Begin typing your search above and press return to search.

కెప్టెన్సీ విషయమంలో రుతురాజ్ కి ధోనీ ఇచ్చిన హింట్ ఇదే!

ఐపీఎల్ - 2024 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుకు యంగ్ ప్లేయర్ తురురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 March 2024 10:32 AM GMT
కెప్టెన్సీ విషయమంలో రుతురాజ్  కి ధోనీ ఇచ్చిన హింట్  ఇదే!
X

ఐపీఎల్ - 2024 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుకు యంగ్ ప్లేయర్ తురురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే. మహేంద్ర సింగ్ ధోనీ స్థానంలో రుతురాజ్ ను కెప్టెన్ గా నియమిస్తున్నట్లు చెన్నై ఫ్రాంచైజీ ఇటీవల ప్రకటించింది. దీంతో సీఎస్కే ఫ్యాన్స్, ధోనీ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఏమిటీ షాకింగ్ న్యూస్, ఎందుకు ఈ సర్ ప్రైజ్ అంటూ రియాక్ట్ అయ్యారు. దీనిపై తాజాగా రుతురాజ్ రియాక్ట్ అయ్యాడు. ఇది తనకు సర్ ప్రైజ్ కాదని చెబుతున్నాడు.

అవును... చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ బాధ్యతల నుంచి ధోనీ తప్పుకుంటున్న విషయంలో తనకు గతేడాదే హింట్ వచ్చిందని... ఏక్షణంలో అయినా తాను నాయకత్వ పగ్గాలను వదిలిపెట్టే అవకాశం ఉందని చెప్పాడని.. అందువల్ల ధోనీ స్థానంలో తాను నాయకత్వ బాధ్యతలు చేపట్టడం తనకు సర్ ప్రైజ్ గా లేదని.. ఈ మేరకు గతేడాది ఈ టైపులో ఒక హింట్ ఇచ్చాడని రుతురాజ్ తెలిపాడు.

ఇదే సమయంలో.. కెప్టెన్ గా జట్టును ముందుకు నడిపించేలా తనను ధోనీ ఎంతో గైడ్ చేశాడని తెలిపిన రుతురాజ్ గైక్వాడ్... ట్రైనింగ్ క్యాంప్ లో రియల్ సిట్యువేషన్స్ ని క్రియేట్ చేయడం.. ఆ సమయంలో వాటిని ఎలా ఎదుర్కోవాలనే విషయంపై సలహాలు, సూచనలు ఇవ్వడం చేశాడని గుర్తు చేసుకున్నాడు.

వాస్తవానికి కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంపై ఫ్యాన్స్ కి కూడా ధోనీ మూడువారాల క్రితమే ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా హింట్ ఇచ్చాడు. ఇందులో భాగంగా సరికొత్త రోల్ తో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో అడుగుపెట్టబోతున్నట్లు ప్రకటించాడు! దీంతో.. అప్పటి నుంచే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ మార్పుపై మీడియాలో కథనాలు, నెట్టింట ఊహాగాణాలు మొదలైపోయాయి.

కాగా... 2019 సీజన్ లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన రుతురాజ్ గైక్వాడ్... గత ఐదు సీజన్స్ లోనూ చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ క్రమంలో 2023 సీజన్ లో 16 మ్యాచ్ లు ఆడిన రుతురాజ్... 590 పరుగులు చేశాడు. తన ఐపీఎల్ కెరీర్ లో 2021 సీజన్ లో 635 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇదే క్రమంలో ఐపీఎల్ కెరీర్ లో 2021లో 101 నాటౌట్ తో ఒక సెంచరీ కూడా అతని ఖాతాలో ఉంది.