Begin typing your search above and press return to search.

కోట్ల రూపాయలు తీసుకోవడం లేదు : కోహ్లీ

ట్విట్టర్ ద్వారా విరాట్ కోహ్లీ తన సంపాదన గురించి వస్తున్న పుకార్లపై స్పందించాడు.

By:  Tupaki Desk   |   12 Aug 2023 10:38 AM GMT
కోట్ల రూపాయలు తీసుకోవడం లేదు : కోహ్లీ
X

టీం ఇండియా స్టా క్రికెటర్‌ కి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు అనడంలో సందేహం లేదు. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏపాటిదో ఆయన సోషల్‌ మీడియాలోని ఫాలోవర్స్ ని చూస్తే అర్థం అవుతుంది. ఇన్ స్టాగ్రామ్ లో మరే క్రికెటర్ కి గాని ఇతర ఆటగాళ్లకు లేనంతగా ఏకంగా 256 మిలియన్ ల ఫాలోవర్స్ ఇన్‌ స్టాగ్రామ్‌ లో ఉన్న విషయం తెల్సిందే.

ఇన్‌ స్టాగ్రామ్‌ లో చాలా మంది సెలబ్రెటీలు ఒక మిలియన్ లేదా రెండు మిలియన్‌ ల ఫాలోవర్స్ ఉంటేనే భారీ ఎత్తున సంపాదిస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సమయంలో 256 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న విరాట్ కోహ్లీ సోషల్ మీడియా ద్వారా ఏ స్థాయిలో సంపాదిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.

తాజాగా ఈ విషయమై ఒక ప్రముఖ మీడియా సంస్థ తన కథనంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇన్‌ స్టాగ్రామ్‌ లో ఒక్క పోస్ట్‌ పెట్టినందుకు గాను కోహ్లీ ఏకంగా రూ.11.45 కోట్లు పారితోషికం గా అందుకుంటున్నట్లుగా ఆ కథనంలో పేర్కొనడం జరిగింది.

బాబోయ్‌ ఒక్క పోస్ట్‌ కే అంతగా కోహ్లీ సంపాదిస్తున్నాడా అంటూ అంతా కూడా నోరు వెళ్లబెడుతున్నారు. ప్రతి ఏడాది కూడా ఈ పోస్ట్‌ లతోనే వేల కోట్ల రూపాయలను విరాట్‌ కోహ్లీ సంపాదిస్తున్నాడా అంటూ అంతా కూడా షాక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీ స్పందించాడు.

ట్విట్టర్ ద్వారా విరాట్ కోహ్లీ తన సంపాదన గురించి వస్తున్న పుకార్లపై స్పందించాడు. జీవితంలో ఇప్పటి వరకు తాను సంపాదించిన ప్రతి రూపాయికి కృతజ్ఞుడిని. అయితే ప్రస్తుతం తన సోషల్‌ మీడియా ఆదాయం గురించి మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదు. నా సంపాదన విషయంలో మీడియాలో వస్తున్న కథనాలు అన్నీ అవాస్తవం అంటూ ట్వీట్‌ చేశాడు.

ఒక్కో ఇన్‌ స్టా పోస్ట్‌ కు రూ.11.45 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడు అంటూ వచ్చిన వార్తలు నిజం కాదు అన్నాడు కానీ.. తాను ఇంతకు ఎంత వరకు తీసుకుంటున్నాడు అనే విషయాన్ని మాత్రం వెళ్లడించలేదు అంటూ కొందరు కోహ్లీ ఫాలోవర్స్ పెదవి విరుస్తున్నారు.