Begin typing your search above and press return to search.

పాయింట్ల పట్టికలో టాప్ లో రాజస్థాన్... ఎవరి పాత్ర ఎంత?

గత సీజన్ లో ఆడిన 14 మ్యాచ్ లలోనూ 7 మ్యాచ్ లలో గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 14 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   7 April 2024 5:16 AM GMT
పాయింట్ల పట్టికలో టాప్ లో రాజస్థాన్... ఎవరి పాత్ర ఎంత?
X

గత సీజన్ లో ఆడిన 14 మ్యాచ్ లలోనూ 7 మ్యాచ్ లలో గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 14 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్ లో మాత్రం గ్రాండ్ స్టార్ట్ చేసింది రాజస్థాన్ రాయల్స్. ఈ సీజన్ లో ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా విజయాలు సాధిస్తూ వస్తుంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో బ్యాలెన్స్డ్ గా రాణిస్తూ.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

అవును... ఐపీఎల్ 2024 సీజన్ లోని తన తొలి మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడిన రాజస్థాన్ రాయల్స్.. 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో భాగంగా... 52 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్ ల సాయంతో 82 పరుగులు సాధించాడు. బౌలింగ్ విభాగంలో ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు తీసుకున్నాడు. అలా ఈ సీజన్ ని విజయం తో ఆరంభించింది రాజస్థాన్ రాయల్స్.

అక్కడ నుంచి ఇక వెనుదిరిగి చూడలేదు. ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ తో రెండో మ్యాచ్ లో రియాన్ పరాగ్ 45 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్ ల సాయంతో 84 పరుగులు సాధించగా.. బర్గర్, చాహల్ లు తలో రెండు వికెట్లు తీసుకున్నారు. దీంతో... ఈ మ్యాచ్ లో 12 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం సాధించింది.

ఇక ముంబై ఇండియన్స్ తో జరిగిన మూడో మ్యాచ్ విషయానికొస్తే... ఈ మ్యాచ్ లో ఆర్.ఆర్. బౌలర్స్ సత్తా చాటారు. ఇందులో భాగంగా.. ట్రెంట్ బౌల్ట్, చాహల్ లు తలో చెరో మూడు వికెట్లు తీసుకుని.. ముంబై ని 125 పరుగుల వద్దే కట్టడి చేశారు. అనంతరం... రాజస్థాన్ బ్యాటర్స్ లో రియాన్ పరగ్ (54) సౌజన్యంతో 15.3 ఓవర్లలోనే పని పూర్తిచేసింది. హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది.

ఈ క్రమంలో తాజాగా బెంగళూరుతో జరిగిన 4వ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 183 పరుగులు చేయగా... 19.1 ఓవర్లలోనే రాజస్థాన్ టార్గెట్ పూర్తిచేసింది. ఈ క్రమంలో... రాజస్థాన్ బ్యాటర్స్ లో బట్లర్ 58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్ ల సాయంతో 100 పరుగులు చేయగా... సంజు శాంసన్ 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 69 పరుగులు చేశాడు. దీంతో... రాజస్థాన్ రాయల్స్ వరుసగా 4వ విక్టరీ ని నమోదు చేసింది.

ఈ నేపథ్యంలో... 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ అగ్రస్థానంలో నిలిచింది. ఆతర్వాత ఆడిన మూడు మ్యాచ్ లలోనూ 3 మ్యాచుల్లో గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు 6 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా.. 4 మ్యాచులు ఆడి రెండింట గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత లక్నో, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు వరుసగా 4, 5 స్థానాల్లో ఉన్నాయి!