Begin typing your search above and press return to search.

సిక్స్ కొట్టు.. 6 పేదిళ్లలో దీపం పెట్టు..ఐపీఎల్ టీమ్ వినూత్న నిర్ణయం

ఐపీఎల్ అంటేనే అనేక ప్రయోగాలు.. ఇప్పటికే రొమ్ము క్యాన్సర్ వంటి తీవ్ర డిసీజ్ పై అవగాహన కోసం ఆటగాళ్లంతా కార్యక్రమాలను ప్రమోట్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   1 May 2025 11:00 PM IST
సిక్స్ కొట్టు.. 6 పేదిళ్లలో దీపం పెట్టు..ఐపీఎల్ టీమ్ వినూత్న నిర్ణయం
X

రొమ్ము క్యాన్సర్ బాధితులకు సంఘీభావంగా గులాబీ రంగు జెర్సీలో మ్యాచ్.. పరుగులు రాని (డాట్ బాల్) ప్రతి బంతికి ఒక మొక్క నాటడం.. పెహల్గాం ఉగ్ర దాడిలో చనిపోయిన వారికి నివాళిగా నల్ల రిబ్బన్లు.. ఇంకా ఇలాంటివి ఎన్నో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ ల సందర్భంగా చూశాం.. ఇప్పుడు సిక్స్ కొట్టు.. ఆరు పేద ఇళ్లలో దీపం పెట్టు అంటూ ఐపీఎల్ టీమ్ వినూత్న నిర్ణయం తీసుకుంది.

ఐపీఎల్ అంటేనే అనేక ప్రయోగాలు.. ఇప్పటికే రొమ్ము క్యాన్సర్ వంటి తీవ్ర డిసీజ్ పై అవగాహన కోసం ఆటగాళ్లంతా కార్యక్రమాలను ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టు కొత్త ఆలోచన చేసింది.

ముంబై ఇండియన్స్ (ఎంఐ)తో గురువారం రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఆడనుంది. గత మ్యాచ్ లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 11 రికార్డు సిక్సులతో సాధించిన అద్భుత సెంచరీతో కోల్ కతా నైట్ రైడర్స్ పై నెగ్గి రాజస్థాన్ ప్లే ఆఫ్స్ చాన్సులు సజీవంగా ఉంచుకుంది. 10 మ్యాచ్ లలో మూడు విజయాలతో (6 పాయింట్లు) ఉన్న రాజస్థాన్ గురువారం సొంత మైదానంలో ముంబై ఇండియన్స్ తో తలపడనుంది.

వరుసగా ఐదు మ్యాచ్ లు నెగ్గి మాంచి జోరుమీదున్న ముంబైని అడ్డుకోవడం రాజస్థాన్ కు సవాలే. అయితే, వైభవ్ తో పాటు యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ గనుక ఫామ్ ను కొనసాగిస్తే ముంబైకి అడ్డుకట్ట వేయొచ్చు.

గత మ్యాచ్ లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 11 అత్యధిక సిక్సుల రికార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్ లోనూ అతడిని ఊరించేలా రాజస్థాన్ ఓ మంచి కార్యక్రమం చేపట్టింది.

అదేమంటే.. తమ ఆటగాళ్లు కొట్టే ప్రతి సిక్సుకు రాజస్థాన్ లోని ఆరు పేద ఇళ్లలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనుంది. ఉదాహరణకు మ్యాచ్ లో రాజస్థాన్ ఆటగాళ్లు 15 సిక్సులు కొడితే 90 మంది పేదల ఇళ్లలో సోలార్ ప్యానెల్స్ వెలుగుతాయి అన్నమాట.

పింక్ సిటీ జైపూర్ రాజధానిగా ఉన్న రాజస్థాన్ జట్టు జెర్సీ కూడా పింక్ రంగులోనే ఉంటుంది. తాజాగా గురువారం నాటి మ్యాచ్ ను ఉద్దేశిస్తూ ఈ మ్యాచ్ మాకు ప్రత్యేకం. ఇది మా పింక్ ప్రామిస్ గేమ్ అంటూ ట్వీట్ చేసింది.