Begin typing your search above and press return to search.

ఐపీఎల్ లో మళ్లీ చెంప చెల్లు.. ఇద్దరు యూపీ కుర్రాళ్ల లొల్లి.. వేటు తప్పదా?

ఇంతకూ పేసర్ శ్రీశాంత్ ను హర్భజన్ ఎందుకు కొట్టాడో? లీగ్ 12వ రోజున ముంబై ఇండియన్స్ సభ్యుడిగా ఉన్న హర్భజన్ ను శ్రీశాంత్ బ్యాడ్ లక్ ఫెలో అంటూ దూషించాడు.

By:  Tupaki Desk   |   30 April 2025 11:00 AM
Kuldeep Yadav Slaps Rinku Singh
X

2008.. అది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొలి ఏడాది.. ఎంతో అట్టహాసంగా మొదలైన లీగ్ లో తీవ్ర కలకలం.. మైదానంలో అది కూడా ఇద్దరు టీమ్ ఇండియా ఆటగాళ్ల మధ్యన కావడంతో ప్రపంచ క్రికెట్ లోనూ సంచలనంగా మారింది.. దీనికి ’స్లాప్ గేట్’ అనే పేరు వచ్చింది.

ఇంతకూ పేసర్ శ్రీశాంత్ ను హర్భజన్ ఎందుకు కొట్టాడో? లీగ్ 12వ రోజున ముంబై ఇండియన్స్ సభ్యుడిగా ఉన్న హర్భజన్ ను శ్రీశాంత్ బ్యాడ్ లక్ ఫెలో అంటూ దూషించాడు. ఆ మ్యాచ్ లో శ్రీశాంత్ జట్టు పంజాబ్ కింగ్స్ నెగ్గింది. అసలే ఓటమి బాధలో ఉన్న భజ్జీని శ్రీశాంత్ మాటలు తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. దీంతో మైదానంలోనే లాగి పెట్టి కొట్టాడు. ఆ తర్వాత శ్రీశాంత్ అక్కడే ఏడ్చాడు. అప్పట్లో భజ్జీపై సీజన్ మొత్తం నిషేధం విధించారు. బీసీసీఐ కూడా ఐదు వన్డేల నుంచి తప్పించింది.

సరిగ్గా 17 ఏళ్ల తర్వాత మళ్లీ స్లాప్ గేట్ తరహా ఘటన చోటుచేసుకుంది. మంగళవారం కోల్ కతా నైట్ రైడర్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ అనంతరం ఢిల్లీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్ ను చెంప మీద కొట్టాడు. అది కూడా రెండుసార్లు కావడం గమనార్హం. ఇదంతా టీవీలో రికార్డు కావడం గమనార్హం. సోషల్ మీడియాలో కూడా వైరల్‌ అయ్యాయి.

వాస్తవానికి మ్యాచ్ అనంతరం కుల్దీప్, రింకూ ఇద్దరూ ఉల్లాసంగానే కనిపించారు. అంతలోనే కుల్దీప్ సీరియస్ అయ్యాడు. దీంతో అతడిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పటిదాకా నవ్వుతూ ఉన్న కుల్దీప్.. తన చెంపపై కొట్టేసరికి ఏం జరిగిందో తెలియక రింకూ ఆశ్చర్యానికి గురయ్యాడు. తొలిసారి సరదాగానే తీసుకున్నా.. మళ్లీ చెంపమీద కొట్టడంతో ముఖం మాడ్చేశాడు.

ఇంతకూ కుల్దీప్ ఎందుకిలా చేశాడో తెలియరాలేదు.

వేటు తప్పదా..?

కుల్దీప్, రింకూ ఇద్దరూ ఉత్తరప్రదేశ్ కు చెందినవారే. టీమ్ ఇండియాకు ఆడుతున్నవారే. అలాంటివారి మధ్య వివాదం ఏమిటి? ఎందుకు అన్నది బయటకు తెలియాల్సి ఉంది. మరి 2008లో భజ్జీ

తరహాలోనే కుల్దీప్ పైనా చర్యలు ఉంటాయా? అన్నది చూడాలి.