Begin typing your search above and press return to search.

ముంబై ఇండియన్స్ విషయంలో రోహిత్ సంచలన నిర్ణయం!!

పైగా... ఈ విషయాన్ని హిట్ మ్యాన్ ఫ్యాన్స్ జీర్ణించుకోకపోవడంతో ఈ రచ్చ పీక్స్ కి చేరుకుంటుంది.

By:  Tupaki Desk   |   4 April 2024 9:34 AM GMT
ముంబై ఇండియన్స్  విషయంలో రోహిత్  సంచలన నిర్ణయం!!
X

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ 17లో ముంబై ఇండియన్స్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా రెండు కారణాలున్నాయి. అందులో ఒకటి ఈ సీజన్ లో ఆడిన మూడు మ్యాచ్ లలోనూ ఓడిపోవడం ఒకటి కాగా.. అందుకు కారణం రోహిత్ శర్మను తప్పించి హార్దిక పాండ్యాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించడం అసలు కారణం అన్ని అంటున్నారు!

పైగా... ఈ విషయాన్ని హిట్ మ్యాన్ ఫ్యాన్స్ జీర్ణించుకోకపోవడంతో ఈ రచ్చ పీక్స్ కి చేరుకుంటుంది. ఇలా ముంబై ఆడుతున్న ప్రతీ మ్యాచ్ లోనూ రోహిత్ శర్మ ఫ్యాన్స్ గా చెబుతున్న కొంతమంది... హార్దిక్ పాండ్యాను వెంటాడుతున్నారు! ఆన్ లైన్ లోనూ మైదానంలోనూ అతడిని ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. రోహిత్ శర్మకు సంబంధించిన హిట్ మ్యాన్ హర్ట్ అయ్యాడు అంటూ ఒక కీలక అంశంపై కథనాలు వెలువడుతున్నాయి!

అవును... ఐదు సార్లు జట్టుకు ట్రోఫీ అందించిన కెప్టెన్ అయిన తనను తప్పించి.. హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు ఇవ్వడంపై రోహిత్ శర్మ హర్ట్ అయ్యాడని.. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారని.. ఇందులో భాగంగా ముంబై జట్టును వీడనున్నాడని.. ఫలితంగా వచ్చే ఏడాది జరగబోయే మెగా ఆక్షన్ లో పాల్గొంటాడని.. కథనాలు వైరల్ అవుతున్నాయి.

పైగా... ఈ విషయాలను ఒక ముంబై ప్లేయర్ తమకు ఆఫ్ ది రికార్డ్ చెప్పినట్లుగా కథనాలు వస్తుండటంతో... ఈ విషయం ఇప్పుడు మరింత వైరల్ గా మారిందని అంటున్నారు!

కాగా... ముంబై ఇండియన్స్ టీం కెప్టెన్ ను మార్చడంపట్ల జరుగుతున్న రచ్చ వ్యహారంపై టీం ఇండియా మాజీ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి స్పందించారు. ఇందులో భాగంగా... ఇక్కడ ఆడుతోంది భారత జట్టు కాదని, ఇది ఒక ఫ్రాంఛైజీ క్రికెట్‌ అని.. ఇక్కడ ఆటగాళ్లకు కోట్లు ఇస్తారని.. ఈ నేపథ్యంలో ఎవరిని కెప్టెన్‌ గా నియమించుకోవాలనేది యజమానుల ఇష్టం అని తెలిపారు.

ఇదే సమయంలో... ముంబై టీం విజయాలు సాధించడం మొదలుపెడితే ఈ కెప్టెన్సీ గోల పక్కకు పోతుందని అభిప్రాయపడిన రవిశాస్త్రి హార్దిక్ కు ఒక సలహా ఇచ్చారు. ఇందులో భాగంగా... అతను ప్రశాంతంగా, ఓపికగా ఉందాలని, ఇతర విషయాలు పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టాలని.. ఒక మూడు నాలుగు మ్యాచ్ లు వరుసగా గెలిస్తే అంతా సద్దుమణిగిపోతుందని తెలిపారు!