ఐపీఎల్ వాయిదా.. నష్టం దాదాపు రూ.వెయ్యి కోట్లు.. అంతకుమించి కూడా
ఈ ఏడాది మాత్రం ఎవరూ ఊహించని విధంగా పాకిస్థాన్ తో యుద్ధం రూపంలో లీగ్ కు పెద్ద అవాంతరం ఎదురైంది.
By: Tupaki Desk | 10 May 2025 4:15 PM ISTదాదాపు రూ.లక్ష కోట్ల లీగ్.. పది జట్లు.. పన్నెండు మైదానాలు.. వందల మంది అంతర్జాతీయ, జాతీయ ఆటగాళ్లు.. లక్షల మంది ప్రేక్షకులు.. టీవీల్లో, ఓటీటీల్లో కోట్లమంది వీక్షకులు.. రూ.వేల కోట్ల టర్నోవర్.. ఇదీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటే..
ఇలాంటి క్యాష్ రిచ్ లీగ్ ప్రపంచంలో మరోటి లేదంటే ఆశ్చర్యం లేదు. 17 సీజన్లుగా ఎన్ని ఆటంకాలు ఎదురైనా దిగ్విజయంగా సాగింది లీగ్. కానీ, ఈ ఏడాది మాత్రం ఎవరూ ఊహించని విధంగా పాకిస్థాన్ తో యుద్ధం రూపంలో లీగ్ కు పెద్ద అవాంతరం ఎదురైంది.
ఏప్రిల్ 22న ఐపీఎల్ జరుగుతుండగానే.. పెహల్గాంలో పర్యటకులపై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దారుణమైన దాడికి దిగారు. దీనికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన చర్యలతో పాకిస్థాన్ వణికిపోతోంది. ప్రతీకారం తీర్చుకుంటాం అంటూ బీరాలు పోతోంది. పాకిస్థాన్ తో అయ్యేది పొయ్యేది లేకున్నా.. భారత్ ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఐపీఎల్ ను వారం రోజుల పాటు వాయిదా వేశారు. లీగ్ చరిత్రలో తొలిసారిగా ఇలా చేశారు.
ఐపీఎల్ ను ప్రస్తుతానికి వారమే వాయిదా వేశారని చెబుతున్నారు. మళ్లీ ఎప్పుడు నిర్వహించేదీ వెల్లడి కావాల్సి ఉంది. కానీ, వాయిదా కారణంగా బీసీసీఐ రోజుకు రూ.125 కోట్ల నష్టం వస్తోందట. వారం వాయిదా వేశారు కాబట్టి రూ.875 కోట్లు లాస్ అనుకోవచ్చు.
బీసీసీఐకే కాదు.. ఫ్రాంచైజీ యజమానులు.. ఆటగాళ్లు, ప్రధాన వాటాదారులు, స్పాన్సర్లు, హోస్ట్ ప్రసారకులు.. ఇలా అందరికీ నష్టమేనట.
భారత్ తన యుద్ధాన్ని తీవ్రం చేస్తే ఐపీఎల్ వారం తర్వాత అయినా జరుగుతుందా? అనేది అనుమానమే. ఇప్పటికే పాకిస్థాన్ చేతకాకున్నా గొప్పలు పోతోంది. అయితే, భారత్ కొట్టే దెబ్బకు దారికి వస్తే.. ఐపీఎల్ నిర్వహణకు మార్గం సుగమం అయినట్లే.
