Begin typing your search above and press return to search.

ట్రోలింగ్ స్టార్ట్: డబ్బూ ఎక్కువే.. ఇచ్చిన పరుగులే ఎక్కువే!

ఇందులో భాగంగా.. కేకేఆర్ నుంచి రస్సూల్, హైదరాబాద్ నుంచి క్లాసిన్ ల విధ్వంసంతో స్టేడియం హోరెత్తిపోయింది

By:  Tupaki Desk   |   24 March 2024 5:41 AM GMT
ట్రోలింగ్ స్టార్ట్: డబ్బూ ఎక్కువే.. ఇచ్చిన పరుగులే ఎక్కువే!
X

ఐపీఎల్ 17 సీజన్ మొదలవ్వడం మొదలవ్వడమే రసవత్తరమమైన మ్యాచ్ లు పడుతున్నాయి. ప్రధానంగా శనివారం రెండో మ్యాచ్ గా జరిగిన కోల్ కతా నైట్ రైడర్స్ – సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అయితే మునివేళ్లపై నిలబెడుతూ.. అసలు సిసలు ఐపీఎల్ కిక్ ను ఈ సీజన్ లో పరిచయం చేసిందనే చెప్పాలి. ఇరువైపులా విధ్వంసం కనిపించింది.

ఇందులో భాగంగా.. కేకేఆర్ నుంచి రస్సూల్, హైదరాబాద్ నుంచి క్లాసిన్ ల విధ్వంసంతో స్టేడియం హోరెత్తిపోయింది. ఫోర్లపై ఆసక్తి లేనట్లుగా, పరుగెత్తడంపై ఇంటరస్ట్ లేనట్లుగా కొట్టాలనిపించినప్పుడల్లా సిక్స్ లు బాదడం, బంతిని స్టాండ్స్ లోకి తరలించడమే చేశారు. దీంతో చివరి ఓవర్ చివరి బంతికి వస్తే కానీ ఫలితం తేలని పరిస్థితి నెలకొంది! దీంతో... అసలు సిసలు ఐపీఎల్ ఎంటర్ టైన్ మెంట్ దొరికిందనే కామెంట్లు వినిపించాయి.

ఈ క్రమంలో... అభినందనలతో పాటు, ప్రశంసలతో పాటు ట్రోలింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇందులో భాగంగా... ఏకంగా రూ.24.75 కోట్లు పెట్టి కోల్ కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసిన మిచెల్ స్టార్క్ ను ట్రోలర్స్ ఒక ఆట ఆడుకుంటున్నారు. శనివారం రాత్రి సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో స్టార్క్ తన 4 ఓవర్ల స్పెల్ లో 53 పరుగులు సమర్పించుకోవడమే దీనికి కారణం!

అవును... సుమారు పాతిక కోట్లు పెట్టి కొనుక్కున్న ప్లేయర్ పూర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంపై కేకేఆర్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు మిచెల్ స్టార్క్ పై ఫైరవుతున్నారు. కేకేఆర్ పై మీంస్ వైరల్ గా మారుతున్నాయి. ఎంత ఎక్కువ సొమ్ము పెట్టి కొంటే.. అంత ఎక్కువ పరుగులివ్వాలని అనుకున్నాడేమో అంటూ ఆడుకుంటున్నారు నెటిజన్లు.

ఎక్కువ డబ్బులు పెట్టి కొంటే తక్కువ పరుగులు ఇవ్వాలి, ఎక్కువ వికెట్లు తీయాలి అని నెక్స్ట్ మ్యాచ్ కైనా అర్ధం చేసుకుంటావని ఆశ అని మరొకరు కామెంట్!

కాగా... తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 4 ఓవర్లు వేసిన స్టార్క్స్ కేవలం 8 డాట్ బాల్స్ మాత్రమే వేయగా.. 53 పరుగులు సమర్పించుకున్నాడు.