Begin typing your search above and press return to search.

రోహిత్ రనౌట్.. గిల్ పై బూతులు?

బ్యాట్స్ మన్ రనౌట్ అయ్యాడంటే అతడిని కాస్త తక్కువగా చూస్తారు. అఫ్ఘానిస్థాన్ తో గురువారం జరిగిన మొదటి టి20లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇలానే ఔటయ్యాడు.

By:  Tupaki Desk   |   12 Jan 2024 10:40 AM GMT
రోహిత్ రనౌట్.. గిల్ పై బూతులు?
X

క్రికెట్ లో ఎన్నో రకాల ఔట్ లు ఉంటాయి.. ఫీల్డర్ కీపర్ క్యాచ్ కాట్ అండ్ బౌల్డ్ బౌల్డ్.. ఇలా ఎన్నో విధాల ఒక బ్యాట్స్ మన్ ను పెవిలియన్ కు పంపవచ్చు. అయితే, వీటిలో అత్యంత పేలవమైనది.. 'రనౌట్'. బ్యాట్స్ మెన్ మధ్య సమన్వయ లోపం బంతి ఎక్కడ ఉందో సరిగా అంచనా వేయకపోవడం లేని రన్ కోసం పరుగెత్తడం.. రనౌట్ కు కారణమవుతాయి. బ్యాట్స్ మన్ రనౌట్ అయ్యాడంటే అతడిని కాస్త తక్కువగా చూస్తారు. అఫ్ఘానిస్థాన్ తో గురువారం జరిగిన మొదటి టి20లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇలానే ఔటయ్యాడు.

16 నెలల తర్వాత టి20లోకి దిగి డకౌట్

2022 నవంబరులో జరిగిన ఆసియా కప్ టి20లో టీమిండియా సారథ్యం వహించిన రోహిత్ శర్మ.. ఆ టోర్నీ తర్వాత పొట్టి ఫార్మాట్ లో ఆడలేదు. వన్డే ప్రపంచ కప్ కోసం సిద్ధంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు. కాగా.. అఫ్ఘాన్ తో సిరీస్ ద్వారా తిరిగి టి20ల్లోకి వచ్చిన అతడు తొలి మ్యాచ్ లోనే రనౌట్ గా వెనుదిరిగాడు. దీంతో తీవ్ర అసహనానికి గురయ్యాడు. అఫ్ఠాన్ బౌలర్ వేసిన బంతిని మిడాన్ వైపు ఆడగా ఫీల్డర్ ఆపాడు. నాన్ స్ట్రయికింగ్ లోని గిల్ బంతిని చూస్తూ ఉండిపోగా.. రోహిత్ మాత్రం రన్ కోసం అతడి వద్దకు వచ్చేశాడు. ఇద్దరూ ఒకే ఎండ్ లో ఉండిపోగా.. రోహిత్ రనౌట్ అయ్యాడు. దీనిపై అతడు తీవ్ర కోపంతో గిల్ ను దూషించాడు.

ఏమని తిట్టి ఉంటాడో..?

గిల్ ను రోహిత్ తీవ్రంగానే దూషించినట్లు కనిపిస్తోంది. అది కూడా కాస్త ఘాటైన పదజాలమే వాడాడని అనిపిస్తోంది. అయితే, రనౌట్ అసహనంతోనే నోరు పారేసుకున్నానని, ఆటలో ఇవన్నీ సహజమని తర్వాత అతడు సంజాయిషీ ఇచ్చాడు. వాస్తవానికి ఈ రనౌట్ లో గిల్ దే తప్పిదం. రనౌటైనప్పుడు అసహనం సర్వ సాధారణం అన్నాడు. ఆ పరిస్థితుల్లో వచ్చిన మాటలు ఉద్దేశపూర్వకంగా అన్నవి కాదని చెప్పాడు. కాగా, రోహిత్ రనౌట్ క్లిప్ ను ట్విటర్ లో పోస్ట్ చేయగా.. అతడేం మాట్లాడాడు అనేదానిపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రోహిత్ పక్కా ఆసియాలోనే అతిపెద్దదైన ముంబై మురికివాడ ధారావి భాషలో తిట్టాడని కొందరు అంటున్నారు. ఇంకొందరు గిల్ రోహిత్ ను నమ్మి పరుగు తీయాల్సిందని కూడా పేర్కొంటున్నారు.

బోస్ డికే అని పాండేను తిట్టిన ధోనీ..

2017-18 సీజన్ లో బ్యాట్స్ మన్ మనీశ్ పాండేను మాజీ కెప్టెన్ ధోనీ ఓ మ్యాచ్ లో తీవ్రంగా దూషించాడు. ధోనీ రన్ పిలుపునకు స్పందించకుండా.. మనీశ్ బంతి వైపే చూస్తుండడంతో.. "బోస్ డికె.. అక్కడ ఏం చూస్తున్నావ్. ఇక్కడ చూడు" అంటూ ధోనీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా.. క్రికెట్ లోనే కాదు టీమ్ గేమ్ లలో ఇలాంటివి సహజమే. కోచ్ లు సైతం కొన్ని సందర్భాల్లో ఆటగాళ్లను తిడుతుంటారు. అది కేవలం వారు బాగా ఆడలేదనో.. ఇంకా బాగా ఆడాలనో తప్ప వేరే విధంగా కాదు.