Begin typing your search above and press return to search.

ధోనీనే చెన్నై.. చెన్నైనే ధోనీ.. సూపర్ కింగ్స్ కు మరో కెప్టెన్ దొరకడా?

44 ఏళ్లు.. తోటి ఆటగాళ్లంతా కామెంట్రీ బాక్సుల్లో కనిపిస్తుంటే.. మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం కొత్తగా కెప్టెన్ అవుతున్నాడు.

By:  Tupaki Desk   |   12 April 2025 5:00 AM IST
ధోనీనే చెన్నై.. చెన్నైనే ధోనీ.. సూపర్ కింగ్స్ కు మరో కెప్టెన్ దొరకడా?
X

44 ఏళ్లు.. తోటి ఆటగాళ్లంతా కామెంట్రీ బాక్సుల్లో కనిపిస్తుంటే.. మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం కొత్తగా కెప్టెన్ అవుతున్నాడు. వికెట్ కీపింగ్ తో పాటు బ్యాటింగ్ అనే కాదు.. ఇప్పుడు కెప్టెన్సీ కూడా అందుకోనున్నాడు.

ఐదుసార్లు ట్రోఫీ అందించిన ధోనీ తప్ప చెన్నై సూపర్ కింగ్స్ కు మరో ఆటగాడు కెప్టెన్ గా దొరకడా? ఆ స్థానంలో బరువును మరే ఆటగాడూ భరించలేకపోతున్నాడా?

ఒకరా.. ఇద్దరా..? ముగ్గురు ఆటగాళ్లను పరీక్షించినా ఎవరూ చెన్నై కెప్టెన్సీని నెగ్గలేకపోయారు. తొలుత సురేశ్ రైనా, తర్వాత రవీంద్ర జడేజా, ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్.. చెన్నైకి భారంగా మారారు తప్ప కెప్టెన్లుగా తమదైన ముద్ర వేయలేకపోయారు.

ధోనీ ఉండగానే ఈ ముగ్గురూ కెప్టెన్సీని భరించలేకపోయారు. సురేశ్ రైనా అయితే ఫ్రాంచైజీతో గొడవలు పెట్టుకుని ఏకంగా ఐపీఎల్ నుంచే వైదొలిగాడు. రవీంద్ర జడేజా తన వల్ల కాదంటూ పక్కకు తప్పుకొన్నాడు. ఇప్పుడు బ్యాడ్ లక్ కొద్దీ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో ఐటయ్యాడు.

వాస్తవానికి చెన్నై వంటి జట్టుకు గెలుపు బాట పట్టడం పెద్ద కష్టమేం కాదు. అయితే, ఆ జట్టులో ఇప్పుడు స్తబ్ధత నెలకొంది. రుతురాజ్ కెప్టెన్ అయినప్పటికీ జట్టును బ్యాటింగ్ లో ముందుండి నడిపించలేకపోతున్నాడు. ఇక ఇప్పుడు టోర్నీకే దూరమయ్యాడు. ధోనీ ఉన్నప్పటికీ కీపింగ్ లోనే అతడి మెరుపులు. బ్యాటింగ్ కు దిగినా గెలిపించలేకపోతున్నాడు.

ఇప్పడు మళ్లీ ధోనీనే కెప్టెన్ అయ్యాడు. రికార్డుస్థాయిలో ఐదు టెటిళ్లు అందించిన అతడు ఇప్పుడు అట్టడుగున ఉన్న జట్టును మళ్లీ గాడిన పెట్టే బాధ్యతను నెత్తికెత్తుకున్నాడు.

ధోనీ అంటే గెలుపు. మరిప్పుడు చెన్నై విజయాలు అందుకుంటుందా? అనేది చూడాలి. వరుసగా నాలుగు మ్యాచ్ లు ఓడిన ఆ జట్టు శుక్రవారం డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ ను ఎదుర్కొననుంది. ఇందులోనూ ఓడితే ఇక చెన్నై ఈ లీగ్ నుంచి దాదాపు ఔట్ అయినట్లే.