Begin typing your search above and press return to search.

"స్టేడియంలో దుష్ట‌శ‌కునం.. అందుకే భార‌త్ ఓడింది"

తాజాగా రాజ‌స్థాన్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ త‌ర‌ఫున ప్ర‌చారం చేసిన రాహుల్ గాంధీ.. ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

By:  Tupaki Desk   |   21 Nov 2023 1:44 PM GMT
స్టేడియంలో దుష్ట‌శ‌కునం.. అందుకే భార‌త్ ఓడింది
X

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ పోటీలో భార‌త్ ఓడిపోయిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి వ‌ర‌కు ర‌య్యి ర‌య్యిన దూసుకుపోయిన భార‌త జ‌ట్టు.. చివ‌రి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ప‌రాజ‌యం పాలైంది. అయితే.. దీనిపై భార‌తీయ క్రికెట్ ప్రియుల్లో కొంత బాధ ఉన్న‌ప్ప‌టికీ.. అప్ప‌టి వ‌ర‌కు త‌మ పోరు ద్వారా అంద‌రి మ‌న‌సులూ గెలుచుకున్న టీమిండియాపై మాత్రం వారికి అభిమానం చెక్కుచెద‌ర‌లేదు. దీంతో పోన్లే ఫ‌ర్లేదు.. అంటూ సానుభూతి వ్య‌క్తం చేశారు. టీమిండియాపై ఎవ‌రూ ప‌న్నెత్తు విమ‌ర్శ‌లు చేయ‌కుండా ఆచితూచి వ్య‌వ‌హ‌రించారు.

ఇక‌, ఈ విష‌యం ఇప్పుడు రాజ‌కీయంగా కూడా ప్రాధాన్యం సంత‌రించుకుంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ భార‌త్ ఓట‌మిని అడ్డుపెట్టి ఆయ‌న‌పై మ‌రో సారి విరుచుకుప‌డ్డారు. "స్టేడియంలోకి దుష్ట‌శ‌కునం(ప‌నౌతీ) అడుగు పెట్టాడు. అంతే! భార‌త్ గెలవాల్సిన మ్యాచ్ కూడా ఓడిపోయింది" అంటూ.. ప‌రోక్షంగా ప్ర‌ధాని పేరు ఎక్క‌డా ఎత్తకుండా విమ‌ర్శ‌లు గుప్పించారు. తాజాగా రాజ‌స్థాన్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ త‌ర‌ఫున ప్ర‌చారం చేసిన రాహుల్ గాంధీ.. ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇదిలావుంటే.. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసే సమయంలో ఆయన స్టేడియానికి వచ్చారు. ఈ మ్యాచ్‌లో తొలి 10 ఓవర్లలో ఆస్ట్రేలియా 47 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో అందరూ టీమిండియానే గెలుస్తుందని అంచనా వేశారు. కానీ అనూహ్యంగా ఆ తర్వాత వికెట్ పడలేదు. టోర్నీ మొత్తం అదరగొట్టే ప్రదర్శన చేసిన భారత బౌలర్లు ఫైనల్లో మాత్రం తేలిపోయారు. ఇదే విష‌యాన్ని రాహుల్ ప్ర‌స్తావించారు.

మ‌రోవైపు.. 2021లో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న కూడా ఇప్పుడు తెర‌మీదికి వ‌చ్చింది. అప్ప‌ట్లో భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ ఇస్రో.. చంద్రుడిపైకి ప్ర‌యోగం చేప‌ట్టింది. 860 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో చంద్రుడి ఉత్త‌ర దృవంపైకి ప్ర‌యోగాన్ని చేప‌ట్టింది. దీనిని ప్ర‌త్యక్షంగా వీక్షించేందుకు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కూడా హాజ‌ర‌య్యారు. అయితే.. చంద్రుడిపై వెళ్లిన ఉప గ్ర‌హం.. చివ‌రి 89 సెక‌న్ల నిడివి ఉండ‌గా విఫ‌ల‌మైంది. దీంతో స‌ద‌రు ప్ర‌యోగం విఫ‌ల‌మైంది. దీంతో అప్ప‌ట్లోనూ మోడీపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆయ‌న వెళ్ల‌కుండా ఉంటే ప్ర‌యోగం స‌క్సెస్ అయి ఉండేద‌ని ప‌లువురు వ్యాఖ్యానించారు.