Begin typing your search above and press return to search.

బెంగళూరు వర్సెస్ పంజాబ్... ఆసక్తికరమైన గణాంకాలివే!

ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 March 2024 7:39 AM GMT
బెంగళూరు వర్సెస్  పంజాబ్... ఆసక్తికరమైన గణాంకాలివే!
X

ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. మంచి జట్టు అయినప్పటికీ కావాల్సినన్ని మిస్టేక్స్ చేయడమే ఆ మ్యాచ్ లో ఆర్సీబీ ఓటమికి కారణం అనే కామెంట్లు బలంగా వినిపించాయి. ఈ క్రమమో ఈ రోజు పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. దీంతో చెన్నైతో జరిగిన మ్యాచ్ లోని మిస్టేక్స్ రిపీట్ కాకపోతే మెరుగైన ఫలితాలుంటాయని అంటున్నారు విశ్లేషకులు.

అవును... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ రోజు పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. డుప్లెసిస్ నేతృత్వంలోని ఆర్సీబీ తన మొదటి మ్యాచ్‌ లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చిత్తుగా ఓడిపోగా... మొహాలీలో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది. ఆ మ్యాచ్ లో పంజాబ్ బ్యాటర్ సాం కుర్రాన్ 47 బంతుల్లో 63 పరుగులతో వన్ మ్యాన్ షో చేశాడు. అంటే... ఒకరు గెలిచిన ఉత్సాహంలో ఉండగా.. మరొకరు గెలవాలనే కసితో ఉన్నారన్నమాట.

మరోవైపు, ఆ మ్యాచ్ లో చాలా పెద్ద పేర్లు వినిపించినప్పటికీ.. వారు బ్యాటింగ్‌ తో ఆకట్టుకోలేకపోయారు. ఇందులో భాగంగా... విరాట్ కోహ్లి 20 బంతుల్లో 21, ఫాఫ్ డుప్లెసిస్ 23 బంతుల్లో 35, గ్లెన్ మాక్స్‌ వెల్ గోల్డెన్ డక్‌ గా ఔటయ్యాడు. అయితే ఈ రోజు జరగనున్న చిన స్వామి స్టేడియంలో పిచ్ పూర్తిగా బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందని.. ఇది ఆర్సీబీకి కలిసి వచ్చే విషయమని చెబుతున్నారు!

ఆసక్తికరమైన గణాంకాలు!:

ఆర్సీబీ బ్యాటర్లపై పంజాబ్ బౌలర్ రబాడకు అద్భుతమైన రికార్డే ఉంది. ఇందులో భాగంగా... డూప్లెసిస్ పై 13 బంతుల్లో 16 పరుగులు ఇచ్చి రెండు సార్లు ఔట్ చేయగా... కొహ్లీకి 24 బంతులు వేసి, 27 పరుగులు ఇచ్చి 3 సార్లు ఔట్ చేశాడు. ఇక మాక్స్ వెల్ కి 20 బంతులు వేసిన రబాడా 23 పరుగులు ఇచ్చి రెండు సార్లు ఔట్ చేయగా... దినేష్ కార్తీక్ కు 19 బంతులు వేసి 14 పరుగులు ఇచ్చి మూడుసార్లు ఔట్ చేశాడు.

ఇక పంజాబ్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో... మహ్మద్ సిరాజ్, కర్ణ్ శర్మ, మాక్స్‌ వెల్‌ లకు వ్యతిరేకంగా 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు. వారి ముగ్గురు బౌలింగ్ లోనూ 42 బంతులు ఎదుర్కొన్న జానీ బెయిర్ ఒక్కసారికూడా అవుట్ కాకుండా 101 పరుగులు చేశాడు. దీంతో... వీరి మధ్య రసవత్తర పోరు ఉండే అవకాశం పుష్కలంగా ఉంది.

ఇదే సమయంలో... అర్ష దీప్, హర్షల్ పటేల్ లపై బ్యాటింగ్ ను కొహ్లీ ఆస్వాధించాడు. అర్ష్ దీప్ బౌలింగ్ లో ఒక్కసారి కూడా అవుట్ అవ్వకుండా 23 బంతులు ఆడి 44 పరుగులు చేయగా... హర్షల్ పటేల్ వేసిన 27 బంటుల్లో 43 పరుగులు చేశాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంచనా!:

విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌ వెల్, కామెరాన్ గ్రీన్, అనుజ్ రావత్ (కీపర్), దినేష్ కార్తీక్ , రీస్ టోప్లీ/అల్జారీ జోసెఫ్, కర్ణ్ శర్మ, మయాంక్ దాగర్, మహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్.

పంజాబ్ కింగ్స్ అంచనా!:

శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌ స్టో, ప్రభ్‌ సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్, జితేష్ శర్మ (కీపర్), లియామ్ లివింగ్‌ స్టోన్, శశాంక్ సింగ్, హర్‌ ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రబాదా, కాగిసో, రాహుల్ చాహర్, అర్ష్‌ దీప్ సింగ్