పాక్ తో మ్యాచ్..బాయ్ కాట్ నెక్ట్స్ అతడిది.. నో షేక్ హ్యాండ్ ఇతడిది
ఇది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐపీఎల్) టోర్నీ కానప్పటికీ భారత్ పాల్గొనడం ఏమిటని ప్రశ్నలు వచ్చాయి.
By: Tupaki Desk | 15 Sept 2025 5:00 PM ISTపెహల్గాం ఉగ్ర దాడి తర్వాత.. ఆపరేషన్ సిందూర్ తో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాక.. తప్పనిసరి కానప్పటికీ టీమ్ ఇండియా ఆసియా కప్ లో పాకిస్థాన్ తో ఆడడంపై అనేక విమర్శలు. ఇది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐపీఎల్) టోర్నీ కానప్పటికీ భారత్ పాల్గొనడం ఏమిటని ప్రశ్నలు వచ్చాయి. అయితే, ఇన్ని అభిప్రాయాల మధ్య ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్ తో లీగ్ మ్యాచ్ ను టీమ్ ఇండియా అత్యంత తేలిగ్గా గెలిచేసింది. అసలు పాక్ తో మ్యాచ్ అన్న మజానే రాలేదు... పైగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాటుదేలిన మన జట్టుకు ప్రత్యర్థికి చాలా దూరం ఉన్నట్లు అనిపించింది. బౌలింగ్ లోనూ బ్యాటింగ్ లోనూ తేలిపోయింది పాకిస్థాన్. దీంతో ఆ దేశ అభిమానుల్లో తీవ్ర అవమానానికి గురయ్యాయి.
క్రికెటర్ల అయిష్టత..
తాజా టోర్నమెంటులో పాకిస్థాన్ తో ఆడడం టీమ్ ఇండియా ఆటగాళ్లకు ఇష్టం లేదనే అభిప్రాయాన్ని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా వ్యక్తం చేశాడు. ప్రపంచ కప్ లు సహా పాకిస్థాన్ తో ఎన్నో కీలక మ్యాచ్ లు ఆడిన రైనా... తాజా పరిస్థితుల్లో పాక్ తో ఆడడం భారత ఆటగాళ్లకు ఇష్టం లేదని బీసీసీఐ కారణంగా ఒప్పుకొని ఉంటారని అన్నాడు. గెలవడం ఆనందమే అయినా ఆడకుండా ఉండడం ఇంకా ఆనందం అని తెలిపాడు.
ప్లీజ్.. మాతో తర్వాతి మ్యాచ్ ఆడొద్దు
నిన్నటి మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ అభిమాని ఒకడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అతడు స్టేడియం బయట మాట్లాడుతూ.. ప్లీజ్ టీమ్ ఇండియా మాతో తదుపరి మ్యాచ్ ను బాయ్ కాట్ చేయండి. మేం ఫైనల్ చేరాలంటే మీరు ఆ పనిచేయడం ఒక్కటే మార్గం అని అన్నాడు. ఈ వ్యాఖ్యలు వాస్తవంగా చూస్తే సరైనవే. ఎందుకంటే భారత్ తదుపరి స్టేజ్ లోనూ పాక్ పై గెలిచే చాన్సుంది. దీంతో ఆ జట్టు ఫైనల్ కు వెళ్లదు.
కరచాలనం అవసరం లేదు..
సహజంగా అంతర్జాతీయ మ్యాచ్ లలో ఇరు జట్ల ఆటగాళ్ల కరచాలనాలు చేసుకుంటారు. కానీ, ఆదివారం నాటి మ్యాచ్ లో భారత్-పాక్ ఆటగాళ్లు ఆ పని చేయలేదు. దీనివెనుక టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నట్లుగా కథనాలు వస్తున్నాయి. స్వతహాగానే దేశభక్తి ఎక్కువగా ఉండే, బీజేపీ మాజీ ఎంపీ అయిన గంభీర్.. ఇప్పుడు పరిస్థితుల్లో పాక్ ఆటగాళ్లతో కరచాలనం అవసరం లేదని అన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి ఆదివారం మ్యాచ్ ఆసాంతం మనదే డామినేషన్. నెక్ట్స్ స్టేజ్ లోనూ పాక్ ను ఊదేయడం ఖాయం. ఫైనల్లోనూ మట్టికరిపించడం ఖాయం.
