Begin typing your search above and press return to search.

హార్దిక్ - రోహిత్ శర్మ... యాక్షన్, రియాక్షన్ వీడియో వైరల్!

ఇందులో భాగంగా... గతంలో ఓ ఇంటర్వ్యూలో భాగంగా స్పందించిన హార్దిక్ పాండ్యా... ముంబై ఇండియన్స్ టీంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   18 Dec 2023 11:18 AM GMT
హార్దిక్ - రోహిత్  శర్మ... యాక్షన్, రియాక్షన్  వీడియో వైరల్!
X

ఐపీఎల్ సందడి అప్పుడే మొదలైపోయిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ సంభరాలకు ఇంకా సమయం ఉండగానే చర్చలు, కూర్పులు, సరికొత్త చేర్పులపై తీవ్ర చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ముంబై ఇండియన్స్ జట్టులో జరిగిన కెప్టెన్సీ మార్పు హాట్ టాపిక్ కా మారింది. ఈ సమయంలో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాలకు సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది.

అవును... ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం ఐపీఎల్ - 2024కి కెప్టెన్ గా హార్డిక్ పాండ్యాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నిర్ణయం పై అటు రోహిత్ ఫ్యాన్స్ తోపాటు ఇటు పలువురు మాజీ క్రికెటర్ల నుంచి తీవ్రమైన కామెంట్లు ఎదురవుతున్నాయి.

ఈ క్రమంలో... ముంబై ఇండియన్స్ టీం యాజమాన్యం తాజా నిర్ణయం పట్ల సోషల్ మీడియా వేదికగా రోహిత్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇదే సమయంలో అటు ట్విట్టర్ లోనూ, ఇటు ఇన్ స్టాలోనూ ముంబై ఇండియన్స్ ని రోహిత్ ఫ్యాన్స్ అన్ ఫాలో చేస్తున్నారు! ఇదే క్రమంలో కొందరు సోషల్ మీడియా వేదికగా... రోహిత్, హార్దిక్ భిన్నవాదనలతో కూడిన వీడియోలను షేర్ చేస్తూ వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో భాగంగా... గతంలో ఓ ఇంటర్వ్యూలో భాగంగా స్పందించిన హార్దిక్ పాండ్యా... ముంబై ఇండియన్స్ టీంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ టైటాన్స్ జట్టుకు వెళ్లిన తర్వాత హార్థిక్ ఈ ఇంటర్వ్యూ ఇవ్వడం గమనార్హం. ఇందులో భాగంగా... ఐపీఎల్ ప్రాంచైజీ టైటిల్ ను గెలుచుకోవటానికి జట్టు సామర్థ్యాలను విశ్లేషిస్తూ రెండు కారణాలను హార్ధిక్ చెప్పారు.

ఇందులో ఒకటి... స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేయడం కాగా.. రెండోది జట్టు సభ్యులందరిని ఐక్యంచేసి జట్టును కెప్టెన్ విజయతీరాలకు నడిపించడం. ఇందులో ముంబై ఇండియన్స్ జట్టును మొదటి విభాగంగా హార్డిక్ పేర్కొన్నాడు. అంటే.. ముంబై ఇండియన్స్ టీంలో స్టార్ ప్లేయర్స్ ఎక్కువగా ఉన్నారని, ఫలితంగా టైటిల్స్ గెలుచుకోవటంలో వాళ్లకు సులభం అవుతుందని హార్దిక్ పాండ్యా అభిప్రాయపడ్డాడు.

ఈ సమయంలో ధోనీ నాయకత్వం వహించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టును హార్డిక్ రెండో విభాగం కింద పేర్కొన్నారు. ఇందులో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఆటగాళ్లు ఎవరైనాసరే అక్కడ వారు కంఫర్ట్ బుల్ గా ఉంటారని.. తద్వారా వారినుంచి ఉత్తమంగా ఆటతీరును పొందారని చెప్పారు. ఇదే సమయంలో... తాను కెప్టెన్సీ వహించిన గుజరాత్ టైటాన్స్ జట్టును హార్డిక్ రెండో విభాగం కిందనే పేర్కొన్నాడు.

ఈ సమయంలో... హార్డిక్ వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా రోహిత్ స్పందించారు. ఇందులో భాగంగా... ముంబై ఇండియన్స్ జట్టు బలమైన ఆటగాళ్లతో ఉందని ప్రజలు అనుకుంటున్నారు కానీ... దాని వెనుక ఉన్న కృషి గురించి ఎవరూ మాట్లాడరని తెలిపారు. ఇందులో భాగంగా... తిలక్ వర్మ, నెహాల్ ల సంగతి.. బుమ్రా, హార్ధిక్ లానే ఉంటుందని అన్నారు. కొన్ని సంవత్సరాల తరువాత తమకూ బలమైన జట్టు ఉందని ఎవరైనా చెబుతారు అంటూ రోహిత్ పేర్కొన్నారు.

దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. రోహిత్, హార్దిక్ ల మధ్య వ్యాఖ్యలను యాక్షన్.. రియాక్షన్ గా వీడియోలను రూపొందించి సోషల్ మీడియోలో వారి అభిమానులు, క్రికెట్ అభిమానులు షేర్ చేస్తున్నారు.