Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ : చెన్నైసూపర్ కింగ్స్ కెప్టెన్ గా మళ్లీ ఎంఎస్ ధోని.. ఏమైందంటే?

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) యాజమాన్యం అనూహ్య నిర్ణయం తీసుకుంది. గత సీజన్‌లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న మహేంద్ర సింగ్ ధోని తిరిగి జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు.

By:  Tupaki Desk   |   10 April 2025 10:51 PM IST
బ్రేకింగ్ : చెన్నైసూపర్ కింగ్స్ కెప్టెన్ గా మళ్లీ ఎంఎస్ ధోని.. ఏమైందంటే?
X

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) యాజమాన్యం అనూహ్య నిర్ణయం తీసుకుంది. గత సీజన్‌లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న మహేంద్ర సింగ్ ధోని తిరిగి జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. గత సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరించినప్పటికీ, ఈ సీజన్‌లో జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. కెప్టెన్ గా రుతురాజ్ కూడా దారుణంగా విఫలమయ్యారు. ఈ క్రమంలోనే గాయమైంది. గాయం కారణంగా రుతురాజ్ వైదొలిగాడా? లేక ఫాం లేమితో తప్పించారో తెలియదు కానీ సీఎస్కే యాజమాన్యం నేటి మ్యాచ్ నుంచి కెప్టెన్ గా మళ్లీ ధోనిని నియమించింది.

ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన చెన్నై జట్టు ఈసారి వరుస ఓటములతో అభిమానులను నిరాశపరిచింది. ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించిన తర్వాత, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమి చవిచూసింది. ఈ కష్ట సమయంలోనూ 43 ఏళ్ల ధోని తన అద్భుతమైన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా పంజాబ్‌పై 12 బంతుల్లో 27 పరుగులు (1 ఫోర్, 3 సిక్సర్లు), ఢిల్లీపై 26 బంతుల్లో 30 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచాడు.

ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇటీవల పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. దీని కారణంగా అతను రాబోయే మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, గైక్వాడ్ ఈ సీజన్ మొత్తానికి దూరంగా ఉంటాడని, అతని స్థానంలో మహేంద్ర సింగ్ ధోని తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని CSK యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.

"పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్‌కు గాయమైంది. అతను కోలుకోవడం కష్టంగా ఉంది. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా అతను పూర్తి స్థాయిలో ఆడలేకపోతున్నాడు. కాబట్టి ఈ సీజన్ ముగిసే వరకు అతన్ని పక్కన పెట్టాలని నిర్ణయించాం. అతని స్థానంలో ధోని తాత్కాలిక కెప్టెన్‌గా ఉంటాడు" అని యాజమాన్యం తెలిపింది.

గైక్వాడ్‌ను తప్పిస్తారనే వార్తలు గతంలో వచ్చినా యాజమాన్యం ఖండించింది. కానీ ఇప్పుడు ధోని కెప్టెన్ అని స్వయంగా క్లోచ్ ఫ్లెమింగ్ ప్రకటించాడు. ధోని తిరిగి కెప్టెన్ కావడంతో అభిమానులు ఆనందంతో మునిగి తేలుతున్నారు. ధోని నాయకత్వంలో చెన్నై జట్టు మళ్లీ విజయాల బాట పడుతుందని వారు ఆశిస్తున్నారు. ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి.