Begin typing your search above and press return to search.

చుక్కలు చూపించిన ధర్మశాల ఔట్ ఫీల్డ్

ప్రపంచకప్ టోర్నీ అన్న వేళ.. మ్యాచ్ నిర్వహించే గ్రౌండ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

By:  Tupaki Desk   |   23 Oct 2023 5:44 AM GMT
చుక్కలు చూపించిన ధర్మశాల ఔట్ ఫీల్డ్
X

ప్రపంచకప్ టోర్నీ అన్న వేళ.. మ్యాచ్ నిర్వహించే గ్రౌండ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా ధర్మశాల గ్రౌండ్ ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. టీమిండియా.. కివీస్ లాంటి రెండు బలమైన జట్లు తలపడే మ్యాచ్ కు వేదికగా నిలిచిన ధర్మశాల స్టేడియంలో ఔట్ ఫీల్డ్ పేలవంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రపంచకప్ టోర్నీ మ్యాచ్ కు ఇలాంటి ఔట్ ఫీల్డ్ ఉండటమా? అని ప్రశ్నిస్తున్నారు.

ఔట్ ఫీల్డ్ పేలవంగా ఉంటే ఆటగాళ్లు గాయాలబారిన పడతారు. ఈ భయంతో భారత్.. న్యూజిలాండ్ ఆటగాళ్లు డ్రైవ్ చేయటానికి సైతం వెనక్కి తగ్గారు. కివీస్ ఇన్నింగ్స్ ఆరంభంలో జారుతూ బంతిని ఆపే ప్రయత్నం చేసిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ చేతి వేలికి గాయమైంది. దీంతో.. చికిత్స కోసం గ్రౌండ్ ను విడిచి పెట్టి వెళ్లాల్సి వచ్చింది. కాసేపటికి మళ్లీ ఆటలోకి వచ్చినప్పటికీ.. ఆయన వేలి గాయం ఇబ్బంది పెడుతూనే ఉంది.

35ఓవర్లో ఫైన్ లెగ్ బౌండరి వద్ద బుమ్రా డ్రైవ్ చేయకుండానే బౌండరీ ఇచ్చేశాడు. ఒకవేళ.. డ్రైవ్ చేసి ఉంటే.. పరుగులు తగ్గించొచ్చు. అందుకు గాయాల బారిన పడాల్సి ఉంటుంది. ధర్మశాలలో ఔట్ ఫీల్డ్ ఏ మాత్రం బాగోలేదని ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జోస్ బటర్ల్ కూడా వ్యాఖ్యానించటం గమనార్హం. ఇప్పటివరకు ఇక్కడ జరిగే మ్యాచ్ లో ఆటగాళ్లు జారిపడటం.. గాయాల బారిన పడటం రోటీన్ గా మారింది.

ఔట్ ఫీల్డ్ బాగాలేని కారణంగానే.. టీమిండియా జట్టు ఫీల్డింగ్ పేలవంగా ఉండటమే కాదు.. పలు క్యాచ్ లు చేజార్చుకోవటానికి కారణమని వ్యాఖ్యానిస్తున్నారు. ఔట్ ఫీల్డ్ బాగోలేకపోవచ్చు. కానీ.. సులువైన క్యాచ్ లను ఎలా వదిలేస్తారని ప్రశ్నిస్తున్నారు. మ్యాచ్ లో విజయం సాధించిన కారణంగా టీమిండియా సభ్యులు పేలవ ఆట మరుగున పడింది కానీ.. రానున్న రోజుల్లో జరిగే మ్యాచ్ లకు ఇదే తీరును ప్రదర్శిస్తే మాత్రం భారీ మూల్యాన్నిచెల్లించుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. కివీస్ మ్యాచ్ సందర్భంగా జడేజా.. రాహుల్.. బుమ్రాలు ముగ్గురు క్యాచ్ లను విడిచిపెట్టేశారు. ఒకవేళ.. వీరు కానీ క్యాచ్ లను మిస్ చేయకుంటే.. కివీస్ స్కోర్ మరింత తక్కువగా ఉండేదన్న మాట బలంగా వినిపిస్తోంది.