Begin typing your search above and press return to search.

పాపులు హాజరవ్వడం వల్లే ఓటమి... వరల్డ్ కప్ ఫైనల్ పై మమత వెర్షన్!

తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన మమతా బెనర్జీ... ప్రపంచకప్ ఫైనల్లో ఓటమిపై వ్యాఖ్యానించారు. కోల్‌ కతా (ఈడెన్ గార్డెన్) లేదా ముంబై (వాంఖడే) లో ప్రపంచకప్ ఫైనల్ ఆడితే భారత్ గెలిచి ఉండేదని అన్నారు.

By:  Tupaki Desk   |   23 Nov 2023 12:25 PM GMT
పాపులు హాజరవ్వడం వల్లే ఓటమి... వరల్డ్  కప్  ఫైనల్  పై మమత వెర్షన్!
X

వన్ డే వరల్డ్ కప్ ముగిసింది. టోర్నీలో ఆడిన మొదటి మ్యాచ్ నుంచి మొదలు సెమీ ఫైనల్ వరకూ వరుసగా పది మ్యాచ్ లలో అద్భుత పెర్ఫార్మెన్స్ తో టీం ఇండియా గెలిచింది. అయితే... ఫైనల్ మ్యచ్ లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ సమయంలో పలువురు రాజకీయ నాయకులు ఈ ఓటమిపై తమదైన కారణం చెబుతునారు. ఈ లిస్ట్ లో తాజాగా మమతా బెనర్జీ చేరారు.

అవును... ఇటీవల ముగిసిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి తాలూకు ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఓటమిపై రాజకీయ విమర్శలు గట్టిగానే వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మొదలుపెట్టగా.. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ కారణాలను తనదైన శైలిలో కంటిన్యూ చేస్తున్నారు.

తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన మమతా బెనర్జీ... ప్రపంచకప్ ఫైనల్లో ఓటమిపై వ్యాఖ్యానించారు. కోల్‌ కతా (ఈడెన్ గార్డెన్) లేదా ముంబై (వాంఖడే) లో ప్రపంచకప్ ఫైనల్ ఆడితే భారత్ గెలిచి ఉండేదని అన్నారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీని పరోక్షంగా టార్గెట్ చేశారని అంటున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో ప్రపంచ కప్ లో భారత్ జెర్సీ రంగు కూడా మార్చాలని ప్రయత్నించారని.. అందుకు ఆటగాళ్లు అంగీకరించకపోవడంతో ఆగిందని కొత్త విషయం తెలిపారు!

ఇందులో భాగంగా... ఈ టోర్నీలో భారత జట్టు బాగా ఆడింది. అన్ని మ్యాచ్‌ ల్లోనూ భారత జట్టు గెలిచింది అని మొదలుపెట్టిన మమతా బెనర్జీ... అయితే కొందరు పాపులు హాజరైన ఏకైక మ్యాచ్‌ లో మాత్రం టీం ఇండియా ఓటమిపాలైంది అని అన్నారు. దీంతో... ఫైనల్ మ్యాచ్‌ ను వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ముఖ్య నేతలు హాజరయిన విషయంపై ఈమె సెటైర్ వేశారని ఒక క్లారిటీకి వస్తున్నారు నెటిజన్లు!

ఇదే సమయంలో... భారత జట్టులోని ఆటగాళ్లు కాషాయం రంగు జెర్సీలు ధరించేలా ప్రయత్నాలు జరిగాయని కొత్త విషయం చెప్పిన మమత... క్రీడాకారులు దీనిని వ్యతిరేకించారని, ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారని తెలిపారు. అందుకే ప్రాక్టీస్ సమయంలో అయినా ఆ రంగు వాడాలని సూచించడంతో అవి ధరిస్తున్నారని తెలిపారు!

వాస్తవానికి గతంలోనే ఈ విషయంపై మమత తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఇందులో భాగంగా క్రికెట్ ను బీజేపీ ప్రభుత్వం కాషాయీకరణ చేసిందని ఆరోపించారు. ఇదే సమయంలో దేశం మొత్తానికి కాషాయ రంగు పూయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమె అన్నారు.

కాగా... ప్రపంచకప్ ఫైనల్ 2023 మ్యాచ్ సందర్భంగా స్టేడియంలోకి ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశించడం "పనౌటీ" (చెడు శకునము) అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... గుజరాత్‌ లోని అహ్మదాబాద్‌ లో కాకుండా లక్నోలో మ్యాచ్ జరిగి ఉంటే టీమిండియా ఫైనల్‌ లో విజయం సాధించేదని సమాజ్‌ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. ఈ క్రమంలో తాజాగా మమతా బెనర్జీ తన వెర్షన్ వెల్లడించారు!