Begin typing your search above and press return to search.

పాక్ ప్లేయర్స్ ని మరీ ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారా?

దీంతో... ఈ వరల్డ్ కప్ లో భాగంగా హైదరాబాద్ చేరుకున్న అనంతరం పాక్ జట్టు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   31 Oct 2023 3:43 PM GMT
పాక్ ప్లేయర్స్ ని మరీ ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారా?
X

ఐసీసీ ప్రపంచకప్ 2023 టోర్నమెంట్ రసవత్తరంగా సాగుతోంది. ఈ టోర్నీలో వరుసగా ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో ఫస్ట్ ప్లేస్ లో భారత్ కంటిన్యూ అవుతోంది. ఈ క్రమంలో తన తదుపరి మ్యాచ్‌ ను నవంబర్ 2న ముంబైలోని వాంఖెడే స్టేడియంలో శ్రీలంకను ఢీకొట్టబోతోంది. ఆ సంగతి అలా ఉంటే... భారత్ తో మ్యాచ్ అనంతరం పాక్ పరిస్థితి తలకిందులైన సంగతి తెలిసిందే. దీంతో... ఆ ప్లేయర్స్ ని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు!

అవును... భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ గత మూడు మ్యాచ్ లుగా వరుసగా ఓడిపోతున్న సంగతి తెలిసిందే. భారత్ తో ఘోర పరాజయం అనంతరం ఆస్ట్రేలియా, ఆఫ్గనిస్తాన్, సౌతాఫ్రికాలతో వరుసగా పరాజయం పాలైంది. ఫలితంగా... మూడు విజయాలు - ఆరు పాయింట్లతో ఆఫ్గన్ అయిదో స్థానంలో ఉండగా.. రెండు విజయాలు - నాలుగు పాయింట్లతో పాక్ ఏడో స్థానానికే పరిమితమైంది. దీంతో... పాక్ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.

దీంతో... ఈ వరల్డ్ కప్ లో భాగంగా హైదరాబాద్ చేరుకున్న అనంతరం పాక్ జట్టు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్ బిర్యానీ బాగుందని చెబుతూ.. రకరకాల రెస్టారెంట్లలో ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారని నెట్టింట ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో వరుస ఓటముల అనంతరం పాక్ ప్లేయర్లు హోటల్స్ కి వెళ్లడం మానేశారని తెలుస్తుంది.

ఇందులో భాగంగా... భోజనం చేయడానికి పాకిస్తాన్ జట్టు కోల్‌ కత లో బయటికి ఎక్కడికీ వెళ్లట్లేదట. పాక్ జట్టు హోటల్ లో కనిపిస్తే... "దీని కోసమే ఇండియాకు వచ్చినట్లున్నారు" అని కొంతమంది ఫేస్ టు ఫేస్ కామెంట్ చేస్తుంటే... ఆ ఫోటోలను షేర్ చేస్తూ మరికొంతమంది నెట్టింట కామెంట్లు చేస్తున్నారంట. దీంతో ఆన్‌ లైన్ లో ఫ్రుడ్ ఆర్డర్ చేసుకుంటున్నారంట పాక్ క్రికెటర్లు.

ఈ క్రమంలో తాజాగా రాత్రి కోల్‌ కతలోని ఫేమస్ జమ్ జమ్ రెస్టారెంట్ నుంచి భోజనాన్ని తెప్పించుకున్నారు పాకిస్తాన్ ప్లేయర్లు. ఇందులో బిర్యానీ, ఛాప్, కబాబ్స్, షాహీ టుక్డా.. వంటి ఆర్డర్లు తమకు అందినట్లు జమ్ జమ్ రెస్టారెంట్ డైరెక్టర్ షాద్మన్ ఫయీజ్ తెలిపారు. ఇదే సమయంలో... పాక్ జట్టు నుంచి ఆర్డర్ అందిందనే విషయం మొదట్లో తమకు తెలియదని, బిల్లింగ్ సమయంలో ఆ విషయం తెలిసిందని చెప్పారు.

దీంతో నెటిజన్ల ట్రోలింగ్ ఎఫెక్ట్ పాక్ క్రికెట్ టీం పై ఆ స్థాయిలో ఉందని అంనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఇలా ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవడంపై కూడా కామెంట్లు వైరల్ అవుతున్నాయి. "లీగ్స్ ముగిసే లోపు నచ్చిన వంటకాలన్నీ లాగించేయండి" అని సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు!

కాగా... ప్రస్తుతం బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో పాక్ క్రికెటర్లు బంతికి పని చెప్పారు. ఇందులో భాగంగా... 45.1 ఓవర్లలో బంగ్లాను 204 పరుగులకు ఆలౌంట్ చేశారు. పాక్ బౌలర్లలో అఫ్రీద్, మహ్మద్ వసీం లు తలో మూడు వికెట్లు తీసుకోగా... హరీస్ రఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు. 205 పరుగుల లక్ష్యంతో పాక్ బ్యాటింగ్ ఆరంభించింది.