Begin typing your search above and press return to search.

రూ.1.5 కోట్ల కెప్టెన్.. ఒక రివ్యూ.. డిఫెండింగ్ చాంప్ చేజేతులా ఓడింది!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఒక జట్టుకు నాయకత్వం వహించే ఆటగాడు అంటే అతడి కనీసం ధర రూ.10 కోట్లు ఉంటుంది.

By:  Tupaki Desk   |   16 April 2025 9:16 AM IST
Ajinkya Rahane Costly Review Blunder
X

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఒక జట్టుకు నాయకత్వం వహించే ఆటగాడు అంటే అతడి కనీసం ధర రూ.10 కోట్లు ఉంటుంది. అంతెందుకు రూ.27 కోట్ల రిషభ్ పంత్ (లక్నో సూపర్ జెయింట్స్), రూ.26.75 కోట్ల శ్రేయస్ అయ్యర్ (పంజాబ్ కింగ్స్) లీగ్ చరిత్రలోనే హయ్యస్ట్ పెయిడ్ ప్లేయర్లు. మరో ఏడు జట్ల కెప్టెన్లకూ రూ.10 కోట్ల పైనే రేటు.

కానీ, ఒకే ఒక్క కెప్టెన్, అది కూడా డిఫెండింగ్ చాంపియన్ జట్టు కెప్టెన్ ధర రూ.2 కోట్లు. అది కూడా అతడి బేస్ ప్రైస్. ఇదంతా కోల్ కతా నైట్ రైడర్స్ సారథి అజింక్య రహానే గురించి. మొదటి రోజు మెగా వేలంలో ఎవరూ కొనక్కున్నా.. రెండో రోజు అతడి బేస్ ప్రైస్ రూ.1.50 కోట్లకు కోల్ కతా తీసుకుంది. ఆపై కెప్టెన్సీ కూడా అప్పగించింది.

ఇక టీమ్ ఇండియాకే కెప్టెన్స్ చేసిన అనుభవం ఉన్న రహానే ఈ సీజన్ లో కోల్ కతాను కిందామీద పడుతూ నడిపిస్తున్నాడు. మంచి ఆటగాళ్లు ఉన్నా ఏడు మ్యాచ్ లకు ఆ జట్టు గెలిచింది మూడే. మరీ ముఖ్యంగా మంగళవారం పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో కేవలం 111 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది. 95 పరుగులకే ఆలౌటైంది. దీంతో పంజాబ్ 16 పరుగులతో గెలిచి ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ స్కోరును కాపాడుకున్న జట్టుగా రికార్డులకెక్కింది.

కెప్టెన్ పొరపాటే..

వాస్తవానికి పంజాబ్ తో మ్యాచ్ లో ఓపెనర్లు డికాక్ (2), నరైన్ (5) తక్కువ స్కోర్లకే ఔటైనా, కోల్ కతాను కెప్టెన్ రహానే (17), యువ ఆటగాడు అంగ్ క్రిష్ రఘువంశీ (37) నిలబెట్టారు. రహానే స్ట్రయిట్ బ్యాట్ తో అద్భుతంగా సిక్స్ కొట్టి ఔరా అనిపించాడు. అయితే, చాహల్ బౌలింగ్ లో బంతిని ప్యాడ్లకు తగలించుకున్నాడు. బౌలర్ అప్పీల్ చేయగా అంపైర్ ఔటిచ్చాడు. రహానే కనీసం రివ్యూ కూడా అడగలేదు. చేతిలో రెండు రివ్యూలు ఉన్నాయి. స్వయంగా కెప్టెన్ అయి ఉండీ రహానే రివ్యూ కోరకుడా వెళ్లిపోయాడు. తీరాచూస్తే బంతి ఔట్ సైడ్ ద లైన్ పిచ్ అయి వికెట్లకు తగలడమే లేదు. ఒకవేళ రివ్యూ కోరి ఉంటే కచ్చితంగా నాటౌట్ గా వచ్చేదే. ఇక రహానే ఔట్ అయినప్పటికీ జట్టు స్కోరు 7.4 ఓవర్లలో 62. గెలవడానికి మరో 50 పరుగులే కావాలి.

పంజాబ్ బౌలర్లు చెలరేగడంతో చివరకు కోల్ కతా 95 పరుగులకే ఆలౌటైంది. ఇదీ.. రివ్యూ తీసుకోవడంలో కెప్టెన్ రహానే ఆలోచనా లోపం దెబ్బ. ఇప్పటికి కోల్ కతా 7 మ్యాచ్ లలో మూడే గెలిచింది. డిఫెండింగ్ చాంపియన్ తాజా షాక్ నుంచి ముందుకెళ్లాలంటే చెమటోచ్చాల్సిందే.