Begin typing your search above and press return to search.

ముంబై ని వణికించేసిన రాజస్థాన్ బౌలర్స్... వరుసగా మూడోది!

తొలి ఓవర్ లో తగిలిన రెండు స్ట్రోక్ లను తట్టుకుని, రెండో ఓవర్ లో ఇషాన్ కిషన్ సిక్స్, ఫోర్ సాయంతో 12 పరుగులు సాధించాడు.

By:  Tupaki Desk   |   2 April 2024 4:14 AM GMT
ముంబై ని వణికించేసిన రాజస్థాన్  బౌలర్స్... వరుసగా మూడోది!
X

ఐపీఎల్ సీజన్ 17లో ఒక ఆసక్తికరమైన మ్యాచ్ సోమవారం జరిగింది. ఇందులో భాగంగా ఈ సీజన్ లో 14వ మ్యాచ్.. బోణీ చేయడానికి పరితపిస్తున్న ముంబై ఇండియన్స్ కి ఫుల్ ఫాం లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ కి మధ్య జరిగింది. ఈ సందర్భంగా టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్... ముంబైని బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ ఆధ్యాంతం ఎలా జరిగిందనే ఇప్పుడు చూద్దాం...!

ముంబైకి డబుల్ షాక్... తొలి ఓవర్లో రెండు వికెట్లు!:

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబైకి తొలి ఓవర్ లోనే గట్టి షాక్ తగిలింది. ఇందులో భాగంగా.. ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి ఓవర్ ఐదో బంతికి రోహిత్ శర్మ డకౌట్ అవ్వగా.. నెక్స్ట్ బంతికి నమన్ ధిర్ (0) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో వరుసగా రెండు డకౌట్ లతో మొదలుపెట్టిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్ పూర్తయ్యే సరికి రెండు వికెట్ల నష్టానికి ఒక పరుగు చేసింది.

మూడో ఓవర్ లో మూడో వికెట్!:

తొలి ఓవర్ లో తగిలిన రెండు స్ట్రోక్ లను తట్టుకుని, రెండో ఓవర్ లో ఇషాన్ కిషన్ సిక్స్, ఫోర్ సాయంతో 12 పరుగులు సాధించాడు. ఈ సమయంలో మూడో ఓవర్ మొదలుపెట్టాడు ట్రెంట్ బౌల్ట్! ఇతడు వేసిన మూడో ఓవర్ రెండో బంతికి ఇంపాక్ట్ ప్లేయర్ డెవాల్డ్ బ్రెవిస్ (0) ఔటయ్యాడు. అంటే... ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో ఇది మూడో డకౌట్ అన్నమాట.

దీంతో... మూడు ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ రాయల్స్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 16 పరుగులు.

ఇషాన్ కిషన్ ఔట్:

ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ కి క్రీజులో కాసేపు కాలు నిలిపే అవకాశం కూడా ఇవ్వడం లేదు రాజస్థాన్ బౌలర్స్. ఈ క్రమంలో ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లు తీసి ముంబై వెన్నెముక విరగగొట్టినంత పనిచేయగా... నిలకడగా ఆడుతున్నట్లు కనిపించిన ఇషాన్ కిషన్ (16) ను నంద్రి బర్గర్ ఔట్ చేశాడు. దీంతో 20 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినట్లయ్యింది.

పవర్ ప్లే ముగిసే సరికి పరిస్థితి ఇది!:

20 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ముంబయిని హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో వికెట్ కాపాడుకుంటూ కాస్త దూకుడు పెంచారు. దీంతో 6 ఓవర్లు పూరయ్యే సరికి ముంబై ఇండియన్స్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 46 పరుగులకు చేరింది.

ముంబై ఐదో వికెట్ డౌన్!:

కష్టాల్లో పడ్డ ముంబయిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్న హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ ద్వయం... 36 బంతుల్లో 56 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పగా... చాహల్ ఈ పార్ట్నర్ షిప్ ని బ్రేక్ చేశాడు. ఇందులో భాగంగా... 10 ఓవర్ మూడో బంతికి హార్దిక్ పాండ్య 34 (21 బంతుల్లో) ను ఔట్ చేశాడు. దీంతో 10 ఓవర్లు పూర్తయ్యే సరికి ముంబై ఇండియన్స్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 77 పరుగులకు చేరింది.

గ్యాప్ ఇవ్వడం లేదు... ముంబై ఆరో వికెట్!:

ముంబై ఆరో వికెట్ కోల్పోయింది. ఆవేశ్ ఖాన్ వేసిన 12 ఓవర్ తొలిబంతికి పియూష్ చావ్లా (3) ఔటయ్యాడు. దీంతో... 12 ఓవర్లకు భారత్ స్కోరు 6 వికెట్ల నష్టానికి 89 పరుగులకు చేరింది.

