Begin typing your search above and press return to search.

లక్నో వర్సెస్ పంజాబ్... హెడ్ టు హెడ్ గణాంకాలివే!

ఈ క్రమంలో... ఈ సీజన్ లో ఇంకా బోణి చేయని లక్నో సూపర్ జెయింట్స్.. ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ షో చేయాలని చూస్తుంది.

By:  Tupaki Desk   |   30 March 2024 3:40 AM GMT
లక్నో వర్సెస్  పంజాబ్... హెడ్  టు హెడ్  గణాంకాలివే!
X

ఐపీఎల్ సీజన్ 17లో 11వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ – పంజాబ్ కింగ్స్ మధ్య మార్చి 30న జరగనుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి ఏకనా క్రికెట్ స్టేడియంంలో శిఖర్ ధావన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్. ఈ సీజన్ లో ఆడిన ఫస్ట్ మ్యాచ్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయిన లక్నో... సుమారు ఆరు రోజుల తర్వాత శనివారం పంజాబ్ తో తలపడనుంది.

రాహుల్ నేతృత్వంలోని లక్నో జట్టు.. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 20 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో... పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో... ఈ మ్యాచ్ లో ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాలని ఆ టీం లక్ష్యంగా పెట్టుకుంది. మరోపక్క తమ రెండో మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయిన తర్వాత తిరిగి పుంజుకోవాలని పంజాబ్ ప్లాన్ చేస్తుంది. శిఖర్ ధావన్ నేతృత్వంలోని ఈ జట్టు తన ఫస్ట్ మ్యాచ్ లో ఢిల్లీని ఓడించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో... ఈ సీజన్ లో ఇంకా బోణి చేయని లక్నో సూపర్ జెయింట్స్.. ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ షో చేయాలని చూస్తుంది. లాస్ట్ మ్యాచ్ లో కెప్టెన్ కేఎల్ రాహుల్ 44 బతుల్లో 58 పరుగులు చేసినా.. 194 పరుగుల లక్ష్యాన్ని ఛెదించలేని పరిస్థితి నెలకొంది. ఆ మ్యాచ్ లో నికోలస్ పూరన్ (64) రాణించినా మిగిలిన వారిలో మెజార్టీ బ్యాటర్స్ సింగిల్ డిజిట్ కే పరిమితమైపోయారు. ఇక బౌలింగ్ విభాగంలో కృనాల్ పాండ్యా మాత్రమే పొదుపుగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

మరోవైపు... తన ఫస్ట్ మ్యాచ్ లో శిఖర్ ధావన్ నేతృత్వంలోని పంజాబ్ జట్టు నాలుగు బంతులు ఉండగానే బోణి కొట్టింది. ఆ తర్వాత మ్యాచ్ లో ఆర్సీబీ చెతిలో ఓడిపోయింది.

హెడ్ టు హెడ్:

ఐపీఎల్ టోర్నమెంట్ లో ఈ రెండు జట్లూ ఇప్పటివరకూ 3 సార్లు తలపడ్డాయి. ఈ మూడు మ్యాచ్ లలోను లక్నో 2 సార్లు గెలవగా.. పంజాబ్ ఒకసారి విజయం సాధించింది. ఇందులో భాగంగా... 2022లో జరిగిన మ్యాచ్ లో 20 పరుగులతో, 2023లో జరిగిన మ్యాచ్ లో 56 పరుగులతో లక్నో గెలవగా.. అదే ఏడాది లక్నోపై పంజాబ్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఇక.. పంజాబ్ పై ఇప్పటివరకూ లక్నో అత్యధిక స్కోరు 257 కాగా.. లక్నోపై పంజాబ్ టాప్ స్కోరు 201.

పిచ్ రిపోర్ట్:

ఎకానా క్రికెట్ స్టేడియం బ్యాటర్లు స్వర్గదామం అని చెబుతున్నారు. ఈ పిచ్ బ్యాటర్లకు బాగా సహకరిస్తుందని.. ఇదే సమయంలో స్లో బౌలర్లకు కూడా కొంత సహాయాన్ని అందించవచ్చని చెబుతున్నారు. ఇదే క్రమంలో సీమర్స్ లైన్ మిస్సయితే.. బంతి మైదానాన్ని మిస్ అయ్యే అవకాశాలెక్కువని చెబుతున్నారు. ఐపీఎల్ 2024 కోసం ఈ స్టేడియంను ఉపయోగించడం ఇదే తొలిసారి!