Begin typing your search above and press return to search.

ఈ ఆటగాడికి వార్షిక వేతనం రూ. 832 కోట్లు!

బ్రెజిల్‌ దేశానికి చెందిన ఫుట్ బాల్ ఆటగాడు నెమార్‌ తో తాజాగా సౌదీ క్లబ్‌ "అల్‌ హిలాల్‌" ఒప్పందం కుదుర్చుకుంది.

By:  Tupaki Desk   |   17 Aug 2023 12:40 PM GMT
ఈ ఆటగాడికి వార్షిక వేతనం రూ. 832 కోట్లు!
X

క్రీడా రంగంలో అత్యద్భుతమైన ప్రతిభ కనపరిస్తే అందుకు వారు అందుకునే వేతనాలు, పారితోషకాలు ఏ స్థాయిలో ఉంటాయనేది చాలామందికి తెలిసిన విషయమే. ముఖ్యంగా భారత్ వంటి దేశాల్లో క్రికెటర్లు ఈ స్థాయిని అనుభవిస్తుంటారు. ఊహించని స్థాయిలో వీరి సంపాదన.. దానితో పాటు ఫాలోయింగ్ కూడా ఉంటుంది.

ఇదే సమయంలో ఇతర దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఫుట్ బాల్ ప్లేయర్స్ కి అత్యంత ఆదరణ ఉంటుందని చెబుతుంటారు. చాలా మంది స్టార్ క్రికెటర్లు... ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన ఫుట్ బాల్ ప్లేయర్స్ కి ఫ్యాన్స్ గా ఉంటుంటారు. ఆ విషయాన్ని వారు బహిరంగంగానే ప్రకటిస్తుంటారు.

ఈ క్రమంలో తాజాగా ఏడాదికి 100 మిలియన్ డాలర్ల వేతనం తీసుకునే ఒక ఆటగాడి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అవును... బ్రెజిల్‌ దేశానికి చెందిన ఫుట్ బాల్ ఆటగాడు నెమార్‌ తో తాజాగా సౌదీ క్లబ్‌ "అల్‌ హిలాల్‌" ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా... నెమార్‌ కు వార్షిక వేతనంగా 100 మిలియన్‌ డాలర్లు చెల్లించనున్నట్లు సమాచారం.

అవును... ప్రపంచ స్టార్‌ ఫుట్‌ బాల్‌ ఆటగాళ్ల కోసం కోట్లాది డాలర్లతో సౌదీ అరేబియా క్లబ్‌ లు క్యూ కడుతున్నాయి. ఇందులో భాగంగా... ఎంత భారీ మొత్తమైనా చెల్లించి సొంతం చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే క్రిస్టియానో రొనాల్డో (అల్‌ నాసర్‌) ఇక్కడి లీగ్‌ లో ఆడుతుండగా.. ఇప్పుడు మరో టాప్‌ ప్లేయర్‌ నెమార్‌ ఈ జాబితాలో చేరాడు.

ఇతడి కోసం సౌదీ క్లబ్‌ "అల్‌ హిలాల్‌" 100 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 832 కోట్లు) చెల్లించనున్నట్లు సమాచారం. దీంతో పాటు ఇతర సౌకర్యాలూ నెమార్‌ కు లభిస్తాయి. దీంతో... గాయాలతో సతమతమవుతూ గత కొంత కాలంగా ఫామ్‌ కోల్పోయిన నెమార్‌ కు ఇంత భారీ మొత్తం చెల్లించేందుకు ముందుకు రావడం విశేషం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.