బిగ్ డెసిషన్.. టెస్టులకు విరాట్ కోహ్లి రిటైర్మెంట్
మొన్న కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ రోజు స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి.. రోజుల వ్యవధిలో టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు.
By: Tupaki Desk | 12 May 2025 12:06 PM ISTఅత్యంత కీలకమైన ఇంగ్లండ్ సిరీస్.. విదేశీ గడ్డపై ఐదు మ్యాచ్ ల సిరీస్.. కొత్త ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) సైకిల్ ప్రారంభం.. ఇంత ముఖ్యమైన సమయంలో టీమ్ ఇండియాకు అనూహ్య పరిస్థితులు..
మొన్న కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ రోజు స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి.. రోజుల వ్యవధిలో టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు.
టెస్టులను అత్యంత ఇష్టంగా భావించే కోహ్లి.. మరో ఏడాది రెండేళ్లయినా ఆడగల సత్తా ఉన్న కోహ్లి అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు.
టెక్నిక్ పరంగా రోహిత్ శర్శ విదేశాల్లో టెస్టులకు తగడు అనే అభిప్రాయం ఉంది.. కానీ, విరాట్ కోహ్లి అలాకాదు.. ఏ దేశంలోనైనా పరుగులు సాధించగల సత్తా ఉన్నవాడు.
కోహ్లి వయసు కూడా 36 మాత్రమే. అయినా అలాంటివాడు రిటైర్మెంట్ ప్రకటించడం అంటే అనూహ్యమే. దీంతో టీమ్ ఇండియాలో ఏం జరుగుతోంది? అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
ఇప్పటికే రోహిత్ రిటైర్మెంట్ తో ఇంగ్లండ్ లో కొత్త సారథితో ఆడాల్సిన పరిస్థితి. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగే కోహ్లి కూడా రిటైర్ కావడంతో మరో బ్యాటర్ ను తీసుకోవాల్సి ఉంటుంది.
దిగ్గజాల వంటి రోహిత్, కోహ్లి స్థానాలను భర్తీచేయడం అంత సులువు కాదు. మరీ ముఖ్యంగా టెస్టుల్లో. ఇంకా చెప్పాలంటే టెస్టుల్లో కోహ్లి స్థాయి ఆటగాడిని పట్టుకోవడం మహామహా కష్టం. ఇంగ్లండ్ టూర్ లో ఏం జరుగుతుందో చూద్దాం.