Begin typing your search above and press return to search.

భారత్ - పాక్ మ్యాచ్ ఉంటుంది కానీ... తెరపైకి మూడు కండిషన్లు!

క్రికెట్ లోకి తమదైన రాజకీయాలు చొప్పిస్తూ, కుయుక్తులు చేస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్ తో జరగాల్సిన మ్యాచ్ లో ఆడబోమని ప్రకటించిన సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   9 Feb 2026 10:57 AM IST
భారత్ - పాక్  మ్యాచ్  ఉంటుంది కానీ... తెరపైకి మూడు కండిషన్లు!
X

క్రికెట్ లోకి తమదైన రాజకీయాలు చొప్పిస్తూ, కుయుక్తులు చేస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్ తో జరగాల్సిన మ్యాచ్ లో ఆడబోమని ప్రకటించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ కు మద్దతుగా ఈ నిర్ణయం అని ప్రకటించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ నిర్ణయం విషయంలో కాస్త మెత్తబడినట్లు కనిపిస్తుందని అంటున్నారు. కాకపోతే తెరపైకి బంగ్లాదేశ్ కోసం మూడు డిమాండ్లు తెచ్చిందని తెలుస్తోంది.

అవును... శ్రీలంక వేదికగా భారత్ లో జరగనున్న మ్యాచ్ ను బాయ్ కాట్ చేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఐసీసీ, పీసీబీ మధ్య చర్చలు జరిగాయని.. ఈ సమయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు శ్రీలంక ఓ లేఖ రాసిందని చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తో కొనసాగుతున్న ఈ ప్రతిష్టంభనను ముగించడానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మూడు ప్రధాన డిమాండ్లను తెరపైకి తెచ్చిందని తెలుస్తోంది.

ఇందులో భాగంగా... బంగ్లాదేశ్ కు పరిహారం పెంచడం, టీ20 వరల్డ్ కప్ లో ఆడకపోయినా పార్టిసిపేషన్ ఫీజు చెల్లించడంతో పాటు భవిష్యత్ ఐసీసీ ఈవెంట్లకు ఆతిథ్య హక్కులు ఇవ్వడం వంటి మూడు కండిషన్స్ ను పీసీబీ, ఐసీసీ ముందు పెట్టిందని తెలుస్తోంది. ఈ క్రమంలో... ఓ ప్రధాన అంతర్జాతీయ ఈవెంట్ ను సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన సౌకర్యాలు, అభిమానుల మద్దతు తమ దేశంలో ఉందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు విశ్వసిస్తోందని పాక్ చెబుతోంది.

వాస్తవానికి టీ20 వరల్డ్ కప్ లో రాజకీయాలు పీసీబీ ఛైర్మన్ రాజకీయాలు చొప్పించే పనికి పూనుకున్నప్పటికీ.. ఆ బోర్డులోని కొంతమంది అధికారులు మాత్రం భారత్ తో పాక్ తలపడేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. కానీ.. బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మాత్రం ఈ విషయంలో మోడిగా ఉంటూ, సహకరించడంలేదని అంటున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఫైనల్ డెసిషన్ కోసం నేడు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను నఖ్వీ కలవనున్నారని అంటున్నారు.

కాగా... భద్రతా కారణాలను సాకుగా చూపిస్తూ భారతదేశానికి వెళ్లడానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో గత నెలలో టీ20 వరల్డ్ కప్ జాబితా నుంచి బంగ్లాదేశ్ ను తొలగించింది. వారిని స్కాట్లాండ్ తో భర్తీ చేసింది. ఈ సందర్భంగా స్పందించిన ఐసీసీ... భారత్ లో ప్రయాణించే బంగ్లాదేశ్ జట్టుకు ఎలాంటి ధృవీకరించదగిన ముప్పు లేదని హామీ ఇచ్చినప్పటికీ ఆ దేశ క్రికెట్ బోర్డు మొండికేసింది!