Begin typing your search above and press return to search.

ఐపీఎల్ ఫైనల్స్ వేళ... కొహ్లీకి బెంగళూరు బిగ్ షాక్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీల్ - 2025) ఫైనల్స్ ఎవరెవరి మధ్య అనేది ఆదివారం తేలిపోయింది. వచ్చిన రెండో అవకాశాన్ని అద్భుతంగా అందిపుచ్చుకున్న పంజాబ్.. స్ఫూర్తిదాయక పెర్ఫార్మెన్స్ తో ఐపీఎల్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది.

By:  Tupaki Desk   |   2 Jun 2025 2:41 PM IST
RCB vs Punjab Kings: IPL 2025 Final Set Amid Kohlis Pub Controversy
X

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీల్ - 2025) ఫైనల్స్ ఎవరెవరి మధ్య అనేది ఆదివారం తేలిపోయింది. వచ్చిన రెండో అవకాశాన్ని అద్భుతంగా అందిపుచ్చుకున్న పంజాబ్.. స్ఫూర్తిదాయక పెర్ఫార్మెన్స్ తో ఐపీఎల్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. దీంతో... క్వాలిఫయర్ - 1 లోని పోటీ మరోసారి కనిపించబోతోంది! ఆర్సీబీతోతో పంజాబ్ తలపడబోతుంది.

ఆదివారం జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్ లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అదిరే బ్యాటింగ్ తో ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఫలితంగా.. 2014లో ఒకే ఒక్కసారి ఐపీఎల్ ఫైనల్ కు చేరుకున్న ఆ జట్టును మరోసారి ఫైనల్ కు చేర్చాడు. దీంతో.. ఫైనల్లో బెంగళూరును పంజాబ్ కింగ్స్ ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో కొహ్లీకి బెంగళూరు షాకిచ్చింది.

అవును... మరో కొన్ని గంటల్లో ఐపీఎల్ ఫైనల్ లో తలబడబోతున్న బెంగళూరు జట్టు రన్ మెషిన్ విరాట్ కొహ్లీకి తాజాగా బెంగళూరు పోలీసులు బిగ్ షాకిచ్చారు. ఇందులో భాగంగా.. కొహ్లీకి చెందిన వన్-8 కమ్యూన్ పబ్ అండ్ రెస్టారెంట్ పై సుమోటో కేసు నమోదు చేసింది. ఇప్పటికే.. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) కూడా షాకిచ్చింది.

కొహ్లీకి చెందిన వన్-8 కమ్యూన్ పబ్ అండ్ రెస్టారెంట్ పై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. సిగరెట్స్ అండ్ అదర్ టోబాకో ప్రోడక్ట్స్ యాక్ట్ (కోప్టా) కింద ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ యాక్ట్ లోని సెక్షన్ 4, 21 కింద పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. రెస్టారెంట్ లో ఎక్కడా స్మోకింగ్ జోన్ ఏర్పాటు చేయకపోవడమే దీనికి కారణం!

మరోవైపు.. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) కూడా కొహ్లీకి షాకిచ్చింది. ఇందులో భాగంగా... ఆ రెస్టారెంంట్ కు నోటీసులు జారీ చేసింది. వాస్తవానికి గత డిసెంబర్ లో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఆ సమయంలో.. అగ్నిమాపక విభాగం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోకపోవడం వల్ల అప్పట్లో బీబీఎంపీ ఈ నోటీసులు ఇచ్చింది.

గతంలో నోటీసు ఇచ్చినప్పటికీ వన్-8 కమ్యూన్ యాజమాన్యం స్పందించడంలో లేదా దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో విఫలమైందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వివరణ ఇవ్వడానికి వన్-8 కమ్యూన్ కు 7 రోజుల గడువు ఇచ్చింది. అప్పటికీ స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది!

కాగా... మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - పంజాబ్ కింగ్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎవరు గెలిచినా కొత్త ఛాంపియన్ వచ్చినట్లే. ఇప్పటివరకూ బెంగళూరు కానీ, పంజాబ్ కానీ ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకోలేదు!