జోష్ హేజిల్ వుడ్ ది గోల్డెన్ లెగ్
క్రికెట్..ఈ జెంటిల్మెన్ గేమ్ గెలవాలంటే హార్డ్ వర్క్ తో పాటు కాస్త లక్ కూడా కావాలి.
By: Tupaki Desk | 4 Jun 2025 6:46 PM ISTక్రికెట్..ఈ జెంటిల్మెన్ గేమ్ గెలవాలంటే హార్డ్ వర్క్ తో పాటు కాస్త లక్ కూడా కావాలి. ఐపీఎల్-2025 ఫైనల్ మ్యాచ్ లో ఆ లక్ ఆర్సీబీ తరఫున మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్ లో ఆర్సీబీకీ హార్డ్ వర్క్ తో పాటు జోష్ హేజిల్ వుడ్ అనే లక్ తోడైంది. అవును, జోష్ ఆడితే జట్టులో ఫుల్ జోష్ తో పాటు లక్ కూడా ఉంటుంది. ఒకటి కాదు రెండు కాదు..దాదాపుగా జోష్ ది లక్కీ లెగ్ అని ఆరు సార్లు ప్రూవ్ అయింది. ఓ జట్టు తరఫున జోష్ ఫైనల్ ఆడిన అన్ని సార్లు ఆ జట్టు విజేతగా నిలిచింది.
బిగ్ బాష్ మొదలు వరల్డ్ కప్ వరకు..ఇప్పుడు తాజాగా ఐపీఎల్ వరకు...జోష్ హేజిల్ వుడ్ ది గోల్డెన్ లెగ్. 2010లో ఆసీస్ తరఫున అండర్ 19 వరల్డ్ కప్, 2012లో సిడ్నీ సిక్సర్స్ తరఫున సీఎల్ టీ20, 2015లో ఆసీస్ తరఫున వన్డే ప్రపంచ కప్, 2020లో సిడ్నీ సిక్సర్స్ తరపున బిగ్ బాష్ లీగ్ ఫైనల్, 2021లో సీఎస్కే తరఫున ఐపీఎల్ ఫైనల్, 2021లో ఆసీస్ తరఫున టీ20 వరల్డ్ కప్, 2023లో ఆసీస్ తరఫున వన్డే వరల్డ్ కప్, 2025లో ఆర్సీబీ తరఫున ఐపీఎల్ ఫైనల్ లో జోష్ హేజిల్ వుడ్ ఆడి తన జట్టుకు కప్ అందించాడు.
దీంతో, జోష్ ది లక్కీ లెగ్ , గోల్డెన్ లెగ్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వచ్చే ఐపీఎల్ ఆక్షన్ లో అత్యధిక ధర పలికే ఆటగాడు కచ్చితంగా జోష్ హేజిల్ వుడ్ అని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఇక, ఆర్సీబీ అతడిని అత్యధిక ధర ఇచ్చైనా సరే రిటెయిన్ చేసకుంటుందని, అస్సలు వదులుకోదని అంటున్నారు.
