Begin typing your search above and press return to search.

గుజరాత్ నడ్డివిరిచిన కృనాల్ పాండ్య... లక్నో సూపర్ విక్టరీ!

ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా... లక్నో - గుజరాత్ ల మధ్య బౌలర్ల హవాతో కూడిన రవత్తర మ్యాచ్ ఆసక్తికరంగా జరిగింది

By:  Tupaki Desk   |   8 April 2024 4:20 AM GMT
గుజరాత్ నడ్డివిరిచిన కృనాల్ పాండ్య... లక్నో సూపర్ విక్టరీ!
X

ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా... లక్నో - గుజరాత్ ల మధ్య బౌలర్ల హవాతో కూడిన రవత్తర మ్యాచ్ ఆసక్తికరంగా జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో.. తొలుత బ్యాటింగ్ చేసింది. బౌలర్లు ప్రతాపం చూపించిన ఈ మ్యాచ్ ఆద్యాంతం ఎలా జరిగిందనేది ఇప్పుడు చూద్దాం!

లక్నో బ్యాటింగ్ ప్రారంభం!:

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతో.. క్వింటన్‌ డికాక్‌, కేఎల్‌ రాహుల్‌ లు క్రీజ్ లోకి వచ్చారు. గుజరాత్‌ నుండి తొలి ఓవర్‌ ను ఉమేశ్‌ యాదవ్‌ వేశాడు. ఫట్ ఓవర్ రెండో బంతికే భారీ సిక్సర్‌ కొట్టి ఊపు మీదున్న క్వింటన్‌ డికాక్‌ (6)ను ఉమేశ్‌ ఔట్‌ చేశాడు. దీంతో... తొలి ఓవర్‌ పూర్తయ్యేసరికి లక్నో స్కోరు ఒక వికెట్ నష్టానికి 6 పరుగులు!

ఉమేశ్‌ కు మరో వికెట్‌!

ఇన్నింగ్స్ మూడో ఓవర్ లో ఉమేశ్‌ యాదవ్‌ మరో వికెట్‌ తీశాడు. తొలి బంతికి ఫోర్‌ కొట్టి ఊపు మీదున్న దేవ్‌ దత్‌ పడిక్కల్‌ (7)ను ఔట్‌ చేశాడు. దీంతో 3 ఓవర్లు ముగిసే సరికి లక్నో స్కోరు 2 వికెట్ల నష్టానికి 18 పరుగులకు చేరింది.

ఈ క్రమంలో నాలుగో ఓవర్‌ లో 13 పరుగులు.. ఐదో ఓవర్‌ లో 12 పరుగులు.. ఆరో ఓవర్ లో 4 పరుగులు రావడంతో.. పవర్ ప్లే పూఉర్తయ్యే సరికి లక్నో స్కోరు రెండు వికెట్ల నష్టానికి 47 పరుగులకు చేరింది. ఈ సమయంలో... స్టాయినిస్ (16), కేఎల్ రాహుల్ (14) పరుగులతో ఉన్నారు.

సగం ఓవర్లు పూరయ్యేసరికి పరిస్థితి ఇది!:

గుజరాత్‌ తో జరుగుతున్న మ్యాచ్‌ లో లక్నో బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. దీంతో.. 10 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు రెండు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది.

లక్నో మూడో వికెట్ డౌన్!:

దర్శన్ నల్కండే వేసిన 13 ఓవర్‌ లో నాలుగో బంతికి కేఎల్ రాహుల్ (33: 31 బంతుల్లో) ఔటయ్యాడు. దీంతో 13 ఓవర్లు పూరయ్యే సరికి లక్నో స్కోరు మూడు వికెట్ల నష్టానికి 93 పరుగులు!

లక్నో ఫోర్త్ వికెట్ డౌన్!:

దర్శన్ నల్కండే వేసిన 15 ఓవర్‌ లో తొలి బంతికి సిక్స్‌ బాది అర్ధ శతకం అందుకున్న స్టాయినిస్.. నాలుగో బంతికి కూడా సిక్స్ బాదాడు. ఈ క్రమంలో తర్వాత బంతికి ఔటయ్యాడు. దీంతో... 15 ఓవర్లు పూర్తయ్యే సరికి 4 వికెట్ల నష్టానికి 114 పరుగులకు చేరింది.

లక్నో ఫిఫ్త్ వికెట్ డౌన్!:

లక్నో ఐదో వికెట్ కోల్పోయింది. రషీద్‌ ఖాన్ వేసిన 19 ఓవర్‌లో తొలి బంతికి ఆయుష్ బదోని (20) పెవిలియన్ చేరాడు. దీంతో 19 ఓవర్లు పూరయ్యే సరికి లక్నో స్కోరు 5 వికెట్ల నష్టానికి 155కు చేరుకుంది.

