Begin typing your search above and press return to search.

ఈ ఐపీఎల్ లో ఆ జట్టే ’కింగ్’.. కొత్త చాంపియన్ ను చూస్తామా?

డార్క్ హార్స్.. క్రీడల్లో ఇది తరచూ వినిపించే మాట. పెద్దగా అంచనాల్లేకుండానే బరిలో దిగి అద్భుత ప్రదర్శన చేసే జట్లను ఇలా పిలుస్తారు.

By:  Tupaki Desk   |   2 April 2025 11:00 PM IST
ఈ ఐపీఎల్ లో ఆ జట్టే ’కింగ్’.. కొత్త చాంపియన్ ను చూస్తామా?
X

17 సీజన్లుగా పోటీ పడుతున్నా ఒక్కసారీ టైటిల్ కొట్టలేకపోయింది.. పేరున్న ఆటగాళ్లు సారథ్యం వహించినా ప్రభావవంతమైన జట్టుగా పేరు తెచ్చుకోలేకపోయింది.. కనీసం ఒక్కసారి అయినా టైటిల్ కొడుతుందా? అనే నమ్మకం కల్పించలేకపోయింది.. ఏదో ఆడాం అంటే ఆడాం.. అన్నట్లుగా పోటీ పడడం తప్ప చాంపియన్ జట్టు ఇది అనే9 ప్రదర్శన చేయలేదు. కానీ, ఈ సీజన్ లో అలా కాదు.. దుమ్మురేపేలా ఆడుతుంది ఆ జట్టు. ఐపీఎల్ లో కొత్త చాంపియన్ ను చూస్తామా? అది ఈ జట్టేనా? అనిపిస్తోంది.

డార్క్ హార్స్.. క్రీడల్లో ఇది తరచూ వినిపించే మాట. పెద్దగా అంచనాల్లేకుండానే బరిలో దిగి అద్భుత ప్రదర్శన చేసే జట్లను ఇలా పిలుస్తారు. ఐపీఎల్ 18లో పంజాబ్ కింగ్స్ ను డార్క్ హార్స్ గా అందరూ చెబుతున్నారు.

ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్.. 17 సీజన్లలో 13 కప్ లు వీరివద్దనే ఉన్నాయి. రెండు సార్లు (దక్కన్ చార్జర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్), రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ ఒకసారి టైటిల్ నెగ్గాయి. కానీ, ఐపీఎల్ లో పెద్దగా పేరులేని పంజాబ్ కింగ్స్. అందుకనే ఈ సీజన్ ముందు వరకు పంజాబ్ గురించి ఎవరూ పట్టించుకోలేదు.

ఇప్పుడు మ్యాచ్ లు జరుగుతున్న కొద్దీ పంజాబ్ దెబ్బ ఏమిటో అందరికీ తెలుస్తోంది. అందరి లెక్క సరిచేసేలా కనిపిస్తోంది ఆ జట్టు.

కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ వచ్చాక పంజాబ్ కింగ్స్ రాత మారిపోయింది. రూ.26.75 కోట్ల రెండో రికార్డు ధర పెట్టి కొనుక్కున్న శ్రేయస్ పంజాబ్ ను గొప్పగా నడిపిస్తున్నాడు. చెన్నై, ముంబై, హైదరాబాద్, కోల్‌ కతా తిప్పలు పడుతుండగా పంజాబ్ మాత్రం చెలరేగి ఆడుతోంది.

శ్రేయస్ అయ్యర్ తిరుగులేని బ్యాటింగ్.. ప్రభ్ సిమ్రన్ ఓపెనింగ్.. అర్షదీప్ సింగ్ మెరుపు బౌలింగ్.. మ్యాక్స్ వెల్, శశాంక్ సింగ్, స్టోయినిస్.. యాన్సెన్, ఫెర్గూసన్.. ఇలా పంజాబ్ జట్టు సూపర్ గా కనిపిస్తోంది. దీంతో ఈ ఏడాది టైటిల్ రేసులో కచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే, మెరుగ్గానే ప్రారంభించినా.. దానిని కొనసాగించడం ఏ జట్టుకైనా ముఖ్యం. ఆడిన రెండు మ్యాచ్ లలోనూ పంజాబ్ తీరు చూస్తే మాత్రం గట్టిగానే కనిపిస్తోంది.