Begin typing your search above and press return to search.

3-6-2025: 18..కోహ్లి 18...సీజన్ 18...ఏఐ, అంకెలన్నీ ఆర్సీబీ వైపే..

మొదటి సీజన్ నుంచి ఆర్సీబీని అంటిపెట్టుకుని ఉన్నాడు టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి.

By:  Tupaki Desk   |   3 Jun 2025 5:17 PM IST
3-6-2025: 18..కోహ్లి 18...సీజన్ 18...ఏఐ, అంకెలన్నీ ఆర్సీబీ వైపే..
X

ఎన్నేళ్లు.. ఎన్ని సీజన్లు.. ఇదిగో కప్ అంటూ బరిలో దిగడం.. ఉసూరంటూ వెనుదిరగడం.. ఇదీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తీరు. మూడుసార్లు ఫైనల్ చేరినా రన్నరప్ తోనే సరిపెట్టుకుంది. ఈసారి 18వ సీజన్ లో మాత్రం కప్ కొడుతుందని గట్టిగా నమ్ముతున్నారు. కాలమే కాదు.. అంకెలూ తమకు కలిసొస్తున్నాయని అంటున్నారు ఆ జట్టు అభిమానులు.

మొదటి సీజన్ నుంచి ఆర్సీబీని అంటిపెట్టుకుని ఉన్నాడు టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి. ఇన్నేళ్లలో అతడికి ఎప్పుడూ ఆర్సీబీని వీడాలనే ఆలోచన రాలేదు. అలాంటి కోహ్లి.. క్రికెట్ లోకి వచ్చినప్పటి నుంచి 18వ నంబరు జెర్సీనే ధరిస్తున్నాడు. 1+8 కలిపితే 9. మరోవైపు ఇది 2025 సంవత్సరం. ఈ అంకెలన్నీ కూడినా 9 వస్తోంది. ఇప్పుడు దీనిని ఐపీఎల్ 18వ సీజన్ కు ముడిపెడుతూ.. సెంటిమెంట్ ప్రకారం కచ్చితంగా కప్ తమదే అంటున్నారు ఆర్సీబీ అభిమానులు.

ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మంగళవారం ఫైనల్ జరుగుతోంది. తేదీ వచ్చేసి 03-06-2025. ఈ అంకెలన్నీ కూడినా 18 వస్తోంది. చివరకు 9 అవుతుంది. ఇలా ఆర్సీబీకి అన్నీ మంచి శకునాలే అని అభిమానులు సంబరపడుతున్నారు.

ఆర్సీబీ, పంజాబ్ సమఉజ్జీలు కావడంతో ఎవరిది గెలుపు? అని ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ)ను అడిగితే అవి ఏం చెప్పాయంటే..

-ఎక్స గ్రోక్ తన ఓటును క్వాలిఫయర్ 1లో పంజాబ్ పై గెలిచిన

ఆర్సీబీకి వేసింది. అయితే, స్వల్ప ఆధిక్యమే ఇచ్చింది.

-జెమిని మాత్రం.. పంజాబ్ కింగ్స్ వైపు మొగ్గుచూపింది.

-బాగా పాపులర్ అయిన చాట్ జీపీటీ మాత్రం ప్రదర్శన ఆధారంగా బెంగళూరుకు ఓటేసింది. పంజాబ్ పోటీ ఇస్తుందని పేర్కొంది.

-మెటా మాత్రం.. ఏ జట్టుకూ ఓటు వేయలేదు.. ఫైనల్ హోరాహోరీ అని మాత్రం తేల్చింది. పంజాబ్ పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచిందని.. క్వాలిఫయర్ 1లో ఓడినా.. క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్ ను చిత్తుచేసిందని పేర్కొంది.