గుజరాత్ టార్గెట్ 164!:

గుజరాత్‌ తో జరుగుతున్న మ్యాచ్‌ లో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్స్ లో స్టాయినిస్ (58) అర్ధ శతకం బాదగా.. నికోలస్ పూరన్ (32*), కేఎల్ రాహుల్ (33) రాణించారు!

బ్యాటింగ్‌ ప్రారంభించిన గుజరాత్‌!:

164 పరుగుల లక్ష్య ఛేదకు గుజరాత్‌ సిద్ధమైంది. సుదర్శన్‌, శుభ్ మన్ గిల్‌ క్రీజులోకి వచ్చారు. సిద్ధార్థ్‌ వేసిన ఈ ఓవర్ లో 5 పరుగులు వచ్చాయి. అనంతరం... నవీనుల్‌ హక్‌ వేసిన రెండో ఓవర్ లో 13 పరుగులు, సిద్ధార్థ్‌ వేసిన మూడో ఓవర్ లో 4 పరుగులు, మయాంక్‌ వేసిన నాలుగో ఓవర్లో 13 పరుగులు, సిద్ధార్థ్‌ వేసిన ఐదో ఓవర్ లో 12 పరుగులు వచ్చాయి!

శుభ్‌ మన్‌ గిల్ క్లీన్‌ బౌల్డ్!:

యశ్‌ ఠాకూర్‌ వేసిన ఆరో ఓవర్‌ లో చివరి బంతికి శుభ్‌ మన్‌ గిల్ (19) క్లీన్‌ బౌల్డ్ అయ్యాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి లక్నో స్కోరు ఒక వికెట్ నష్టానికి 54 పరుగులకు చేరింది.

గుజరాత్ ఒకే ఓవర్ లో రెండు వికెట్లు డౌన్!:

లక్నో స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ వేసిన 7.2 ఓవర్‌ లో కేన్ విలియమ్సన్ (1) రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చాడు. ఈ సమయంలో బిష్ణోయ్ అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో గుజరాత్ రెండు వికెట్లు కోల్పోయింది.

అనంతరం.. కృనాల్ పాండ్య వేసిన 8.1 ఓవర్ లో సాయి సుదర్శన్‌ (31) ఔటయ్యాడు. ఇదే ఓవర్ లో ఐదో బంతికి బిఆర్‌ శరత్ (2) కూడా ఔటయ్యాడు. దీంతో గుజరాత్ స్కోరు 9 ఓవర్లు పూరయ్యే సరికి 4 వికెట్ల నష్టానికి 61 పరుగులకు చేరింది.

సగం ఓవర్లు పూర్తయ్యే సరికి పరిస్థితి ఇది!:

164 పరుగుల లక్ష్యఛేదనలో గుజరాత్ తడబడుతోంది. ఈ సమయంలో 10 ఓవర్లు ముగిసేసరికి నాలుగు కీలకమైన వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. ప్రస్తుతం దర్శన్‌ నల్కండే (2), విజయ్‌ శంకర్ (5) క్రీజులో ఉన్నారు.

ఐదో వికెట్ కోల్పోయిన గుజరాత్!:

గుజరాత్ ఐదో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్య వేసిన 13 ఓవర్‌ లో తొలి బంతికి దర్శన్‌ నల్కండే (12) ఔటయ్యాడు. దీంతో... నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 11 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు కృనాల్ పాండ్య! దీంతో గుజరాత్ స్కోరు 13 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 82కు చేరింది.

కష్టాల్లో గుజరాత్... వరుసగా మూడు వికెట్లు డౌన్!

యశ్ ఠాకూర్‌ వేసిన 14.2 ఓవర్‌ లో విజయ్ శంకర్ (17) ఔటయ్యాడు. అదే ఓవర్ ఐదో బంతికి రషీద్‌ ఖాన్ (0) దీపక్‌ హుడాకు క్యాచ్‌ ఇచ్చాడు. అనంతరం.. నవీనుల్ హక్ వేసిన 16 ఓవర్‌ లో చివరి బంతికి ఉమేశ్‌ యాదవ్ (2) పెవిలియన్ కు చేరాడు. దీంతో 16 ఓవర్లు పూర్తయ్యే సరికి గుజరాత్ 8 వికెట్లు నష్టపోయి 102 పరుగులు చేసింది.

గుజరాత్ ఆలౌట్!:

యశ్ ఠాకూర్‌ వేసిన 19 ఓవర్‌ లో రెండో బంతికి సిక్స్ బాదిన రాహుల్ తెవాటియా (30) తర్వాతి బంతికే ఔటయ్యాడు. అదే ఓవర్ లో ఐదో బంతికి నూర్ అహ్మద్ ఔటయ్యాడు. ఇలా లక్ష్యఛేదనలో గుజరాత్ 130 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ బ్యాటర్స్ లో ఓపెనర్ సాయి సుదర్శన్‌ (31), రాహుల్ తెవాటియా (30) పరుగులు చేశారు. దీంతో 33 పరుగుల తేడాతో లక్నో ఘన విజయం సాధించింది.