మరికొన్నాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్.. బీసీసీఐ క్లియర్ మెసేజ్
ఆస్ట్రేలియాలో బోర్డర్ –గావస్కర్ ట్రోఫీ చివరి టెస్టుకు రోహిత్ పై వేయడంతోనే అతడిని ఇక పక్కనపెట్టినట్లే అనుకున్నారు.
By: Tupaki Desk | 2 May 2025 8:48 PM ISTఫిట్ నెస్ పై విమర్శలు వస్తున్నా.. పెద్దగా ఫామ్ లో లేకున్నా.. టెస్టులకు పనికిరాడమే అభిప్రాయం వ్యక్తం అవుతున్నా.. టీమ్ ఇండియా కెప్టెన్సీ మళ్లీ రోహిత్ శర్మకేనా..? సరిగ్గా మూడు రోజుల కిందట 38 ఏళ్లు పూర్తి చేసుకున్న రోహిత్ మరికొన్నాళ్లు టీమ్ ఇండియాను నడిపిస్తాడా..? ఈ ప్రశ్నకు ఔననే సమాధానమే వస్తోంది.
స్వదేశంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా న్యూజిలాండ్ చేతిలో 0-3తో టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్.. ఆపై ఆస్ట్రేలియాలో 1-3తో బోర్డర్ గావస్కర్ సిరీస్ లో పరాజయం.. బ్యాటర్ గానూ తీవ్ర వైఫల్యం.. వీటికితోడు ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ బెర్తు మిస్సవ్వడం.. ఇలా అనేక వైఫల్యాల మధ్య రోహిత్ శర్మ టెస్టు కెరీర్ ముగింపునకు వచ్చింది అనే అభిప్రాయం నెలకొంది.
ఆస్ట్రేలియాలో బోర్డర్ –గావస్కర్ ట్రోఫీ చివరి టెస్టుకు రోహిత్ పై వేయడంతోనే అతడిని ఇక పక్కనపెట్టినట్లే అనుకున్నారు. అయితే, ఆ తర్వాత జరిగిన చాంపియన్స్ ట్రోఫీ (వన్డే ఫార్మాట్)కి రోహిత్ ను కెప్టెన్ గా కొనసాగించారు. ఆ టైటిల్ ను టీమ్ ఇండియా గెలవడంతో రోహిత్ పేరు మార్మోగింది.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లోనూ రోహిత్ మొదట తడబడ్డాడు. కానీ, మళ్లీ పుంజుకుని మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు.
ఇక వచ్చే నెల నుంచి టీమ్ ఇండియా ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ లో పర్యటించనుంది. దీనికి కెప్టెన్ గా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ను కెప్టెన్ చేస్తారని కథనాలు వచ్చాయి. అయితే, చివరకు రోహిత్ కే కెప్టెన్ బాధ్యతలు అప్పగించనున్నట్లు చెబుతున్నారు. బీసీసీఐ, సెలక్షన్ కమిటీ పెద్దలు రోహిత్ వైపు మొగ్గుచూపడానికి కారణం.. సిరీస్ ఆసాంతం బలమైన కెప్టెన్ ఉండాలని భావిస్తున్నారట. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ కొత్త సైకిల్ (2025-27) ఇంగ్లండ్ టూర్ నుంచే మొదలుకానుంది.
ఇంగ్లండ్ టూర్ కోసం బీసీసీఐ 35 మంది ఆటగాళ్లతో జాబితా సిద్ధంచేసిందట. ఈ ప్రాబబుల్స్ నుంచే ఇంగ్లండ్ వెళ్లే ఆటగాళ్లను ఎంపిక చేయనుందని సమాచాచారం. ఈ ఐపీఎల్ పూర్తికాగానే ఇంగ్లండ్ టూర్ కు జట్టు ఎంపిక చేపట్టనున్నారు.
