Begin typing your search above and press return to search.

రోహిత్‌ కోసం ఎంఐ స్పెషల్‌ ట్వీట్... తెరపైకి ఫాలోవర్స్ చర్చ!

ఇదే సమయంలో కెప్టెన్సీ కూడా అప్పగించింది. ఈ క్రమంలో రోహిత్ కెప్టెన్సీపై ముంబై స్పెషల్‌ ట్వీట్‌ చేసింది. ఈ సందర్భంగా రోహిత్ కు ముంబై ఇండియన్స్ మేనేజ్ మెంట్ ధన్యవాదాలు తెలిపింది.

By:  Tupaki Desk   |   16 Dec 2023 12:29 PM GMT
రోహిత్‌  కోసం ఎంఐ స్పెషల్‌  ట్వీట్... తెరపైకి ఫాలోవర్స్  చర్చ!
X

ఇండియాలో అప్పుడే ఐపీఎల్ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. జట్ల కూర్పు, కెప్టెన్ల మార్పు వంటి విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ సమయలో ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌ (ఎంఐ)లో కెప్టెన్సీ మార్పు జరిగిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్‌ పాండ్యను నియమిస్తూ ముంబై ఇండియన్స్‌ కీలక ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో రోహిత్ కోసం ఎంఐ ఒక స్పెషల్ ట్వీట్ చేసింది.

అవును... ముంబై ఇండియన్స్ కు ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని అందించిన రోహిత్ శర్మ స్థానంలో గుజరాత్‌ టైటాన్స్‌ సారథిగా ఉన్న హార్దిక్‌ ను భారీ మొత్తం వెచ్చించి మరీ ముంబయి దక్కించుకుంది. ఇదే సమయంలో కెప్టెన్సీ కూడా అప్పగించింది. ఈ క్రమంలో రోహిత్ కెప్టెన్సీపై ముంబై స్పెషల్‌ ట్వీట్‌ చేసింది. ఈ సందర్భంగా రోహిత్ కు ముంబై ఇండియన్స్ మేనేజ్ మెంట్ ధన్యవాదాలు తెలిపింది.

ఇందులో భాగంగా.. "రోహిత్‌.. 2013లో నువ్వు ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ గా బాధ్యతలు స్వీకరించినప్పుడు మేనేజ్‌మెంట్‌ ను ఒకటే అడిగావు. 'మా మీద నమ్మకం ఉంచండి.. గెలుపైనా.. ఓటమైనా సరే నవ్వుతూ ఉండాలి' అని చెప్పావు. పదేళ్ల కెప్టెన్సీ కెరీర్‌ లో ఆరు ట్రోఫీలు (ఐదుసార్లు ఐపీఎల్‌, ఒకసారి ఛాంపియన్స్‌ లీగ్‌) సాధించావు. దిగ్గజాల నాయకత్వ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ జట్టును ముందుండి నడిపించావు. ధన్యవాదాలు.. కెప్టెన్ రోహిత్ శర్మ" అని ముంబై ఇండియన్స్‌ ట్వీట్‌ చేసింది.

ఎంఐకి తగ్గుతున్న ఫాలోవర్స్!:

ముంబై ఇండియన్స్‌ కి కెప్టెన్ గా రోహిత్ శర్మను తప్పించి హార్దిక్‌ పాండ్యాను తీసుకోవడం గేం లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే సంగతి కాసేపు పక్కనపెడితే... ఆన్ లైన్ వేదికగా మాత్రం ప్రభావం చూపిస్తుంది. ఇందులో భాగంగా ముంబై ఇండియన్స్ కు అటు ఎక్స్ (ట్విట్టర్)లోనూ, ఇటు ఇన్ స్టా లోనూ అన్ ఫాలోవర్స్ సంఖ్య పెరిగిపోతుంది.

అవును... రోహిత్ శర్మ కెప్టెన్‌ గా ఉన్నప్పుడు ముంబైకి ఎక్స్‌ లో 8.6 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా... ఇప్పుడు ఆ సంఖ్య 8.2 మిలియన్లకు పడిపోయింది. అంటే అతికొద్ది రోజుల్లోనే సుమారు 4 లక్షల మంది ఫాలోవర్లు ముంబయి ఫ్రాంచైజీని వీడారన్నమాట. ఇన్ స్టా లో కూడా దాదాపు ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది.

ఇందులో భాగంగా రోహిత్‌ ను కెప్టెన్ నుంచి తప్పిస్తున్నామని ముంబై ఇండియన్స్ ప్రకటన చేయడానికి ముందు ఆ ఫ్రాంఛైజీకి ఇన్‌ స్టాలో 13.1 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 12.7 మిలియన్లకు చేరింది. అంటే... ఇక్కడ కూడా సుమారు నాలుగు లక్షల మంది అన్ ఫాలో అయ్యారన్నమాట. మరోపక్క మొన్నటివరకు ఇన్‌ స్టాలో 13 మిలియన్ల ఫాలోవర్స్‌ తో ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ఇప్పుడు 13.1 మిలియన్ల ఫాలోవర్స్‌ కు పెరిగింది.