Begin typing your search above and press return to search.

ఒకే ఒక్కడు... టీ20 క్రికెట్ లో కొహ్లీ సరికొత్త రికార్డ్!

ఇందులో భాగంగా... టీ20లో అత్యధిక పరుగులు సాధించిన ఏకైక భారతీయుడిగా రికార్డ్ సృష్టించాడు.

By:  Tupaki Desk   |   22 March 2024 5:20 PM GMT
ఒకే ఒక్కడు... టీ20 క్రికెట్  లో కొహ్లీ సరికొత్త రికార్డ్!
X

అంగరంగ వైభవంగా ఐపీఎల్ 17వ సీజన్ స్టార్ట్ అయ్యింది. ఇందులో భాగంగా తొలిమ్యాచ్ చెన్నై, బెంగళూరు మధ్య మొదలైంది. ఈ సమయంలో భారత క్రికెట్ దిగ్గజం, స్టార్ బ్యాటర్, కింగ్ కొహ్లీ మరో మైలురాయిని అధిగమించాడు. ఇందులో భాగంగా... టీ20లో అత్యధిక పరుగులు సాధించిన ఏకైక భారతీయుడిగా రికార్డ్ సృష్టించాడు.

అవును... క్రికెట్ లో బ్యాటింగ్ పరంగా ఏ రికార్డ్ తీసుకున్నా అందులో కచ్చితంగా విరాట్ కొహ్లీ పేరు ఉంటుందని చెప్పినా అతిశయోక్తి కాదు. టీం ఇండియా స్టార్ బ్యాటర్లలో ఒకడిగానే కాకుండా.. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనూ తనకంటూ ఒక సుస్థిరమైన పేజీని సంపాదించుకున్నాడు కోహ్లీ. ఈ క్రమంలో తాజాగా టీ20 ఫార్మెట్ లో 12,000 పరుగుల క్లబ్ లో చేరాడు.

ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కొహ్లీ ఈ ఫీట్ ని సాధించాడు. తద్వారా టీ20 క్రికెట్ లో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్ గా నిలిచాడు. ఈ ఫీట్ సాధించడానికి కొహ్లీ 377 ఇన్నింగ్స్ లు తీసుకున్నాడు. ఐపీఎల్ 17వ సీజ‌న్ ఆరంభ మ్యాచ్ కు ముందు కోహ్లీ ఖాతాలో 11,994 ప‌రుగులు ఉన్నాయి.

ఇదే సమయంలో ఈ 12 వేల పరుగుల్లోనూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కోసం 7693 పరుగులు చేయగా... టీం ఇండియా కోసం 4,037 పరుగులు చేయడం గమనార్హం. ఇదే సమయంలో సీఎస్కే పై 1000 కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో బ్యాటర్ గానూ నిలిచాడు. ఈ ఫీట్ సాధించడానికి కొహ్లీ 32 మ్యాచ్ లు తీసుకున్నాడు కొహ్లీ!

టీ20 క్రికెట్ లో 12వేల పరుగులు చేసిన ప్లేయ‌ర్స్ లిస్ట్:

క్రిస్ గేల్ - 14,562

షోయబ్ మాలిక్ - 13,360

కిరన్ పోలార్డ్ - 12,900

అలెక్స్ హేల్స్ - 12,319

డేవిడ్ వార్నర్ - 12,065

విరాట్ కొహ్లీ - 12,015