Begin typing your search above and press return to search.

తెలుగులో మాట్లాడిన నెదర్లాండ్స్ క్రికెటర్... వీడియో వైరల్!

ఇందులో భాగంగా... తేజ నిడమనూరు హైదరాబాదీలకు ఒక సందేశం ఇచ్చాడు. దానికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.

By:  Tupaki Desk   |   7 Oct 2023 3:54 AM GMT
తెలుగులో మాట్లాడిన నెదర్లాండ్స్  క్రికెటర్... వీడియో వైరల్!
X

వన్డే ప్రపంచ కప్ 2023కు ఇండియా ఆతిధ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ మెగాటోర్నీ తొలి మ్యాచ్ ఇంగ్లండ్ - న్యూజిలాండ్ ల మధ్య జరగగా.. రెండో మ్యాచ్ నెదర్లాండ్ – పాకిస్తాన్ జట్లు మధ్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నెదర్లాండ్ పై పాకిస్థాన్ 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో పాక్ తన స్థాయికి తగ్గట్లు ఆడకపోయినా... గెలుపు నమోదు చేసుకుంది.

అయితే ఉప్పల్ లో ఇప్పటికే రెండు వార్మప్ మ్యాచ్ లు ఆడిన పాకిస్తాన్ ఇక్కడ పరిస్థితులకు అలవాటు పడింది. మరోవైపు, నెదర్లాండ్ కు ఇండియాలో ఇదే తొలి పర్యటన కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్ జట్టుకు ఒక తెలుగు తేజం ప్రాతినిద్యం వహిస్తున్నాడు. ఇందులో భాగంగా... తేజ నిడమనూరు హైదరాబాదీలకు ఒక సందేశం ఇచ్చాడు. దానికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.

"హైదరాబాద్ మీకు ఆరెంజ్ అంటే చాలా ఇష్టం. మేము ఇవాళ పాక్ తో ఉప్పల్ లో మ్యాచ్ ఆడుతున్నాం. మీరు గ్రౌండ్ కు వచ్చి మాకు సపోర్ట్ చేస్తే మేము సంతోష పడతాం" అంటూ తన మాతృభాష తెలుగులో మాట్లాడిన తేజ నిడమనూరు సర్ ప్రైజ్ ఇచ్చాడు. విజయవాడకు చెందిన తేజ నెదర్లాండ్స్ జట్టులో ఆల్ రౌండర్ గా రాణిస్తున్నాడు. ఇక ఉప్పల్ లో జరిగిన మ్యాచ్ కు తేజ కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు.

అవును... ఉప్పల్ స్టేడియంలో జరిగిన పాకిస్థాన్ - నెదర్లాండ్ మ్యాచ్‌ ను చూడటానికి తేజా నిడమానూరు తల్లి పద్మ, అమ్మమ్మ, పిన్ని, చెల్లెలు, స్నేహితులు ఉప్పల్ స్టేడియానికి వచ్చారు. ఈ సందర్భంగా క్రికెట్‌ పై అతనికి ఉన్న ప్యాషన్ గురించి అతడి తల్లి పద్మ వివరించారు. ఈ సందర్భంగా విజయవాడలోనే ఉండే తాను... మ్యాచ్ చూడటానికి ఉప్పల్ కి వచ్చినట్లు తెలిపారు.

ఇక తేజకు నెదర్లాండ్ పౌరసత్వం ఉందని, అయితే తనకు ఆ దేశ పౌరసత్వం లభించలేదని.. అందుకే అప్పుడప్పుడూ అక్కడికి కు వెళ్లి వస్తుంటానని అన్నారు. క్రికెట్ అంటే తన కుమారుడికి చాలా ప్యాషన్.. అని పద్మ తెలిపారు. అనంతరం... భారత్ – నెదర్లాండ్స్ మ్యాచ్‌ లో ఏ జట్టు గెలిచినా తనకు సంతోషమే అని చెప్పిన పద్మ... కొడుకు ఆడుతున్నందున నెదర్లాండ్స్ గెలిస్తే ఆ సంతోషం ఇంకాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పడం కొసమెరుపు.