టాప్ స్పాట్ కోసం ఆర్సీబీ అద్భుతమే చేసింది!
ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్ రెండు స్థానాలు దక్కించుకోవడం ప్రతీ జట్టుకూ ఒక కల.
By: Tupaki Desk | 28 May 2025 10:11 AM ISTఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్ రెండు స్థానాలు దక్కించుకోవడం ప్రతీ జట్టుకూ ఒక కల. ఎందుకంటే ఈ స్థానాల్లో ఉన్న జట్లకు క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఆడే అవకాశం లభిస్తుంది. తద్వారా ఫైనల్‌కు చేరుకోవడానికి రెండు అవకాశాలు దొరుకుతాయి. ఈ కలను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నిజం చేసుకుంది. నిన్న రాత్రి లక్నోతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి రెండవ స్థానాన్ని దక్కించుకుంది.
ఈ మ్యాచ్‌లో RCB 227 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 19 ఓవర్లలోనే ఛేదించింది. ఈ అద్భుత విజయంతో బెంగళూరు క్వాలిఫయర్ 1కి అర్హత సాధించింది. ఈ ఫలితం బెంగళూరు ఫ్రాంచైజీకి ఎంతో గర్వకారణంగా నిలిచింది.
- ప్లేఆఫ్స్ ఉత్కంఠ
ఇప్పుడు టాప్ 2 స్థానాలు ఖరారయ్యాయి. మే 29న RCB పంజాబ్‌తో తలపడుతుంది. ఇందులో ఓడినా మరోసారి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మే 30న ముంబై, గుజరాత్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో గెలిచిన జట్టు టాప్ 2లు తలపడగా ఓడిన జట్టుతో ఆడాల్సి ఉంటుంది. సో ఆర్సీబీకి ఇప్పుడు ఫైనల్ వెళ్లేందుకు రెండు అవకాశాలు ఉంటాయి.
- ఫైనల్ బెర్త్ కోసం హోరాహోరీ
బెంగళూరు, పంజాబ్ మధ్య జరిగే మ్యాచ్‌లో ఓడిన జట్టు, ముంబై, గుజరాత్ మధ్య మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో తుది అర్హత కోసం పోటీపడుతుంది. ఈ మ్యాచ్‌లు నాలుగు టాప్ జట్లకు ఎంతో కీలకంగా మారాయి. ఆట మరింత ఆసక్తికరంగా మారింది. అభిమానులకైతే ఇది టెన్షన్‌తో పాటు ఎంజాయ్ చేసే సమయం! ఈ ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు చూడటానికి మీరు సిద్ధంగా ఉండండి..
