Begin typing your search above and press return to search.

సూర్యకుమార్ ని ప్రైజ్ చేసిన లేడీ ఫ్యాన్... నాట్ ఏ బ్యాడ్ యాక్టర్!

అవును... ఫుల్ హ్యాండ్స్ షర్ట్ ధరించి, మాస్క్ పెట్టుకుని, తలపై హ్యాట్ పెట్టుకుని, కళ్లకు అద్దాలు కూడా పెట్టుకుని తోటి క్రీడాకారులతో పాటు.. జనాలను ఆశ్చర్యానికి ముంచెత్తాడు.

By:  Tupaki Desk   |   1 Nov 2023 6:54 AM GMT
సూర్యకుమార్  ని ప్రైజ్  చేసిన లేడీ ఫ్యాన్... నాట్  ఏ బ్యాడ్  యాక్టర్!
X

ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ వరల్డ్ కప్ పై భారత అభిమానుల్లో ఉత్కంఠ వేగంగా పెరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో ఆడిన ఆరు మ్యచ్ లలోనూ భారత్ వరుసగా విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో నిలిచింది. అభిమానుల అంచనాలను ఎక్కడా తలకిందులు చేయకుండా ముందుకు సాగుతుంది. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా టీం ఇండియా టాప్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్.. తన గుర్తింపును దాచిపెట్టీ జనాల్లోకి వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

అవును... ఫుల్ హ్యాండ్స్ షర్ట్ ధరించి, మాస్క్ పెట్టుకుని, తలపై హ్యాట్ పెట్టుకుని, కళ్లకు అద్దాలు కూడా పెట్టుకుని తోటి క్రీడాకారులతో పాటు.. జనాలను ఆశ్చర్యానికి ముంచెత్తాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.

ఈ వీడియోలో తొలుత తన గది నుండి బయటకు వస్తాడు సూర్య కుమార్. ఈ సమయంలో అతడిని రవీంద్ర జడేజా కూడా గుర్తించలేకపోయాడు. దీని తర్వాత సూర్య తాను బయటకు వెళ్తున్నానని వారికి చెప్పాడు. ఇలా వెళ్తే ఎవరూ గుర్తించలేరని జడేజా అన్నాడు. అనంతరం చేతిలో కెమెరా పట్టుకుని ప్రొఫెషన్ కెమెరామేన్ తరహాలో సూర్య కారులో బయలుదేరాడు.

ఈ క్రమంలో... ముందుగా సూర్య జనాల మధ్యకు వెళ్లి క్రికెట్ గురించి మాట్లాడాడు. ఇందులో భాగంగా ఒక అభిమానిని ఇంటర్వ్యూ చేశాడూ. భారత బ్యాట్స్‌ మెన్ గురించి ప్రశ్నలు అడిగాడు. దీనిపై అభిమాని మాట్లాడుతూ భారత్‌ లోని మొదటి ముగ్గురు బ్యాట్స్‌ మెన్‌ లకు మాత్రమే ఎలా ఆడాలో తెలుసని తెలిపాడు!

ఈ సమయంలో లోకల్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, శార్ధూల్ ఠాకూర్ ల గురించి ప్రశ్నించాడు. ఈ సమయంలో ఆ అభిమాని రోహిత్ పేరు చెప్పాడు. అనంతరం మరో మహిళ మాట్లాడుతూ... టీం ఇండియాలో ఉన్న ప్రతీ ప్లేయర్ ఇప్పుడు చాలా బాగా ఆడుతున్నారని తెలిపారు. దీని తర్వాత సూర్య కుమార్ యాదవ్ ఎలాంటి ఆటగాడు అని అడిగిన దానికి... అభిమాని కోచ్ సహాయంతో మరింత బ్యాటింగ్ నేర్చుకోవాలని అన్నాడు.

ఈ సమయంలో ఒక అభిమాని సూర్య కుమార్ ని చాలా పొగిడాడు. అతన్ని 360 డిగ్రీ ప్లేయర్ అని అభివర్ణిస్తూ... గ్రౌండ్ నలువైపులా షాట్స్ ఆడతాడని తెలిపింది. రేపు వాంఖడే స్టేడియంలో అతను ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేసింది. దీంతో సూర్య కుమార్ ఇంటర్వ్యూ ముగించాడు.

అనంతరం... థాంక్యూ సో మచ్ అని చెబుతూ.. నైస్ మీటింగ్ యూ అని ఆమెకు షేక్ హ్యాండ్ ఇస్తాడు. అనంతరం తనను తాను సూర్య కుమార్ యాదవ్ గా పరిచయం చేసుకుంటాడు. ఆ తర్వాత మాస్క్ తీస్తాడు. దీంతో ఆ అభిమాని సంబరాల్లో ఉండగా.. ఆమెతో ఫోటొలకు ఫోజులిచ్చాడు. అనంతరం... తాను చెడ్డ నటుడిని కాదని చెబుతాడు సూర్య. ఇలా సాగిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

కాగా... నవంబర్ 2 - గురువారం వాంఖడే స్టేడియంలో భారత్ - శ్రీలంక తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కు ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా అందుబాటులో ఉంటే... సూర్య కుమార్ కి చోటు దక్కుతుందా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. పాండ్యా వచ్చినా శ్రేయాస్ అయ్యర్ స్థానంలో సూర్యకు ఛాన్స్ ఇస్తారా అనే చర్చ కూడా ఫ్యాన్స్ మధ్య నడుస్తుంది.