వీడియో : బాల్ ఇవ్వకుండా జడేజాకి కోపం తెప్పించిన ఫ్యాన్స్
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఐపీఎల్ ఫీవర్‌తో ఊగి పోతున్నారు. సాయంత్రం అయితే చాలు అంతా కూడా టీవీలకు అతుక్కుపోతున్నారు.
By: Ramesh Palla | 23 April 2026 4:37 PM ISTప్రస్తుతం దేశ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఐపీఎల్ ఫీవర్‌తో ఊగి పోతున్నారు. సాయంత్రం అయితే చాలు అంతా కూడా టీవీలకు అతుక్కుపోతున్నారు. ఇంకా క్రికెట్‌ను ఎక్కువ అభిమానించే వారు స్టేడియంకు క్యూ కడుతున్నారు. ఏ రెండు జట్లు మ్యాచ్ ఆడినా కూడా స్టేడియం కిక్కిరిసి పోతుంది. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లు అన్నింటికి కూడా భారీ ఎత్తున జనాలు పోటెత్తారు. ముఖ్యంగా ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌కి జనాలు విపరీతంగా వచ్చారు. చాలా వరకు జనాలు టికెట్లు లేక వెనక్కి వెళ్లినట్లు స్థానిక మీడియా తమ కథనాల్లో పేర్కొంది. ప్రతి మ్యాచ్‌ను లైవ్ లో ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో జనాలు హాజరు అవుతున్నారు. అభిమానుల కేరింతల నడుమ ఆటగాళ్లు మ్యాచ్ ఆడుతున్నారు.
ఐపీఎల్ మ్యాచ్ లో అంతరాయం...
ఆ అభిమానుల కేరింతలు, వారు చేసే పనులు కొన్ని సార్లు ఆటకు ఇబ్బంది కలిగిస్తాయి. ఆటగాళ్లకు ఇబ్బందులు తెచ్చి పెడుతాయి అనే విషయం గతంలో పలు సార్లు నిరూపితం అయ్యింది. తాజాగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌ను చూసేందుకు ఎప్పటిలాగే పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు హాజరు అయ్యారు. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 159 పరుగులు చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ టార్గెట్‌ను చేరుకోలేక పోయింది. ఈ మ్యాచ్ గురించి మీడియాలో ఎన్నో కథనాలు వచ్చాయి. కానీ ఒక వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లక్నో ఆటగాడు కొట్టిన ఒక సిక్స్ కారణంగా బాల్ జనాల్లో పడింది. ఆ బాల్‌ను పట్టుకునేందుకు ప్రేక్షకుల్లో కొందరు ఎగబడ్డారు.
సిక్స్ కొట్టడంతో జనాల్లో బాల్...
సాధారణంగానే జనాల్లోకి బాల్ వెళ్తే దాన్ని పట్టుకునేందు ఎగబడుతారు. దాన్ని తానే దక్కించుకుని తిరిగి ఇవ్వాలని కోరుకుంటారు. అయితే జనాల్లో పడ్డ బాల్‌ను టచ్ చేసేందుకు అంతా ప్రయత్నిస్తారు. అలా జనాల్లోకి వెళ్తే బాల్ కొన్ని సెకన్ల పాటు ఆట ఆగాల్సి ఉంటుంది. తాజా మ్యాచ్ లో లక్నో బ్యాట్స్‌మన్ కొట్టిన సిక్స్ తో జనాల్లో బంతి పడటం, దాన్ని వారు పట్టుకునేందుకు కుస్తీలు పడటం ఒక వ్యక్తి వీడియో తీశాడు. ఆ బంతిని వాళ్లు ఇవ్వకుండా దాచాలి అనుకున్నట్లుగా కూడా ఆ వీడియోలో అనిపించింది. అభిమానులు బంతి కోసం కొట్టుకోవడం, వాళ్లు బంతిని ఇవ్వకుండా ఉంచే ప్రయత్నంను రాజస్థాన్ ఆటగాడు జడేజా చూస్తూ వచ్చాడు. అతడిని వీడియోలో చాలా సీరియస్‌గా చూస్తున్నట్లు గమనించవచ్చు.
కోపంతో రవీంద్ర జడేజా..
అభిమానుల్లోకి వెళ్లిన బాల్ ఎంతకూ రాకపోవడంతో జడేజాకు కోపం వచ్చినట్లుగా కనిపించింది. అభిమానుల వైపు కోపంగా జడేజా చూస్తూ ఉన్నాడు. దాదాపు రెండు మూడు నిమిషాల పాటు ఈ డ్రామా సాగిందని తెలుస్తోంది. వారు బాల్ వెంటనే ఇవ్వక పోవడంతో జడేజా వారి వైపు సీరియస్‌గా చూడటం, ఆ వెంటనే ఇవ్వడం జరిగిందని ఈ వీడియోను చూస్తే అర్థం అవుతోంది. ఆట మధ్యలో ఇలా జనాల్లో పడ్డ బాల్ కోసం గతంలోనూ రెండు మూడు సార్లు మ్యాచ్ కొన్ని నిమిషాల పాటు ఆపేయాల్సి వచ్చింది. బంతి దొరికన వారు వెంటనే ఇస్తే పర్వాలేదు, వారు దాచుకునే ప్రయత్నం చేస్తే ఇలా ఆటగాళ్లకు చిరాకు కలుగుతుంది. జడేజా కు ఇక్కడ కోపం రావడం కరెక్టే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
