Begin typing your search above and press return to search.

ధోనీవి జేబుదొంగ కంటే వేగమైన చేతులు.. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి దిగ్గజం

తాజాగా ధోనీకి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కింది. ఈ ఘనత అందుకున్న 11వ భారత క్రికెటర్ ఇతడు.

By:  Tupaki Desk   |   10 Jun 2025 3:00 PM IST
ధోనీవి జేబుదొంగ కంటే వేగమైన చేతులు.. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి దిగ్గజం
X

అతడు వికెట్ల వెనుక ఎంత చురుకో.. వికెట్ల ముందు అంత దూకుడు.. ఫినిషర్ గా ఎంత సమర్థుడో.. కెప్టెన్ గా అంత స్మార్ట్.. ఒకప్పుడు సచిన్ ఔట్ అయితే టీవీలు బంద్ చేసేవారు భారతీయులు.. గంగూలీ కెప్టెన్ అయ్యాక టీమ్ ఇండియా గెలవకపోతే బాధపడేవారు.. యువరాజ్, సెహ్వాగ్ వచ్చినా ఫినిషింగ్ లోపంతో జట్టు ఓడిపోవడంతో దిగులు చెందేవారు.. ఇలాంటి సమయంలో వచ్చాడు మహేంద్రసింగ్ ధోనీ. చివరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించగల దమ్ముతో భారత క్రికెట్ ను ఎక్కడికో తీసుకెళ్లాడు. 44 ఏళ్ల వయసులోనూ అత్యంత పోటీ ఉండే టి20 క్రికెట్ ఆడుతూ ఔరా అనిపిస్తున్నాడు.

తాజాగా ధోనీకి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కింది. ఈ ఘనత అందుకున్న 11వ భారత క్రికెటర్ ఇతడు. సునీల్ గావస్కర్, కపిల్ దేవ్, వినూ మన్కడ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, బిషన్ సింగ్ బేడీ, అనిల్ కుంబ్లే, మహిళా క్రికెటర్లు డయానా ఎడుల్జీ, నీతూ డేవిడ్ లు ఇప్పటికే హాల్ ఆఫ్ ఫేమ్ లో ఉన్నారు.

-2007 టి20, 2011 వన్డే ప్రపంచ కప్ లు, 2013 చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టుకు కెప్టెన్ అయిన ధోనీ.. 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టి20ల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు. కాగా, తాజాగా ఐసీసీ ప్రకటించిన హాల్ ఆఫ్ ఫేమ్ లో ధోనీ, ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాధ్యూ హేడెన్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్, టాప్ ఆర్డర్ బ్యాటర్ హషీమ్ అమ్లా, న్యూజిలాండ్ స్పిన్ ఆల్ రౌండర్ డానియెల్ వెటోరీ, మహిళా క్రికెటర్లు సారా టేలర్ (ఇంగ్లండ్), సనా మిర్ (పాకిస్థాన్) ఉన్నారు.

కాగా ధోనీ గురించి టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సరదా వ్యాఖ్యా చేశాడు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో ధోనికి చోటు దక్కిన నేపథ్యంలో.. వికెట్ల వెనుక ధోనీ చేతులు జేబుదొంగ చేతుల కంటే చాలా వేగం అని కొనియాడాడు.