100 లోపు ఏడో వికెట్!:

ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు అన్నట్లూ మారిపోయింది ముంబై ఇండియన్స్ పరిస్థితి! హార్దిక్ పాండ్యా వెళ్లిపోయినా.. క్రీజ్ లో కాస్త నిలకడగా ఆడుతున్న తిలక్ వర్మ 32 (29 బంతుల్లో) ఔటయ్యాడు. చాహెల్ వేసిన 14ఓవర్ రెండో బంతికి అశ్విన్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 14 ఓవర్లు పూరయ్యే సరికి ముంబై ఇండియన్స్ స్కోరు 7 వికెట్ల నష్టానికి 97!

ముగిసిన ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్!:

రాజస్థాన్ బౌలర్లు పూర్తిస్థాయిలో ఆదిపత్యం చూపించడంతో... నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ స్కోరు 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు.

రాజస్థాన్ బౌలర్స్ లో ట్రెంట్ బౌల్ట్ (3/22) ముంబై ఇండియన్స్ టాప్‌ ఆర్డర్ ని పేకమేడలా కూల్చిపాడేయగా.. యుజువేంద్ర చాహల్ (3/11) మిడిల్ ఆర్డర్ ని తేరుకోనివ్వకుండా చేశాడు! ఇక మిగిలిన వారిలో బర్గర్ 2, ఆవేశ్ ఖాన్ ఒక వికెట్ తీసుకున్నారు.

రాజస్థాన్ లక్ష్యం 126... బ్యాటింగ్ స్టార్ట్!:

ముంబై ఇండియన్స్ నిర్ధేశించిన 126 పరుగుల ఛేదనలో భాగంగా రాజస్థాన్ బ్యాటర్స్ బరిలోకి దిగారు. ఇందులో భాగంగా యశస్వీ జైస్వాల్, జోస్ బట్లర్ లు బరిలోకి దిగారు.

రాజస్థాన్ కు తొలిఓవర్ లోనే షాక్!:

క్వెనా మఫాకా వేసిన మొదటి ఓవర్‌ లో వరుసగా రెండు ఫోర్లు బాదిన యశస్వి జైస్వాల్ (10) తర్వాతి బంతికే టిం డేవిడ్‌ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో... మొదటి ఓవర్ పూర్తయ్యే సరికి రాజస్థాన్ స్కోరు ఒక వికెట్ నష్టానికి 10.

నిలకడగా ఆడుతున్న సమయంలో రెండో షాక్!:

తొలి ఓవర్ లోనే ఫస్ట్ వికెట్ కోల్పోవడంతో రాజస్థాన్ బ్యాటర్లు.. కాస్త ఆచి తూచి ఆడటం మొదలుపెట్టారు. ఈ సమయంలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ (12) ఔటయ్యాడు. ఆకాశ్ మధ్వల్ వేసిన ఐదో ఓవర్ లో ఔట్ సౌడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్లను గిరాటేసింది! దీంతో... ఐదు ఓవర్లకు ఎంఐ స్కోరు 2 వికెట్ల నష్టానికి 44 కు చేరింది.

రాజస్థాన్ మూడో వికెట్ డౌన్!:

రాజస్థాన్‌ మూడో వికెట్ కోల్పోయింది. ఆకాశ్‌ మధ్వల్ వేసిన ఏడో ఓవర్ మూడో బంతికి జోస్ బట్లర్ (13) పీయూష్‌ చావ్లాకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 7 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 50 పరుగులు.

10 ఓవర్లకు రాజస్థాన్ పరిస్థితి ఇది!:

పీయూష్‌ చావ్లా వేసిన 10వ ఓవర్‌ లో 5 పరుగులు రాగా... రాజస్థాన్ విజయానికి ఇంకా 60 బంతుల్లో 53 పరుగులు కావాలి. ప్రస్తుతం పరాగ్ (16), అశ్విన్ (9) క్రీజ్ లో ఉన్నారు.

రాజస్థాన్‌ నాలుగో వికెట్‌ డౌన్!:

ఆకాష్‌ మధ్వాల్‌ బౌలింగ్‌ లో అశ్విన్‌ (16) ఔటయ్యాడు. దీంతో ఇంపాక్ట్ ప్లేయర్ శివం దుబే ఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రాగానే ఒక ఫోర్ బాదాడు. దీంతో 13 ఓవర్లు పూరయ్యాయి. ఇంక మిగిలిన 7 ఓవర్లలో (42బంతులు) రాజస్థాన్ కు 32 పరుగులు కావాలి!

ముంబై చిత్తు.. రాజస్థాన్ హ్యాట్రిక్ గెలుపు!:

ముంబై జరిగిన మ్యాచ్‌ లో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 15.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్థాన్ బ్యాటర్లలో రియాన్‌ పరాగ్ 54* (39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌ లు) హాఫ్ సెంచరీతో మెరిశాడు.

ఇది రాజస్థాన్ రాయల్స్ కి ఈ సీజన్ లో హ్యాట్రిక్ విజయం కాగా.. ముంబైకి వరుసగా మూడో ఓటమి!