9 బంతులాడి 3 పరుగులే చేశాడు ఈ హార్డ్ హిట్టర్. ఫీల్డింగ్ లో రిజ్వాన్ క్యాచ్ ను జారవిడిచాడు.

ట్రోలర్లకు దొరికిపోయాడు..

దారుణ ప్రదర్శనతో శివమ్ దూబెను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇతడు జట్టులో అనర్హుడని.. బ్యాటింగ్ పిచ్ ల మీద మాత్రమే పనికొస్తాడని క్లిష్టమైన పిచ్ లపై ఆడలేడని మండిపడుతున్నారు