Begin typing your search above and press return to search.

ఆ విషయంలో స్పష్టత ఉంది... జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు!

ఇందులో భాగంగా ప్రధానంగా రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ ఫెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందనే ప్రశంసలు పొందుతుంది.

By:  Tupaki Desk   |   6 Nov 2023 7:24 AM GMT
ఆ విషయంలో స్పష్టత ఉంది... జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు!
X

ఈ వన్డే ప్రపంచకప్‌ లో టీం ఇండియా అన్ని విభాగాల్లోనూ అత్యంత స్ట్రాంగ్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అటు బలమైన బ్యాంటింగ్ ఆర్డర్, బుల్లెట్ లాంతి బంతులు వేసే సీం త్రయం, మాయచేస్తున్న స్పిన్ ద్వయం వెరసి బ్యాంటింగ్, బౌలింగ్ విభాగాల్లో అన్ని టీం ల మీదా పూర్తి పట్టు సాధిస్తుంది. ఈ సమయంలో ఫీల్డింగ్ విభాంగంలో కూడా టీం ఇండియా ప్లేయర్లు తగ్గడం లేదు. ఇందులో భాగంగా ప్రధానంగా రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ ఫెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందనే ప్రశంసలు పొందుతుంది.

అవును... 2011 వరల్డ్ కప్ లో నాటి ఆల్‌ రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ నిర్వర్తించిన బాధ్యతలను ఈ ప్రపంచకప్‌ లో రవీంద్ర జడేజా నిర్వర్తిస్తున్నాడు. అవకాశం వచ్చినప్పుడు, అవసరమైనప్పుడు కచ్చితంగా పరుగులు చేస్తున్నాడు.. ఆఫ్ స్పిన్ మాయాజాలతో వికెట్స్ తీస్తున్నాడు. ఇదే సమయంలో ఫీల్డింగ్‌ లోనూ తనదైన విన్యాసాలతో పరుగులను అడ్డుకొంటూ, కళ్లు చెదిరే క్యాచ్ లు పడుతూ.. సరైన ఆల్‌ రౌండర్‌ అనిపించుకుంటున్నాడు.

ఈ క్రమంలో తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో బాల్ తో మరోసారి మెరిశాడు జడేజా. ఇందులో భాగంగా.. ఏకంగా 5 వికెట్స్ పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో... ఇప్పటివరకు ఈ ప్రపంచకప్‌ లో 110 పరుగులు, 14 వికెట్లు తీసినట్లయ్యింది. వీటికి తోడు మెరుపు ఫీల్డింగ్ ఉండనే ఉంది. ఈ క్రమంలో... మ్యాచ్‌ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌ లో రవీంద్ర జడేజా మాట్లాడాడు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఇందులో భాగంగా... ఫస్ట్ నుంచీ తాను కెప్టెన్‌ గానే ఆలోచిస్తా అంటూ మొదలుపెట్టిన జడేజా... ఆల్‌ రౌండర్‌ గా తన పాత్ర ఏంటో తనకు తెలుసని అన్నాడు. ఈ క్రమంలో జట్టుకు అవసరమైనప్పుడు 30-35 పరుగులు చేయడం.. కీలక సమయంలో వికెట్ తీసి బ్రేక్‌ ఇవ్వడం తన బాధ్యత అని అన్నాడు. ఇక మ్యాచ్‌ పై తన ప్రదర్శనతో ప్రభావం చూపించడానికే నిత్యం ప్రయత్నిస్తా అని జడేజా స్పష్టం చేశాడు.

ఇదే క్రమంలో... ఫీల్డింగ్‌ లో తానే గొప్ప అని భావించను అని చెప్పిన జడేజా.. క్యాచ్‌ ను కూడా మిస్‌ చేసినట్లు గుర్తుచేశాడు. అయితే, ఎప్పటికప్పుడు సన్నద్ధమవుతూనే ఉంటాఅని.. ఒక క్యాచ్‌ పట్టగానే.. మైదానంలో రిలాక్స్‌ అయిపోనని.. మెరుగ్గా ఫీల్డింగ్ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా అని తెలిపాడు. అదేవిధంగా... ఆరంభంలోనే పేసర్లు వికెట్లను తీస్తే.. స్పిన్నర్ల పని మరింత సులువవుతుందని, తాజా మ్యాచ్ లో అదే జరిగిందని అన్నాడు.

కాగా... తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో జడేజా బెస్ట్ ఫెర్మార్మెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సఫారీ జట్టును 83 పరుగులకే ఆలౌట్ చేయడంలో రవీంద్ర జడేజా (5/33) కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే మ్యాచ్‌ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌ లో.. ఆల్‌ రౌండర్‌ గా తన పాత్ర ఏంటనే దానిపై పూర్తి స్పష్టతతో ఉన్నట్లు తెలిపాడు.