Begin typing your search above and press return to search.

ఐపీఎల్‌ - 2024 షెడ్యూల్‌ ఇదే... ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడంటే..?

క్రికెట్‌ ప్రేమికులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కొత్త సీజన్‌ షెడ్యూల్‌ విడుదలైంది

By:  Tupaki Desk   |   22 Feb 2024 12:55 PM GMT
ఐపీఎల్‌ - 2024 షెడ్యూల్‌ ఇదే... ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడంటే..?
X

క్రికెట్‌ ప్రేమికులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కొత్త సీజన్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఈ క్రమంలో... మార్చి 22 నుంచి ఐపీఎల్‌ 17వ సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ సమయంలో... తొలి 15 రోజుల షెడ్యూల్‌ ను మాత్రమే తాజాగా నిర్వాహకులు ప్రకటించారు. మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 7 వరకు జరిగే మ్యాచ్‌ లను మాత్రమే తెలిపారు.

అవును... మొత్తంగా 21 మ్యాచ్‌ లకు సంబంధించిన షెడ్యూల్‌ ను ఐపీఎల్ నిర్వాహకులు తాజాగా ప్రకటించారు. మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 7 వరకు జరిగే మ్యాచ్‌ ల వివరాలు వెల్లడించారు. అయితే... సాధారణంగా డిఫెండింగ్‌ చాంపియన్‌ - రన్నరప్‌ మధ్య మ్యాచ్‌ తో కొత్త ఎడిషన్‌ ఆరంభించడం ఆనవాయితీ కానీ... ఈ సారి అందుకు భిన్నంగా సీ.ఎస్‌.కే - గుజరాత్‌ టైటాన్స్‌ బదులు.. సీ.ఎస్‌.కే - ఆర్సీబీతో 17వ ఎడిషన్‌ మొదలుపెట్టనున్నారు!

అయితే తొలి పదిహేను రోజుల షెడ్యూల్ మాత్రమే విడుదల చేయడానికి కారణం సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ అయ్యి ఉండొచ్చని అంటున్నారు! ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... ఆ తేదీలను బట్టి మిగతా షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు!

ఈ క్రమంలో మ్యాచ్ జరిగే తేదీ, జట్ల పేర్లు, మైదానం వివరాలు ఇప్పుడు చూద్దాం...!

మార్చి 22: చెన్నై సూపర్‌ కింగ్స్‌ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (చెన్నై)

మార్చి 23: పంజాబ్‌ కింగ్స్‌ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్‌ (మొహాలీ)

మార్చి 23: కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ వర్సెస్ సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ (కోల్‌ కతా)

మార్చి 24: రాజస్థాన్ రాయల్స్‌ వర్సెస్ లఖ్‌ నవూ సూపర్‌ జెయింట్స్‌ (జైపుర్)

మార్చి 24: గుజరాత్‌ టైటాన్స్‌ వర్సెస్ ముంబయి ఇండియన్స్‌ (అహ్మదాబాద్‌)

మార్చి 25: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్‌ (బెంగళూరు)

మార్చి 26: చెన్నై సూపర్ కింగ్స్‌ వర్సెస్ గుజరాత్‌ టైటాన్స్ (చెన్నై)

మార్చి 27: సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్ ముంబయి ఇండియన్స్‌ (హైదరాబాద్‌)

మార్చి 28: రాజస్థాన్‌ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్‌ (జైపుర్)

మార్చి 29: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వర్సెస్ కోల్‌ కతా నైట్‌ రైడర్స్ (బెంగళూరు)

మార్చి 30: లఖ్‌ నవూ సూపర్‌ జెయింట్స్‌ వర్సెస్ పంజాబ్‌ కింగ్స్‌ (లఖ్‌ నవూ)

మార్చి 31: గుజరాత్‌ టైటాన్స్‌ వర్సెస్ సన్‌ రైజర్స్ హైదరాబాద్ (అహ్మదాబాద్‌)

మార్చి 31: ఢిల్లీ క్యాపిటల్స్‌ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్‌ (వైజాగ్‌)

ఏప్రిల్ 01: ముంబయి ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్‌ రాయల్స్ (ముంబయి)

ఏప్రిల్ 02: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వర్సెస్ లఖ్‌ నవూ సూపర్‌ జెయింట్స్‌ (బెంగళూరు)

ఏప్రిల్ 03: ఢిల్లీ క్యాపిటల్స్‌ వర్సెస్ కోల్‌ కతా నైట్‌ రైడర్స్ (వైజాగ్‌)

ఏప్రిల్ 04: గుజరాత్‌ టైటాన్స్‌ వర్సెస్ పంజాబ్‌ కింగ్స్‌ (అహ్మదాబాద్‌)

ఏప్రిల్ 05: సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్‌ (హైదరాబాద్‌)

ఏప్రిల్ 06: రాజస్థాన్‌ రాయల్స్ వర్సెస్ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (జైపూర్)

ఏప్రిల్ 07: ముంబయి ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్‌ (ముంబయి)

ఏప్రిల్ 07: లఖ్‌ నవూ సూపర్‌ జెయింట్స్‌ వర్సెస్ గుజరాత్‌ టైటాన్స్‌ (లఖ్‌ నవూ)