గ్రేడ్ డౌన్..కోహ్లి, రోహిత్ కు బీసీసీఐ షాక్! ప్రపంచకప్ కు కష్టమే
ఏ ప్లస్ లోని ముగ్గురికీ రూ.7 కోట్లు వస్తాయి. ఏ గ్రేడ్ లో ఉంటే రూ.5 కోట్లు, సి గ్రేడ్ లోని వారికి రూ.కోటి ఇస్తారు. ఏ ప్లస్ కేటగిరీ ఇకమీదట తీసివేస్తారని సమాచారం వస్తోంది.
By: Tupaki Political Desk | 7 Feb 2026 1:23 PM ISTటీమ్ఇండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) షాక్ ఇచ్చింది. 2024లో టి20 ప్రపంచ కప్ విజయం అనంతరం టి20లకు, గత ఏడాది టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు స్టార్లు కేవలం వన్డేలలో మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే. రాబోయే 2027 వన్డే ప్రపంచ కప్ కచ్చితంగా ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్న వీరిద్దరికీ చేదు వార్త. ఇటీవలే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ లపై వన్డేల్లో రాణించిన కోహ్లి, రోహిత్ లను గ్రేడ్ ల పరంగా డిమోట్ చేసింది. అది కూడా ఏ ప్లస్ నుంచి బి గ్రేడ్ కు దించింది. బహుశా.. వారిని ప్రపంచ కప్ లో ఆడించే ఉద్దేశం లేదేమోనని తెలుస్తోంది.
ఆడేది ఒక ఫార్మాటే కదా..?
ఏ ప్లస్, ఏ, బి, సి.. ఇవీ ఆటగాళ్లకు బీసీసీఐ కేటాయించే గ్రేడ్లు. టి20, వన్డే, టెస్టులు ఈ మూడు ఫార్మాట్లు ఆడేవారిని మాత్రమే ఏ ప్లస్ లో ఉంచుతుంది. ఆ తర్వాత స్థాయిని బట్టి మిగతా గ్రేడ్ లు ఇస్తుంది. కోహ్లి, రోహిత్ ను తప్పించడంతో తాజాగా 2025-26 సంవత్సరానికి ప్రకటించిన గ్రేడ్ లలో ఏ ప్లస్ ను తీసిశేరారు. టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్ మన్ గిల్, మేటి పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలతో ఏ గ్రేడ్ ను మాత్రమే ఉంచారు. ఇక టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బి కేటగిరీలో ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఏ ప్లస్ లో రూ.7 కోట్ల వేతనం
వన్డేలు మాత్రమే ఆడుతున్న రోహిత్, కోహ్లిలను రూ.3 కోట్లు మాత్రమే దక్కనున్నాయి. ఏ ప్లస్ లోని ముగ్గురికీ రూ.7 కోట్లు వస్తాయి. ఏ గ్రేడ్ లో ఉంటే రూ.5 కోట్లు, సి గ్రేడ్ లోని వారికి రూ.కోటి ఇస్తారు. ఏ ప్లస్ కేటగిరీ ఇకమీదట తీసివేస్తారని సమాచారం వస్తోంది. ఎందుకంటే.. ఏ ఆటగాడూ మూడు ఫార్మాట్లలో రెగ్యులర్ గా లేకపోవడమే.
ఇక గ్రేడ్ ల విషయానికి వస్తే.. బిలో సుందర్, రాహుల్, పాండ్యా, సిరాజ్, పంత్, కుల్దీప్, జైశ్వాల్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు.
వీరికి బోనస్..
టీమ్ఇండియాలో రెగ్యులర్ సభ్యులు కానప్పటికీ... సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్ లను సి గ్రేడ్ లో ఉంచారు. వీరితో పాటు అక్షర్ పటేల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబె, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, రవి బిష్ణోయ్ లకు సి లో చోటు దక్కింది.
