చల్లారని పాక్ కడుపు మంట.. భారత్ లో చాంపియన్ షిప్ బాయ్ కాట్
ఆసియా కప్ లో గొప్పగా ఆడకున్నా... ఫైనల్ చేరి భారత్ ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది పాకిస్థాన్. ఇప్పుడు ఆ జట్టు ఆదివారం నాటి ఫైనల్ లో ఎలాగైనా గెలవాలని భావిస్తూ ఉండొచ్చు.
By: Tupaki Desk | 26 Sept 2025 5:10 PM ISTపెహల్గాం దాడితో దుస్సాహసానికి దిగి.. ఆపరేషన్ సిందూర్ తో మట్టికరిచిన పాకిస్థాన్ కు ఇంకా అహం చల్లారడం లేదు. ఆసియా కప్ లో టీమ్ ఇండియా చేతిలో ఓటమిపాలై.. షేక్ హ్యాండ్ లు కూడా ఇవ్వనంతగా అవమానం ఎదుర్కొంది పాకిస్థాన్ జట్టు... ఇక మైదానంలో ఆ దేశ ఆటగాళ్ల ప్రవర్తన అయితే హద్దులు దాటింది... ఏకంగా మ్యాచ్ రిఫరీనే తీసేయాలి అని పట్టుబట్టి టోర్నమెంటును బాయ్ కాట్ చేస్తామని డాంబికాలు పోయింది... కానీ, చివరకు అన్నీ మూసుకుని మ్యాచ్ ఆడింది... ఎన్నిచేసినా భారత్ ను మాత్రం బీట్ చేయలేమని పాకిస్థాన్ అర్ధం అయింది... దీంతో మన దేశం ఆతిథ్యం ఇస్తున్న ఓ టోర్నమెంటును బహిష్కరించింది. తన కడుపు మంటను తీర్చుకుంది.
ఆసియా కప్ ఫైనల్ ముంగిట..
ఆసియా కప్ లో గొప్పగా ఆడకున్నా... ఫైనల్ చేరి భారత్ ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది పాకిస్థాన్. ఇప్పుడు ఆ జట్టు ఆదివారం నాటి ఫైనల్ లో ఎలాగైనా గెలవాలని భావిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ప్రస్తుత అవమానాలకు అదే జవాబు అని అనుకుంటోంది. కానీ, టీమ్ ఇండియా ముందు ఆ చాన్స్ లేదు. అయితే, ఈలోగా భారత్ లో జరగనున్న ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ ను బాయ్ కాట్ చేసింది.
రేపటి నుంచి చాంపియన్ షిప్ అనగా...
ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ శనివారం నుంచి మొదలుకానుంది. గురువారం దీనికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కానీ, తాము ఈ క్రీడల్లో పాల్గొనకూడదు అని పాకిస్థాన్ జాతీయ పారాలింపక్ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీనికివెనుక ఆ దేశ ప్రభుత్వ ఆదేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ లో జరగనున్న ఈవెంట్ కు తమ టీమ్ ను పంపకపోవడానికి ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్, మేనేజర్ల భద్రతను సాకుగా చూపింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను కారణంగా పేర్కొంది. ఆసియా కప్ లో భారత్-పాక్ జట్ల మధ్య పరిస్థితులను ఉదహరిస్తూ నేషనల్ పారాలింపక్ కౌన్సిల్ ఆఫ్ పాకిస్థాన్ (ఎన్పీసీపీ) ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్ జమీల్ షమీ మీడియాకు వెల్లడించాడు.
ఢిల్లీలో టోర్నీ అయినా...
శనివారం నుంచి దేశ రాజధాని ఢిల్లీలో ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ జరగనుంది. భారత్ తొలిసారిగా ఈ ప్రతిష్ఠాత్మక క్రీడలకు ఆతిథ్యం ఇస్తోంది. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో పోటీలు జరుగుతాయి.
